లోటస్‌పాండ్‌లో మే డే | May Day In Lotus Pand | Sakshi
Sakshi News home page

లోటస్‌పాండ్‌లో మే డే

Published Wed, May 2 2018 12:58 PM | Last Updated on Tue, Oct 16 2018 2:49 PM

May Day In Lotus Pand - Sakshi

కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు  

జోగిపేట(అందోల్‌) : హైదరాబాద్‌లోని లోటస్‌పాండ్‌లో మే డే కార్యక్రమాలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి బి.సంజీవరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మికుల శ్రేయస్సు కోసం దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌.రాజశేఖర్‌రెడ్డి ఎంతో కృషి చేసారన్నారు.

ఈ సందర్భంగా పలువురు కార్మికులను గుర్తించి వారిని  సన్మానించారు. ఇందులో రాష్ట్ర వైఎస్సార్‌సీపీ కార్యనిర్వాహక కార్యదర్శి బ్రహ్మనందరెడ్డి, సిద్దిపేట జిల్లా అధ్యక్షులు జగదీశ్వర్‌ గుప్త, రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement