EAMCET -2016
-
రేపటి నుంచి ఎంసెట్ హాల్‌టికెట్లు
15వ తేదీన పరీక్ష.. నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ: ఎంసెట్ కన్వీనర్ రమణరావు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఇంజనీరింగ్, అగ్రికల్చర్ అండ్ మెడికల్ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈ నెల 15న ఎంసెట్-2016 నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఎంసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ ఎన్వీ రమణరావు వెల్లడించారు. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల 12 నుంచి హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌కు అవకాశం కల్పించామని, అయితే తల్లిదండ్రులు, విద్యార్థులు ముందుగానే పరీక్ష కేంద్రాలకు వెళ్లి చూసి వచ్చేందుకు వీలుగా ఈ నెల 9 నుంచే హాల్ టికెట్లను తమ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకునే అవకాశం కల్పించినట్లు తెలిపారు. ఎంసెట్ నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లపై శనివారం జేఎన్టీయూహెచ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సమయానికి గేట్ లోపలికి వస్తే చాలు మొత్తం 468 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇవన్నీ ప్రభుత్వ హైస్కూళ్లు, జూనియర్, డిగ్రీ కాలేజీలు, యూనివర్సిటీలు, పోలీసు అకాడమీ వంటి శిక్షణ సంస్థల్లోనే ఏర్పాటు చేశారు. విద్యార్థులను పరీక్ష హాల్లోకి గంట ముందుగానే అనుమతిస్తారు. నిమిషం ఆలస్యమైనా పరీక్ష కేంద్రంలోని అనుమతించరు. అయితే పరీక్ష కేంద్రం గేట్‌ను కటాఫ్‌గా తీసుకుంటారు. గేట్ లోపలికి ఉదయం పరీక్ష కోసం 10 గంటలకు, మధ్యాహ్నం పరీక్ష కోసం 2:30 గంటలకు వచ్చిన వారిని పరీక్ష రాసేందుకు అనుమతిస్తారు. ఈ నిబంధన ఉన్నందున విద్యార్థులు సాధ్యమైనంత ముందుగా పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని, తర్వాత ఆందోళన చెందవద్దని అధికారులు సూచించారు. ఈ సారి కొత్తగా బయోమెట్రిక్ హాజరు విధానం అమలు చేస్తున్నారు. భవిష్యత్తులో ఈ సమాచారాన్ని ఫీజు రీయింబర్స్మెంట్ ఇతర అవసరాలకు వినియోగిస్తారు. మరోవైపు ఇన్విజిలేటర్లు, అబ్జర్వర్లు పరీక్ష కేంద్రానికి మొబైల్ ఫోన్లు తీసుకురాకుండా నిబంధన విధించారు. వెబ్సైట్లో ఓఎంఆర్ జవాబు పత్రం ఎంసెట్ పరీక్ష నిర్వహించిన రోజే ప్రాథమిక కీ విడుదల చేస్తారు. ఫలితాలు వెల్లడించిన వెంటనే ఓఎంఆర్ జవాబు పత్రాలను వెబ్సైట్ లో అందుబాటులో ఉంచుతారు. కీలోని అంశా లు, ఓఎంఆర్ జవాబు పత్రాల్లోని అంశాల్లో తేడాలు ఉంటే ఛాలెంజ్ చేయవచ్చు. ఓఎంఆర్ కార్బన్‌లెస్ కాపీ ఈసారి ఇవ్వడం లేదు. ఏపీకి ఇక్కడి నుంచి స్పెషల్ అబ్జర్వర్లు ఏపీలో నిర్వహించే పరీక్షకు అక్కడి అధికారులు అబ్జర్వర్లుగా ఉండటంతోపాటు ఇక్కడి నుంచి స్పెషల్ అబ్జర్వర్లను పంపిస్తారు. ఏపీలో పరీక్ష నిర్వహణకు పక్కా ఏర్పాట్లు చేశారు. ఒక్కో కేంద్రంలో 250 నుంచి 500 మందికి పరీక్ష ఉంటుంది. విద్యార్థులూ.