ఆ రాష్ట్ర ప్రజలను వణికిస్తున్న అధ్యయనం | Major earthquake may hit Jammu and Kashmir: study | Sakshi
Sakshi News home page

ఆ రాష్ట్ర ప్రజలను వణికిస్తున్న అధ్యయనం

Published Fri, May 20 2016 11:13 AM | Last Updated on Tue, Oct 16 2018 2:49 PM

ఆ రాష్ట్ర ప్రజలను వణికిస్తున్న అధ్యయనం - Sakshi

ఆ రాష్ట్ర ప్రజలను వణికిస్తున్న అధ్యయనం


వాషింగ్టన్‌: జమ్మూకశ్మీర్‌  ను పెను భూకంపం చుట్టేయనుందనీ, లక్షల కొద్దీ ప్రజలను పొట్టనపొట్టుకునే ప్రమాదం పొంచి ఉందని తాజా అధ్యయనంలో తేలింది.   హిమాలయ పర్వత శ్రేణుల భూఅంతర్భాగంలతో నిర్వహించిన  తాజా అధ్యయనంలో ఈ విషయాలు  తేలాయని పరిశోధకులు చెబుతున్నారు.  రాష్ట్రాన్ని భారీ భూకంపం కుదిపేసే అవకాశముందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. రిక్టర్ స్కేల్ పై ఎనిమిది కంటే ఎక్కువ తీవ్రతతో భూకంపం సంభవించే అవకాశం ఉందని భావిస్తున్నారు.  ఫలితంగా  లక్షల మంది ప్రాణాలు  పోగొట్టుకునే ప్రమాదముందని చెబుతున్నారు. అమెరికాకు చెందిన ఓరిగాన్ స్టేట్ యూనివర్శిటీ పరిశోధకులు  అధ్యయనంలో ఈ సంచలన విషయాలు తేలాయని  అధ్యయనానికి నేతృత్వం వహించిన యాన్‌ గావిల్లోట్‌  తెలిపారు.

 కశ్మీర్‌లోని  రియాసి ఫాల్ట్‌ (ఆసియా, భారత్‌ ఫలకాలు కలిసే చోటు)లో జరుగుతున్న పరిణామాల వల్లే భారీ ప్రకంపనలు వస్తాయని వారు అంచనావేశారు.  రియాసి ఫాల్ట్ కదలికలపై  సుదీర్ఘ పరిశోధన  అనంతరం తాము ఈ అంచనాలకు వచ్చామని పరిశోధకులు  చెబుతున్నారు .గత 4,000 ఏళ్ల నుంచీ ఇక్కడ ఎలాంటి భారీ ప్రకంపనలు రాలేదని, ఫలితంగా విపరీతమైన ఒత్తిడి ఉండే అవకాశముందని తెలిపారు.  అయితే ఇతర ఫలకాలు కలిసే చోట్లతో పోలిస్తే.. రియాసి ఫాల్ట్‌ అంత క్రియాశీలంగాలేదని వారు వెల్లడించారు.  భూకంపం సంభవించే ప్రమాదం ఉందా లేదా అనే ప్రశ్నేలేదని కానీ ఎప్పుడు వస్తుందనేదే తమ ముందున్న ప్రధాన  సవాల్ అని  యాన్‌ గావిల్లోట్‌ వివరించారు. రియాసీ ఫాల్ట్ కి సమీపంలో  చీనాబ్ నదిపై అనేక డ్యామ్లు , మరోవైపు డజన్ల కొద్దీ సొరంగాలు , వంతెనల గుండా వెళ్లే ముఖ్యమైన రైలు  రోడ్లు ఉండడం మరింద ప్రమాదకర పరిణామమన్నారు. దీని మూలంగా , పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో సమీపంలోని బాలకోట్ బాగ్ లో  2005 సం.రంలో సంభవించిన  భూకంపం కంటే ఎక్కువ తీవ్రతతో ప్రమాదం ముంచుకు రానుందని  నష్టం కూడా అంతే భారీ స్థాయిలోఉంటుందని ఆయన హెచ్చరించారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement