పదో తరగతి ఫలితాలను వీలయితే ఈనెల 4వ తేదీనే విడుదల చేయాలని విద్యాశాఖ అధికారులు భావిస్తున్నారు.
ముందే విడుదలకు విద్యాశాఖ నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: పదో తరగతి ఫలితాలను వీలయితే ఈనెల 4వ తేదీనే విడుదల చేయాలని విద్యాశాఖ అధికారులు భావిస్తున్నారు. తొలుత ఈనెల 5వ తేదీన ఫలితాలు విడుదల చేయాలని నిర్ణయించారు. పరిస్థితులు అనుకూలిస్తే ఒక రోజు ముందుగానే ఫలితాలు విడుదల చేసే అవకాశముందని విద్యాశాఖ వర్గాల సమాచారం. ఇక గత నెల 22న జరిగిన పాలిసెట్ ఫలితాలను 5వ తేదీన విడుదల చేయాలని సాంకేతిక విద్యాశాఖ అధికారులు భావిస్తున్నట్లు తెలిసింది.