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.. ఒకసారి పరీక్ష హాల్లోకి వస్తే పరీక్ష పూర్తయ్యేంత వరకు బయటకు పంపించరు. పరీక్ష ప్రారంభమైన తర్వాత టాయిలెట్‌కు వెళ్లాలన్నా కుదరదు. ఇక పరీక్ష హాల్లోనే విద్యార్థులకు అర లీటర్ వాటర్ బాటిళ్లను అందజేస్తారు. హాల్‌టికెట్లను కచ్చితంగా వెంట తెచ్చుకోవాలి. లేదంటే హాల్లోకి అనుమతించరు. పరీక్ష పూర్తయ్యాక ఓఎంఆర్ జవాబు పత్రం, పూర్తి చేసిన ఆన్లైన్ దరఖాస్తు ఫారం పరీక్ష హాల్లో అందజేయాలి. లేదంటే వారి ఫలితాలను విత్‌హెల్డ్‌లో పెడతారు. ఓఎంఆర్ జవాబు పత్రం ఇవ్వకుండా తీసుకెళ్లే వారిపై క్రిమినల్ చర్యలు చేపడతారు. సాధారణ బ్లూ లేదా బ్లాక్ బాల్‌పాయింట్ పెన్ వెంట తెచ్చుకోవాలి. క్యాలిక్యులేటర్లు, వాచీలు, పేజర్లు, ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను పరీక్ష హాల్లోకి అనుమతించరు. పరీక్ష కేంద్రాల్లో జామర్లు ఏర్పాటు చేస్తారు. బ్లూటూత్, స్పైకెమెరాలు, కెమెరాలు కలిగిన అద్దాలతో వచ్చే వారిపై క్రిమినల్ చర్యలు చేపడతారు. ఆన్లైన్లో పూర్తి చేసిన దరఖాస్తు ఫారంలోని ఫొటోపై సంబంధిత ప్రిన్సిపల్/గెజిటెడ్ ఆఫీసర్ అటెస్టేషన్ చేయించాలి. -
ఏపీ ఎంసెట్ ఇంజినీరింగ్ పరీక్ష ప్రారంభం
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ఎంసెట్-2016 ఇంజినీరింగ్ పరీక్ష ప్రశాంతంగా ప్రారంభమైంది. ఇంజినీరింగ్ పరీక్షకు ఏపీలో 329, హైదరాబాద్‌లో 26 మొత్తం 355 పరీక్ష కేంద్రాలను అధికారులు ఏర్పాటుచేశారు. 1,89,273 మంది విద్యార్థులు ఇంజినీరింగ్ పరీక్ష రాయనున్నారు. ఇంజినీరింగ్ సెట్ కోడ్ జీ-2, మెడికల్‌కు ఎల్-2 ప్రశ్నాపత్రాలను మంత్రులు గంటా శ్రీనివాసరావు, కామినేని శ్రీనివాస్ లు ఎంపిక చేశారు. నిమిషం నిబంధనను అధికారులు పటిష్టంగా అమలుజేశారు. పలు సెంటర్లలో ఆలస్యంగా వచ్చిన విద్యార్థులను పరీక్ష సెంటర్లలోనికి అనుమతించలేదు. అన్ని పరీక్షా కేంద్రాల వద్ద జామర్ల ఏర్పాటు, భారీగా బందోబస్తుతో పాటు 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. ఎంసెట్ కేంద్రాల వద్ద కంప్యూటర్ సెంటర్లు, జిరాక్సు సెంటర్లు హోటళ్లను మూసివేయించేలా అధికారులు చర్యలు తీసుకున్నారు. -
ఇంజినీరింగ్‌కు జీ-2 ప్రశ్నాపత్రం ఎంపిక
కాకినాడ: ఏపీ ఎంసెట్ ఇంజినీరింగ్ పరీక్షకు సెట్ కోడ్ జీ-2 ప్రశ్నాపత్రాన్ని మంత్రి గంటా శ్రీనివాసరావు ఎంపిక చేశారు. ఏపీ ఇంజినీరింగ్ అగ్రికల్చర్ మెడికల్ కామన్ ఎంట్రన్సు టెస్టు (ఎంసెట్)-2016 పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు మంత్రి గంటా తెలిపారు. కాకినాడలో శుక్రవారం ఉదయం 6 గంటలకు సెట్ కోడ్ ఎంపిక కార్యక్రమంలో డిప్యూటీ సీఎం చినరాజప్ప, మంత్రి