exam management
-
సచివాలయ ఉద్యోగాల పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి
సాక్షి, విజయవాడ : సెప్టెంబరు 1 నుంచి జరిగే గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగ పరీక్షలకు సంబంధించి అన్ని ఏర్పాట్లను చేశామని జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ తెలిపారు. శనివారం అన్ని శాఖల ఉన్నతాధికారులతో ఆయన సమావేశం నిర్వహించి పరీక్ష నిర్వహణ ఏర్పాట్లను సమీక్షించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ పలు విషయాలు వెల్లడించారు. అవి పంచాయతీ సెక్రటరీ, విఆర్వో, అగ్రికల్చర్, హార్టికల్చర్ అసిస్టెంట్, ఎఎన్ఎమ్ ఉద్యోగాలకు 1 నుంచి 8వ తేదీ వరకు పరీక్షలు జరుగనున్నాయి. 374 సెంటర్లలో 200655 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యే అవకాశం ఉంది. ఇంత భారీ సంఖ్యలో పరీక్ష ఎప్పుడూ జరగలేదు కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకుంటున్నాం. పరీక్షలు ఉదయం 10 నుండి 12వరకు, మధ్యాహ్నం 2.30 నుండి 5 గంటల వరకు ఉంటుంది. అభ్యర్థులు అరగంట ముందు పరీక్ష హాల్లో ఉండాలి. ఓఎమ్ఆర్ షీట్లలో పరీక్ష ఉంటుంది. సెల్ఫోన్లకు అనుమతి లేదు. పరీక్ష నిర్వహించడానికి 8 వేల మంది ఉద్యోగులు విధులు నిర్వహిస్తారు. పటిష్ట భద్రత నడుమ ప్రశ్రపత్రాల తరలింపు ఉంటుంది. ప్రతి సెంటర్‌కు చీఫ్ సూపరింటెండ్‌తో పాటు స్పెషల్ ఆఫీసర్, ఫ్లయింగ్ స్క్వాడ్, రూట్ ఆఫీసర్లను నియమించాం. ప్రతి బస్టాండ్‌లో హెల్ప్ డెస్క్‌లు ఏర్పాటు చేశాం. ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేస్తున్నాం. పరీక్ష జరిగే పాఠశాలలకు సెలవులు ఇవ్వడం జరిగింది. పరీక్ష కేంద్రాల సమీపంలో ఉన్న జీరాక్స్ సెంటర్లను మూసివేయడానికి చర్యలు తీసుకుంటున్నాం. మరోవైపు రేషన్ అందదనే అపోహలు వద్దని కలెక్టర్ ఇంతియాజ్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. గ్రామ వలంటీర్లు ఈ నెల 26 నుంచి 28వ తేదీ వరకు ప్రతీ ఇంటినీ సర్వే చేస్తారనీ, ప్రజలు తమ సమాచారాన్ని సరైన రీతిలో ఇవ్వాలని కోరారు. ప్రజల నుంచి తీసుకున్న సమాచారాన్ని వలంటీర్లు తహసీల్దార్లకు అందజేస్తారు. అంతేకాక, ఈ కేవైసీ నమోదు చేయనివారు దాదాపు 3 లక్షల మంది ఉంటారని అంచనా వేస్తున్నామనీ, ఈ కేవైసీని సంబంధిత రేషన్ షాపుల్లో నమోదు చేసుకోవచ్చని ఆయన తెలిపారు. -
ఎంసెట్ రాస్తున్నారా... నిబంధనలు తెలుసుకోండి..!
విద్యార్థులు ఆత్రుతగా ఎదురుచూస్తున్న ఎంసెట్ పరీక్ష సమయం తరుముకొస్తోంది. ఈ నెల 29వ తేదీన పరీక్ష జరగనుంది. పరీక్ష బాగా రాసి కలలను నెరవేర్చుకోవాలని భావిస్తున్న సరస్వతీ పుత్రులంతా ముందుగా నిబంధనలను తెలుసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. గతంలో కంటే ఈసారి కొన్ని మార్పులు..చేర్పులు చేపట్టినందున వాటి గురించి అవగాహన కలిగి ఉండాలని, ఒక్క నిమిషం ఆలస్యమైన పరీక్షకు అనుమతించని విషయాన్ని గమనించాలని సూచిస్తున్నారు. జీవిత లక్ష్యం.. విలువైన సమయం మళ్లీ రావనే సత్యాన్ని తెలుసుకోవాలని స్పష్టం చేస్తున్నారు. - ఎచ్చెర్ల * పరీక్ష నిర్వహణకు చకచకా ఏర్పాట్లు * ‘నిమిషం’ నిబంధనపై విద్యార్థులకు అప్రమతం అవసరం * ఇంజినీరింగ్‌కు 11, మెడిసన్‌కు ఐదు కేంద్రాల కేటాయింపు ఎచ్చెర్ల: ఈ నెల 29వ తేదీన నిర్వహించనున్న ఎంసెట్‌కు సంబంధించి 8049 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో ఇంజినీరింగ్‌కు 5,918, మెడిసన్‌కు 2131 మంది ఉన్నారు. * ఇంజినీరింగ్‌కు సంబంధించి 11 కేంద్రాల్లో ఉదయం పది నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకూ, మెడిసన్ సంబంధించి మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు ఐదు కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించనున్నారు. * విద్యార్థులను గంట ముందు పరీక్ష హాల్లోకి అనుమతిస్తారు. * ఈసారి పరీక్ష కేంద్రాల్లో జా మర్లు అమర్చుతున్నందున ఎలక్ట్రానిక్ పరికరాలు, సెల్ఫోన్లు పని చేయవు. * ఈసారి చేతి గడియారాలను సైతం పరీక్ష కేంద్రంలోకి అను తించరు. * పరీక్ష కేంద్రంలో గోడ గడియారాలను విద్యార్థులు సమయం తెలుసుకోవడానికి అందుబాటులో ఉంచుతారు. ఫోన్లు, వాచీలు, క్యాలిక్లేటర్లు వంటి ఎలక్ట్రానిక్ వస్తువులు పరీక్ష కేంద్రంలోకి తీసుకెళ్లడాన్ని నిషేధించారు. * విద్యార్థుల హాల్ టిక్కెట్, బ్లాక్, బ్లూల్ బా ల్ పాయింట్ పెన్, కుల ధ్రువీకరణ పత్రం నక లు పరిశీలకులకు అంద జేయాలి. * ఆన్లైన్ దరఖాస్తుపై ఫొటో అంటించి ఎటస్టేషన్ చేయించిన కాపీని విద్యార్థి పట్టుకుని వెళ్లాలి. * నిమిషం ఆలసమైన పరీక్షకు అనుమతించ ని నిబంధన కచ్చి తంగా అమలవుతుంది. ఈ విషయంలో విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలి. * విద్యార్థి వేలి ముద్రను సైతం ఈసారి తీసుకుంటారు. కవలలు ఒకరికి బదులు ఒకరు పరీక్ష రాస్తున్న సంఘటనలకు పూర్తిగా చెక్ పెట్టేందుకు వేలి ముద్రలు సేకరించాలని అధికారు లు ఈసారి నిర్ణయించారు. ఈ నిబంధన ఇప్పటికే జేఈఈ వంటి పరీక్షల నిర్వహణలో అమలు చేస్తున్నారు. * దివ్యాంగ విద్యార్థులకు అదనపు సమ యం, సహాయకుల కేటాయింపు ఉంటుంది. ఇన్విజిలేటర్ అంజేసిన ఓఎంఆర్ సీట్లో విద్యార్థులు రిజర్వేషన్ కేటగిరీ, జెండర్, లోకల్ ఏరియా ఆంధ్రా యూనివర్సిటీ, బుక్లెట్ నంబర్, కోడ్, సక్రమంగా నింపాలి. * పర్యవేక్షకుడి సమక్షంలో మాత్రమే సంత కం చేయాలి, వేలిముద్ర వేయాలి. * ప్రశ్నపత్రం అందజేసిన వెంటనే ముందు గా ప్రింటును సరిచూసు కోవాలి. ప్రింట్ సమ స్య ఉంటే ఇన్విజిలేటర్ దృష్టికి తీసుకెళ్లి మార్చుకోవాలి. ప్రతి పేజీ క్షణ్ణంగా పరిశీలించాలి. సహాయం కోసం సహాయం కోసం ప్రభుత్వం కొన్ని హెల్ప్‌లైన్, టోల్ ఫ్రీ నంబర్లను అందుబాటులో ఉంచుతుంది. సమస్యలు, సందేహాలు ఈ కాల్స్ ద్వా రా నివృత్తి చేస్తారు. 18004256755, 0884-2340535, 0884-2356255, 0884-23405459, జిల్లా ఎంసెట్ కోఆర్డినేటర్ డాక్టర్ బాబూరావు 9440931686 నంబర్లను విద్యార్థులు సంప్రదించవచ్చు. పక్కాగా నిబంధనలు అమలు కన్వీనర్ ప్రకటించిన నిబంధనలు పక్కాగాపాటిస్తాం. విద్యార్థులు కూడా నిబంధనలపై అవగాహనతో ఉం డాలి. ఇంజినీరింగ్‌కు 11, మెడిషన్‌కు ఐదు కేంద్రాలను కేటాయించి.. ఏర్పాట్లు చేస్తున్నాం. అందుబాటులో ఉన్న కేంద్రాలను ఎంచుకున్నాం. ‘నిమిషం’ నిబంధన పట్ల విద్యార్థులు అప్రమతంగా ఉండా లి. కనీసం గంట ముందుగానే పరీక్ష కేంద్రానికి చేరుకునేలా జాగ్రత్త పడాలి. - డాక్టర్ బాబూరావు, జిల్లా కో ఆర్డినేటర్, ఎంసెట్-2016 -
హైటెక్ కాపీయింగ్‌ను నిరోధించాలి
కేయూ క్యాంపస్, న్యూస్‌లైన్ : ఇంజినీరింగ్, మెడికల్ కోర్సుల్లో ప్రవేశానికి ఈనెల 22న జరగనున్న ఎంసెట్ పరీక్ష నిర్వహణలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూడాలని, హైటెక్ కాపీయింగ్ జరగకుండా చూడాలని ఎంసెట్ రాష్ట్ర కోకన్వీనర్, జేఎన్టీయూ ప్రొఫెసర్ కూరపాటి ఈశ్వర్ప్రసాద్ సూచించారు. కాకతీయ యూనివర్సిటీలోని ఫార్మ సీ సెమినార్ హాల్లో ఆదివారం జరిగిన చీఫ్ సూపరిం టెండెంట్లు, పరిశీలకుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పరీక్ష కేంద్రాల్లోకి గంట ముందే అభ్యర్థులను అనుమతించాలని, నిర్ణీత సమయానికి ఒక్క నిమిషం ఆలస్యమైనా రానివ్వొద్దని సూచించారు. ఇటీవల జరిగిన పలు పరీక్షల్లో హైటెక్ పద్ధతుల్లో కాపీ జరుగుతున్నట్లు తేలిందని. ఈ మేరకు ఎలాంటి అవకతవకలకు తావివ్వొద్దని ఆయన సూచించారు. విద్యార్థులను పరీక్ష మధ్యలో టాయిలెట్‌కు సైతం పంపించొద్దని, తప్పనిసరైతే సిబ్బందిని వెంట పంపించాలని ఆదేశించారు. ఇన్విజిలేటర్ల నియామకంలో కూడా జాగ్రత్తలు పాటిం చాలని, పరీక్ష రాసే వారిలో బంధువులు ఉన్న పక్షంలో వారిని ఇన్విజిలేటర్లుగా నియమించొద్దని ఈశ్వర్ప్రసాద్ ఈ సందర్భంగా సూచించారు. వరంగల్ రీజియన్‌లో 33 కేంద్రాలు.. ఈనెల 22న జరగనున్న ఎంసెట్ కోసం వరంగల్ రీజి యన్‌లో 33 కేంద్రాలు ఏర్పాటుచేస్తున్నట్లు ఈశ్వర్ప్రసాద్ వివరించారు. ఇంజినీరింగ్ ప్రవేశపరీక్ష 14,400 మంది రాయనుండగా.. 23 కేంద్రాలు, మెడిసిన్ పరీ క్షకు 6,800 మంది రాయనుండగా పది కేంద్రాలు ఏర్పాటుచేశామన్నారు. పరీక్షల నిర్వహణకు ప్రత్యేక పరిశీల కులను నియమించగా, రెవెన్యూ, పోలీస్ సిబ్బంది వారికి సహకరిస్తారని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన సీఎస్‌లు, పరిశీలకుల సందేహాలను నివృత్తి చేశారు. జనగామలో.. జనగామ రూరల్ : జనగామ కేంద్రంగా ఎంసెట్ రెండోసారి నిర్వహిస్తున్నందున తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఎంసెట్ రాష్ట్ర కోకన్వీనర్ ఈశ్వర్ప్రసాద్ సూచించారు. స్థానిక ఏబీవీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో వివిధ శాఖల ఉద్యోగులకు ఎంసెట్‌పై సమీక్ష సమావేశం ఏర్పాటుచేశారు. ఈ సమావేశంలో ఈశ్వర్ప్రసాద్ మాట్లాడుతూ జనగామలోని ఏబీవీ ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ఏకశిల డిగ్రీ కళాశాల, ప్రసాద్ ఇంజనీరింగ్ కళాశాలల్లో పరీక్ష కేంద్రాలు ఏర్పాటుచేశామని తెలిపారు. పరీక్ష నిర్వహణలో ఏ సందేహమున్నా కన్వీనర్ దృష్టికి తీసుకువెళ్లాలని.. ఎలాంటి పొరపాట్లు జరిగినా బాధ్యులపై కఠిన చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. అనంతరం రీజి నల్ కోఆర్డినేటర్ నర్సింహారెడ్డి పరీక్ష నిర్వహణపై పలు సూచనలు చేయగా, కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ టి.రవిచందర్, ఎస్సై ఎం.కరుణాకర్, ట్రాన్స్‌కో ఏఈ ఎల్ల య్య, కళాశాల అధ్యాపకులు పాల్గొన్నారు.