మే నెలాఖరుకల్లా నిర్మాణ పథకాలు పూర్తి
Published Sun, Jan 1 2017 9:33 PM | Last Updated on Tue, Mar 19 2019 7:00 PM
అన్నవరం :
అన్నవరం దేవస్థానంలో ఈ ఏడాది అనేక అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టడంతో పాటు గత ఏడాది చేపట్టిన వివిధ నిర్మాణ పథకాలను మే నెలాఖరుకల్లా పూర్తి చేస్తామని ఈఓ నాగేశ్వరరావు తెలిపారు. నూతన సంవత్సర వేడుకలను రత్నగిరిపై ఆదివారం ఘనంగా నిర్వహించారు. దేవస్థానం ఉద్యోగులు, పురోహితులు, అర్చకులు, పలువురు గ్రామస్తులు దేవస్థానం చైర్మ¯ŒS రాజా ఐవీ రోహిత్, ఈఓలను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఈఓ విలేకరులతో మాట్లాడుతూ సత్యగిరిపై రూ.రెండు కోట్లతో నిర్మిస్తున్న స్మార్త, ఆగమ, పాఠశాల పనులు చురుకుగా జరుగుతున్నాయని తెలిపారు. పురాతన గురుకులాల పద్ధతిలో ఈ పాఠశాల భవనాలు నిర్మించడం దేవాదాయశాఖలో ఇదే ప్రథమమని తెలిపారు. వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఈ పాఠశాలలో అడ్మిష¯Œ్స నిర్వహించి స్మార్త, ఆగమ తరగతులు ప్రారంభిస్తామని తెలిపారు.
మే నాటికి యాగశాల నిర్మాణం పూర్తి
సత్యదేవుని సన్నిధిలో దాత ఆర్థికసహకారంతో నిర్మాణమవుతున్న యాగశాల మే నాటికి పూర్తవుతుందని, అనంతరం యాగశాలను ప్రారంభించి సత్యదేవునికి చేసే వివిధ హోమాలు అక్కడే నిర్వహిస్తామని ఈఓ తెలిపారు. అర్బ¯ŒS గ్రీనరీలో భాగంగా రూ. 1.5 కోట్లతో సత్యగిరి, రత్నగిరిలపై ఉద్యానవనాలు పెంచనున్నట్లు తెలిపారు. ఆలయానికి వచ్చే భక్తులకు అన్నదానం చేసేందుకు త్వరలో అన్నదానభవనం నిర్మిస్తామని, ఆలయానికి వెనుకవైపు నిర్మిస్తున్న అద్దాల మండపం పనులు ఫిబ్రవరి నాటికి పూర్తవుతాయని తెలిపారు. సత్యగిరిపై బస చేసే భక్తుల సౌకర్యార్థం రత్నగిరి నుంచి రథంలా ఉండే బస్‌తో బాటు మరో బస్ నడపనున్నామని ఈఓ తెలిపారు. ప్రస్తుతం దేవస్థానం వద్ద నున్న రథం లాంటి బస్‌కు కొన్ని హంగులు కూర్చి దానిని, కొత్తగా కొనబోయే మరో బస్‌ను సత్యగిరికి నడుపుతామని తెలిపారు.
అన్నదానానికి రూ.లక్ష విరాళం
నిత్యాన్నదానపథకానికి కర్నాటక రాష్ట్రంలోని కోలార్‌కు చెందిన నారాయణస్వామి రూ.1,00,116 విరాళాన్ని ఈఓ నాగేశ్వరరావుకు ఆదివారం అందజేశారు. ఈ మొత్తంపై వచ్చే వడ్డీతో ఏటా జనవరి మొదటి తేదీన ఆయన పేరు మీద అన్నదానం చేయమని కోరారు.
Advertisement