కామినేని శ్రీనివాస్, సాంకేతిక విద్యాశాఖ కార్యదర్శి, అధికారులు పాల్గొన్నారు. శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఇంజినీరింగ్, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు మెడికల్, అగ్రికల్చర్ విభాగాల పరీక్షలు జరుగుతాయి. ఇంజనీరింగ్ విభాగంలో ఏపీలో 329, హైదరాబాద్‌లో 26 మొత్తం 355 పరీక్ష కేంద్రాలు ఏర్పాటుచేశారు. మెడికల్, అగ్రికల్చర్ విభాగానికి ఏపీలో 165, తెలంగాణలో 26 కేంద్రాలు ఏర్పాటుచేశారు. శుక్రవారం జరగనున్న ఏపీ ఎంసెట్‌కు 2,92,507 మంది హాజరుకానున్నారు. ఇంజినీరింగ్‌లో 1,89,273 మంది, మెడికల్‌లో 1,03,234 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. తెలంగాణ నుంచి ఏపీ ఎంసెట్‌కు పెద్ద సంఖ్యలో విద్యార్థులు దరఖాస్తులు చేసుకున్నారు. ఎంసెట్ కేంద్రాల వద్ద కంప్యూటర్ సెంటర్లు, జిరాక్సు సెంటర్లు హోటళ్లను మూసివేయించేలా ఆదేశాలు జారీచేశామని, అన్ని కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించామని అధికారులు తెలిపారు. శుక్రవారం సాయంత్రం వెబ్సైట్లో ప్రిలిమినరీ కీ ఉంచుతామని, అభ్యంతరాలు ఉంటే మే 4 సాయంత్రంలోగా తెలపవచ్చని, మే 9న ఫైనల్ కీతో పాటు ర్యాంకులు వెల్లడిస్తామని ఎంసెట్ చైర్మన్ ప్రొఫెసర్ వీఎస్ఎస్ కుమార్, కన్వీనర్ ప్రొఫెసర్ సీహెచ్ సాయిబాబు తెలిపారు. -
ఏపీ ఎంసెట్ యథాతథం
♦ యథావిధిగా పరీక్షలు..మంత్రులు గంటా, కామినేని వెల్లడి ♦ కాకినాడ జేఎన్టీయూ ఆధ్వర్యంలో ఏర్పాట్లు పూర్తి సాక్షి, హైదరాబాద్: ఏపీ ఇంజనీరింగ్ అగ్రికల్చర్ మెడికల్ కామన్ ఎంట్రన్సు టెస్టు (ఎంసెట్)-2016 శుక్రవారం (29 ఏప్రిల్) యథాతథంగా జరగనుందని రాష్ట్ర మానవవనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రకటించారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన జారీచేశారు. మరోవైపు షెడ్యూల్ ప్రకటించి ఉన్నందున ఎంసెట్ పరీక్షలు యధావిధిగా జరుగుతాయని, జాతీయ అర్హత, ప్రవేశ పరీక్ష (నీట్) నిర్వహణపై సుప్రీంకోర్టు ఉత్తర్వులను క్షుణ్నంగా పరిశీలించి తదుపరి చర్యలు చేపడతామని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ ప్రకటించారు. దీంతో ఏపీ ఎంసెట్‌ను యథావిధిగా నిర్వహించడానికి కాకినాడ జేఎన్టీయూ అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఇంజనీరింగ్, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు మెడికల్, అగ్రికల్చర్ విభాగాల పరీక్షలు యథాతథంగా జరుగుతాయని ఎంసెట్ చైర్మన్ ప్రొఫెసర్ వీఎస్ఎస్ కుమార్, కన్వీనర్ ప్రొఫెసర్ సీహెచ్ సాయిబాబు పేర్కొన్నారు. ఇంజనీరింగ్ విభాగంలో ఏపీలో 329, హైదరాబాద్‌లో 26 మొత్తం 355 పరీక్ష కేంద్రాలు ఏర్పాటుచేశారు. మెడికల్, అగ్రికల్చర్ విభాగానికి ఏపీలో 165, తెలంగాణలో 26 కేంద్రాలు ఏర్పాటుచేశారు. పరీక్షల నిర్వహణకు సంబంధించి