ఏపీ ఎంసెట్ ఇంజినీరింగ్ పరీక్ష ప్రారంభం
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ఎంసెట్-2016 ఇంజినీరింగ్ పరీక్ష ప్రశాంతంగా ప్రారంభమైంది. ఇంజినీరింగ్ పరీక్షకు ఏపీలో 329, హైదరాబాద్‌లో 26 మొత్తం 355 పరీక్ష కేంద్రాలను అధికారులు ఏర్పాటుచేశారు.
1,89,273 మంది విద్యార్థులు ఇంజినీరింగ్ పరీక్ష రాయనున్నారు. ఇంజినీరింగ్ సెట్ కోడ్ జీ-2, మెడికల్‌కు ఎల్-2 ప్రశ్నాపత్రాలను మంత్రులు గంటా శ్రీనివాసరావు, కామినేని శ్రీనివాస్ లు ఎంపిక చేశారు. నిమిషం నిబంధనను అధికారులు పటిష్టంగా అమలుజేశారు. పలు సెంటర్లలో ఆలస్యంగా వచ్చిన విద్యార్థులను పరీక్ష సెంటర్లలోనికి అనుమతించలేదు. అన్ని పరీక్షా కేంద్రాల వద్ద జామర్ల ఏర్పాటు, భారీగా బందోబస్తుతో పాటు 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. ఎంసెట్ కేంద్రాల వద్ద కంప్యూటర్ సెంటర్లు, జిరాక్సు సెంటర్లు హోటళ్లను మూసివేయించేలా అధికారులు చర్యలు తీసుకున్నారు.