కూల్ ప్యాడ్ మాక్స్ లాంచింగ్ మే 20న
న్యూఢిల్లీ: ఇప్పటి వరకు మనం డ్యూయల్ సిమ్ స్మార్ట్ ఫోన్లు, డ్యూయల్ కెమెరా ఫోన్లుచూశాం. అయితే ఇపుడు ఒకే ఫోన్‌లో రెండు సోషల్ మీడియా అకౌంట్లను క్రియేట్ చేసుకోనే స్మార్ట్ ఫోన్లు త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి. యూత్ ను ఆకట్టుకునేలా ఈ సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను కూల్‌ప్యాడ్ సంస్థ ఇండియన్ మార్కెట్లోకి తీసుకురాబోతోంది. గతవారం ప్రపంచ మార్కెట్లో రిలీజైన ఈ కూల్ ప్యాడ్ మాక్స్ ను మే 20న భారత మార్కెట్లో విడుదల చేసేందుకు సన్నద్ధమవుతోంది. దీంతోపాటుగా పర్సనల్, ప్రయివేటు వ్యవహారాలకోసం వేర్వేరు ఫోన్ల అవసరం లేకుండా, ఈ రెండు సౌకర్యాలను తమ లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ లో పొందొచ్చని కూల్ ప్యాడ్ ఇండియా కంపెనీ చెబుతోంది. దీనికి సంబంధించి ఢిల్లలో నిర్వహించే కార్యక్రమానికి మీడియా సంస్థలకు ఆహ్వానం పలుకుతోంది. డ్యూయల్ ఇన్ పేరుతో ఈ ఆహ్వానాన్ని పంపంచింది. సంస్థ సీఈవో సయ్యద్ తాజుద్దీన్ ఈ ఈవెంట్ హాజరు కానున్నట్టు తెలిపింది.
అయితే కచ్చితమైన ధరను ఇంకా ప్రకటించనప్పటికీ ఈ పోన్ ధర రూ.10,000 నుంచి రూ.15,000 వరుకు ఉండొచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. కస్టమర్ల వ్యక్తిగత, వృత్తి సంబంధమైన సమాచారం భద్రతకోసం స్పెషల్ ఎన్ క్రిప్షన్ టెక్నాలజీని ఇన్ స్టాల్ చేసినట్టు కంపెనీ ప్రతినిధి ఒకరు తెలిపారు. తద్వారా డేటా లీకేజ్ గురించి చింతించాల్సిన అవసరం లేదంటోంది. రెండు వాట్సాప్ అకౌంట్‌ల నిర్వహించుకునే సౌలభ్యమున్న ప్రపంచపు మొట్టమొదటి డ్యుయల్ స్పేస్ ఫీచర్‌తో రాబోతున్న స్మార్ట్ ఫోన్ మాదే నంటోంది. యూజర్లకు వాట్సాప్, ఫేస్ బుక్, లైన్, బీబీఎం, లాంటి సోషల్ మీడియాల రెండు అకౌంట్ల నిర్వహణను ఈ ఫోన్ సపోర్టు చేస్తుంది. అలాగే గతంలో మిగతా మార్కెట్లలో రిలీజ్ చేసిన మాక్స్ లైట్ ను ఇంకా భారత్ మార్కెట్లకు విడుదల చేయడంలేదని స్పష్టం చేసింది.
కూల్ ప్యాడ్ మాక్స్ స్పెసిఫికేషన్స్ ఇలా ఉన్నాయి..
ఆపరేటింగ్ సిస్టం ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్
3జీబి ర్యామ్, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 615 ప్రాసెసర్,
32జీబి ఇంటర్నల్ మెమరీ
4జీబి ర్యామ్, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 617 ప్రాసెసర్,
13 మెగా పిక్సల్ రియర్ కెమెరా
5 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా
2,800 ఎమ్ఏహెచ్ బ్యాటరీ
డ్యుయల్ సిమ్, 4జీ ఎల్టీఈ, బ్లుటూత్, వై-ఫై