ఇన్విజిలేటర్లు, చీఫ్సూపరింటెండెంట్లు తదితర అధికారులు కాకుండా పర్యవేక్షణకు సంబంధించి మొత్తం 713 మందిని పరిశీలకులు, ప్రత్యేక అబ్జర్వర్లు, ఎన్ఫోర్సుమెంటు అధికారులుగా నియమించారు. అభ్యర్ధులు గంట ముందుగా పరీక్ష హాలుకు చేరుకోవాలని, పరీక్ష ప్రారంభ సమయానికి ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చినా పరీక్ష కేంద్రంలోకి అనుమతించబోమని అధికారులు ప్రకటించారు. ఏపీ ఎంసెట్‌కు 2,92,507 మంది బాలాజీచెరువు (కాకినాడ) : శుక్రవారం జరగనున్న ఏపీ ఎంసెట్‌కు 2,92,507 మంది హాజరుకానున్నారని ఎంసెట్ కన్వీనర్ సాయిబాబు తెలిపారు. ఆయన గురువారం ఇక్కడ మాట్లాడుతూ ఇంజనీరింగ్‌లో 1,89,273 మంది, మెడికల్‌లో 1,03,234 మంది ఉన్నారని పేర్కొన్నారు. తెలంగాణ నుంచి ఏపీ ఎంసెట్‌కు పెద్ద సంఖ్యలో దరఖాస్తు చేశారని వివరించారు. ఎంసెట్ కేంద్రాల వద్ద కంప్యూటర్ సెంటర్లు, జిరాక్సు సెంటర్లు హోటళ్లను మూసివేయించేలా ఆదేశాలు జారీచేశామని, అన్ని కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించారని తెలిపారు. ఏపీఎస్ఆర్టీసీ అదనపు బస్సులు నడపడంతోపాటు ఆయా విద్యార్థులకు ఉచిత ప్రయాణానికి అనుమతించిందని వివరించారు. పరీక్ష కేంద్రాల్లోకి స్మార్ట్ఫోన్లు, చేతివాచీలు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను అనుమతించబోమని సాయిబాబు స్పష్టంచేశారు. శుక్రవారం సాయంత్రం వెబ్సైట్లో ప్రిలిమినరీ కీ ఉంచుతామని, అభ్యంతరాలు ఉంటే మే 4 సాయంత్రంలోగా తెలపవచ్చని, మే 9న ఫైనల్ కీతో పాటు ర్యాంకులు వెల్లడిస్తామని పేర్కొన్నారు. -
ఎంసెట్ రాస్తున్నారా... నిబంధనలు తెలుసుకోండి..!
విద్యార్థులు ఆత్రుతగా ఎదురుచూస్తున్న ఎంసెట్ పరీక్ష సమయం తరుముకొస్తోంది. ఈ నెల 29వ తేదీన పరీక్ష జరగనుంది. పరీక్ష బాగా రాసి కలలను నెరవేర్చుకోవాలని భావిస్తున్న సరస్వతీ పుత్రులంతా ముందుగా నిబంధనలను తెలుసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. గతంలో కంటే ఈసారి కొన్ని మార్పులు..చేర్పులు చేపట్టినందున వాటి గురించి అవగాహన కలిగి ఉండాలని, ఒక్క నిమిషం ఆలస్యమైన పరీక్షకు అనుమతించని విషయాన్ని గమనించాలని సూచిస్తున్నారు. జీవిత లక్ష్యం.. విలువైన సమయం మళ్లీ రావనే సత్యాన్ని తెలుసుకోవాలని స్పష్టం చేస్తున్నారు. - ఎచ్చెర్ల * పరీక్ష నిర్వహణకు చకచకా ఏర్పాట్లు * ‘నిమిషం’ నిబంధనపై విద్యార్థులకు అప్రమతం అవసరం * ఇంజినీరింగ్‌కు 11, మెడిసన్‌కు ఐదు కేంద్రాల కేటాయింపు ఎచ్చెర్ల: ఈ నెల 29వ తేదీన నిర్వహించనున్న ఎంసెట్‌కు సంబంధించి 8049 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో ఇంజినీరింగ్‌కు 5,918, మెడిసన్‌కు 2131 మంది ఉన్నారు. * ఇంజినీరింగ్‌కు సంబంధించి 11 కేంద్రాల్లో ఉదయం పది నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకూ, మెడిసన్ సంబంధించి మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు ఐదు కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించనున్నారు. * విద్యార్థులను గంట ముందు పరీక్ష హాల్లోకి అనుమతిస్తారు. * ఈసారి పరీక్ష కేంద్రాల్లో జా మర్లు అమర్చుతున్నందున ఎలక్ట్రానిక్ పరికరాలు, సెల్ఫోన్లు పని చేయవు. * ఈసారి చేతి గడియారాలను సైతం పరీక్ష కేంద్రంలోకి అను తించరు. * పరీక్ష కేంద్రంలో గోడ గడియారాలను విద్యార్థులు సమయం తెలుసుకోవడానికి అందుబాటులో ఉంచుతారు. ఫోన్లు, వాచీలు, క్యాలిక్లేటర్లు వంటి ఎలక్ట్రానిక్ వస్తువులు పరీక్ష కేంద్రంలోకి తీసుకెళ్లడాన్ని నిషేధించారు. * విద్యార్థుల హాల్ టిక్కెట్, బ్లాక్, బ్లూల్ బా ల్ పాయింట్ పెన్, కుల ధ్రువీకరణ పత్రం నక లు పరిశీలకులకు అంద జేయాలి. * ఆన్లైన్ దరఖాస్తుపై ఫొటో అంటించి ఎటస్టేషన్ చేయించిన కాపీని విద్యార్థి పట్టుకుని వెళ్లాలి. * నిమిషం ఆలసమైన పరీక్షకు అనుమతించ ని నిబంధన కచ్చి తంగా అమలవుతుంది. ఈ విషయంలో విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలి. * విద్యార్థి వేలి ముద్రను సైతం ఈసారి తీసుకుంటారు. కవలలు ఒకరికి బదులు ఒకరు పరీక్ష రాస్తున్న సంఘటనలకు పూర్తిగా చెక్ పెట్టేందుకు వేలి ముద్రలు సేకరించాలని అధికారు లు ఈసారి నిర్ణయించారు. ఈ నిబంధన ఇప్పటికే జేఈఈ వంటి పరీక్షల నిర్వహణలో అమలు చేస్తున్నారు. * దివ్యాంగ విద్యార్థులకు అదనపు సమ యం, సహాయకుల కేటాయింపు ఉంటుంది. ఇన్విజిలేటర్ అంజేసిన ఓఎంఆర్ సీట్లో విద్యార్థులు రిజర్వేషన్ కేటగిరీ, జెండర్, లోకల్ ఏరియా ఆంధ్రా యూనివర్సిటీ, బుక్లెట్ నంబర్, కోడ్, సక్రమంగా నింపాలి. * పర్యవేక్షకుడి సమక్షంలో మాత్రమే సంత కం చేయాలి, వేలిముద్ర వేయాలి. * ప్రశ్నపత్రం అందజేసిన వెంటనే ముందు గా ప్రింటును సరిచూసు కోవాలి. ప్రింట్ సమ స్య ఉంటే ఇన్విజిలేటర్ దృష్టికి తీసుకెళ్లి మార్చుకోవాలి. ప్రతి పేజీ క్షణ్ణంగా పరిశీలించాలి. సహాయం కోసం సహాయం కోసం ప్రభుత్వం కొన్ని హెల్ప్‌లైన్, టోల్ ఫ్రీ నంబర్లను అందుబాటులో ఉంచుతుంది. సమస్యలు, సందేహాలు ఈ కాల్స్ ద్వా రా నివృత్తి చేస్తారు. 18004256755, 0884-2340535, 0884-2356255, 0884-23405459, జిల్లా ఎంసెట్ కోఆర్డినేటర్ డాక్టర్ బాబూరావు 9440931686 నంబర్లను విద్యార్థులు సంప్రదించవచ్చు. పక్కాగా నిబంధనలు అమలు కన్వీనర్ ప్రకటించిన నిబంధనలు పక్కాగాపాటిస్తాం. విద్యార్థులు కూడా నిబంధనలపై అవగాహనతో ఉం డాలి. ఇంజినీరింగ్‌కు 11, మెడిషన్‌కు ఐదు కేంద్రాలను కేటాయించి.. ఏర్పాట్లు చేస్తున్నాం. అందుబాటులో ఉన్న కేంద్రాలను ఎంచుకున్నాం. ‘నిమిషం’ నిబంధన పట్ల విద్యార్థులు అప్రమతంగా ఉండా లి. కనీసం గంట ముందుగానే పరీక్ష కేంద్రానికి చేరుకునేలా జాగ్రత్త పడాలి. - డాక్టర్ బాబూరావు, జిల్లా కో ఆర్డినేటర్, ఎంసెట్-2016