ఎంసెట్ రాస్తున్నారా... నిబంధనలు తెలుసుకోండి..!
విద్యార్థులు ఆత్రుతగా ఎదురుచూస్తున్న ఎంసెట్ పరీక్ష సమయం తరుముకొస్తోంది. ఈ నెల 29వ తేదీన పరీక్ష జరగనుంది. పరీక్ష బాగా రాసి కలలను నెరవేర్చుకోవాలని భావిస్తున్న సరస్వతీ పుత్రులంతా ముందుగా నిబంధనలను తెలుసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. గతంలో కంటే ఈసారి కొన్ని మార్పులు..చేర్పులు చేపట్టినందున వాటి గురించి అవగాహన కలిగి ఉండాలని, ఒక్క నిమిషం ఆలస్యమైన పరీక్షకు అనుమతించని విషయాన్ని గమనించాలని సూచిస్తున్నారు. జీవిత లక్ష్యం.. విలువైన సమయం మళ్లీ రావనే సత్యాన్ని తెలుసుకోవాలని స్పష్టం చేస్తున్నారు. - ఎచ్చెర్ల
* పరీక్ష నిర్వహణకు చకచకా ఏర్పాట్లు
* ‘నిమిషం’ నిబంధనపై విద్యార్థులకు అప్రమతం అవసరం
* ఇంజినీరింగ్‌కు 11, మెడిసన్‌కు ఐదు కేంద్రాల కేటాయింపు
ఎచ్చెర్ల: ఈ నెల 29వ తేదీన నిర్వహించనున్న ఎంసెట్‌కు సంబంధించి 8049 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో ఇంజినీరింగ్‌కు 5,918, మెడిసన్‌కు 2131 మంది ఉన్నారు.
* ఇంజినీరింగ్‌కు సంబంధించి 11 కేంద్రాల్లో ఉదయం పది నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకూ, మెడిసన్ సంబంధించి మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు ఐదు కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించనున్నారు.
* విద్యార్థులను గంట ముందు పరీక్ష హాల్‌లోకి అనుమతిస్తారు.
* ఈసారి పరీక్ష కేంద్రాల్లో జా మర్లు అమర్చుతున్నందున ఎలక్ట్రానిక్ పరికరాలు, సెల్‌ఫోన్లు పని చేయవు.
* ఈసారి చేతి గడియారాలను సైతం పరీక్ష కేంద్రంలోకి అను తించరు.
* పరీక్ష కేంద్రంలో గోడ గడియారాలను విద్యార్థులు సమయం తెలుసుకోవడానికి అందుబాటులో ఉంచుతారు. ఫోన్లు, వాచీలు, క్యాలిక్‌లేటర్లు వంటి ఎలక్ట్రానిక్ వస్తువులు పరీక్ష కేంద్రంలోకి తీసుకెళ్లడాన్ని నిషేధించారు.
* విద్యార్థుల హాల్ టిక్కెట్, బ్లాక్, బ్లూల్ బా ల్ పాయింట్ పెన్, కుల ధ్రువీకరణ పత్రం నక లు పరిశీలకులకు అంద జేయాలి.
* ఆన్‌లైన్ దరఖాస్తుపై ఫొటో అంటించి ఎటస్టేషన్ చేయించిన కాపీని విద్యార్థి పట్టుకుని వెళ్లాలి.
* నిమిషం ఆలసమైన పరీక్షకు అనుమతించ ని నిబంధన కచ్చి తంగా అమలవుతుంది. ఈ విషయంలో విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలి.
* విద్యార్థి వేలి ముద్రను సైతం ఈసారి తీసుకుంటారు. కవలలు ఒకరికి బదులు ఒకరు పరీక్ష రాస్తున్న సంఘటనలకు పూర్తిగా చెక్ పెట్టేందుకు వేలి ముద్రలు సేకరించాలని అధికారు లు ఈసారి నిర్ణయించారు. ఈ నిబంధన ఇప్పటికే జేఈఈ వంటి పరీక్షల నిర్వహణలో అమలు చేస్తున్నారు.
* దివ్యాంగ విద్యార్థులకు అదనపు సమ యం, సహాయకుల కేటాయింపు ఉంటుంది. ఇన్విజిలేటర్ అంజేసిన ఓఎంఆర్ సీట్‌లో విద్యార్థులు రిజర్వేషన్ కేటగిరీ, జెండర్, లోకల్ ఏరియా ఆంధ్రా యూనివర్సిటీ, బుక్‌లెట్ నంబర్, కోడ్, సక్రమంగా నింపాలి.
* పర్యవేక్షకుడి సమక్షంలో మాత్రమే సంత కం చేయాలి, వేలిముద్ర వేయాలి.
* ప్రశ్నపత్రం అందజేసిన వెంటనే ముందు గా ప్రింటును సరిచూసు కోవాలి. ప్రింట్ సమ స్య ఉంటే ఇన్విజిలేటర్ దృష్టికి తీసుకెళ్లి మార్చుకోవాలి. ప్రతి పేజీ క్షణ్ణంగా పరిశీలించాలి.
సహాయం కోసం
సహాయం కోసం ప్రభుత్వం కొన్ని హెల్ప్‌లైన్, టోల్ ఫ్రీ నంబర్లను అందుబాటులో ఉంచుతుంది. సమస్యలు, సందేహాలు ఈ కాల్స్ ద్వా రా నివృత్తి చేస్తారు. 18004256755, 0884-2340535, 0884-2356255, 0884-23405459, జిల్లా ఎంసెట్ కోఆర్డినేటర్ డాక్టర్ బాబూరావు 9440931686 నంబర్లను విద్యార్థులు సంప్రదించవచ్చు.
పక్కాగా నిబంధనలు అమలు
కన్వీనర్ ప్రకటించిన నిబంధనలు పక్కాగాపాటిస్తాం. విద్యార్థులు కూడా నిబంధనలపై అవగాహనతో ఉం డాలి. ఇంజినీరింగ్‌కు 11, మెడిషన్‌కు ఐదు కేంద్రాలను కేటాయించి.. ఏర్పాట్లు చేస్తున్నాం. అందుబాటులో ఉన్న కేంద్రాలను ఎంచుకున్నాం. ‘నిమిషం’ నిబంధన పట్ల విద్యార్థులు అప్రమతంగా ఉండా లి. కనీసం గంట ముందుగానే పరీక్ష కేంద్రానికి చేరుకునేలా జాగ్రత్త పడాలి.
- డాక్టర్ బాబూరావు, జిల్లా కో ఆర్డినేటర్, ఎంసెట్-2016