సాక్షి, హైదరాబాద్: స్థానిక ఫలితాల వెల్లడికి రాష్ట్ర ఎన్నికల సంఘం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. సాధారణ ఎన్నికలు పూర్తయ్యాక స్థానిక సంస్థల ఫలితాలు ప్రకటించాలని సుప్రీంకోర్టు ఆదేశించినందున రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ పి.రమాకాంత్‌రెడ్డి ఫలితాల నోటిఫికేషన్‌ను సోమవారం జారీ చేశారు. మార్చి 30న మున్సిపల్ ఎన్నికలు జరగ్గా, ప్రాదేశిక ఎన్నికలు ఏప్రిల్ ఆరు, ఏప్రిల్ 11న జరిగిన విషయం విదితమే. ఈ ఎన్నికల ఫలితాలు సాధారణ ఎన్నికలకు ముందే విడుదల అయితే వాటి ప్రభావం పడుతుందని కొందరు హైకోర్టు, సుప్రీంకోర్టుకు వెళ్లడంతో.. ఎన్నికల ఫలితాలను ఆపేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. మున్సిపల్ ఎన్నికల ఫలితాలు మే 12న, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఫలితాలు మే 13న వెల్లడించాలని ఎస్‌ఈసీ రమాకాంతరెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.
పరోక్ష ఎన్నికలు అసెంబ్లీ ఫలితాల తరువాతే..
ఇదిలాఉండగా, మున్సిపల్, మండల, జడ్పీల అధ్యక్షులకు పరోక్ష పద్దతిలో నిర్వహించే ఎన్నికలు సాధారణ ఎన్నికల ఫలితాల తరువాతే నిర్వహించనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు వెల్లడికి నోటిఫికేషన్ ఇచ్చిన రాష్ట్ర ఎన్నికల సంఘం, పరోక్ష పద్ధతిలో ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ చేయలేదు. పరోక్ష ఎన్నికల్లో ఓటింగ్‌లో పాల్గొనడానికి ప్రస్తుత శాసనసభ్యులకు జూన్ రెండు వరకు పదవి ఉన్నందున వారికి అవకాశం ఇవ్వాలా.? లేక కొత్తగా ఎన్నికయ్యే ఎమ్మెల్యేలకు అవకాశం కల్పించాలా.? అనే విషయంలో స్పష్టత లేదు. దీంతో పరోక్ష ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయలేదని సమాచారం. ప్రభుత్వం నుంచి స్పష్టత వచ్చిన తరువాత రాష్ట్ర ఎన్నికల సంఘం ఒక నిర్ణయం తీసుకుంటుంది.
12న మున్సిపల్.. 13న ప్రాదేశిక ఎన్నికల ఫలితాలు
Published Tue, Apr 22 2014 1:52 AM | Last Updated on Tue, Oct 16 2018 6:27 PM
Advertisement
Advertisement