Coming India
-
జోరుగా..హుషారుగా! 80 స్టార్టప్‌లు ఐపీవోకు
న్యూఢిల్లీ: రానున్న ఐదేళ్లలో దేశీయంగా 80 స్టార్టప్‌లు పబ్లిక్ ఇష్యూలను చేపట్టే అవకాశమున్నట్లు మార్కెట్ రీసెర్చ్, కన్సల్టెన్సీ సంస్థ రెడ్‌సీర్ తాజాగా అంచనా వేసింది. ఈ కాలంలో 100కు మించిన సంస్థలు మరింత బలపడనున్నట్లు, భారీ స్థాయిలో లాభాలు ఆర్జించేందుకు వీలున్నట్లు అభిప్రాయపడింది. ఐపీవోలపై రెడ్‌సీర్ స్ట్రాటజీ కన్సల్టెంట్స్ రూపొందించిన నివేదికలో ఇప్పటికే కార్యకలాపాలను విస్తరించిన 20 స్టార్టప్‌లు ఎక్సేంజీల్లో లిస్టయినట్లు వెల్లడించింది. దేశీయంగా మరో 100కు పైగా స్టార్టప్‌లు మరింత ఎదిగే వీలుందని, భారీ లాభార్జన స్థాయికి చేరవచ్చని పేర్కొంది. ఈ జాబితాలో ఇప్పటికే 20 కంపెనీలు పబ్లిక్ ఇష్యూలను పూర్తి చేసుకున్నట్లు ప్రస్తావించింది. వెరసి మరో 80 కంపెనీలు ఐదేళ్లలో ఐపీవోల ద్వారా నిధుల సమీకరణకు ముందుకురానున్నట్లు అంచనా వేసింది. టెక్ కంపెనీలు వీక్: ప్రపంచ ఆర్థిక పరిస్థితుల కారణంగానే వినియోగ కంపెనీలతో పోలిస్తే టెక్నాలజీ సంస్థల ఐపీవోలు పతన బాటలో సాగుతున్నట్లు హెచ్ఎస్బీసీ సహకారంతో రూపొందిన రెడ్‌సీర్ నివేదిక పేర్కొంది. అయితే టెక్నాలజీ కంపెనీలు ప్రస్తుతం వృద్ధికి ప్రాధాన్యతనిస్తున్నట్లు తెలిపింది. వచ్చే రెండేళ్లలో సానుకూల నగదు ఆర్జనను సాధించగల కీలక కంపెనీలు ప్రస్తుతం 20-30శాతం డిస్కౌంట్లో ఉన్నట్లు పేర్కొంది. ఇందుకు చౌక వడ్డీ రేట్లు కారణంకాగా.. ఇకపై మరింత ఊపందుకోనున్న వడ్డీ రేట్ల పరిస్థితుల్లో విలువ వేగంగా బలపడనున్నట్లు అభిప్రాయపడింది. ఇతర దేశాలతో పోలిస్తే దేశీయంగా లిస్టెడ్ కంపెనీల మార్కెట్ విలువ వృద్ధి చూపనున్నట్లు అంచనా వేసింది. (కొత్త ఏడాదిలో యూజర్లకు షాకివ్వనున్న టాటా మోటార్స్) కారణాలున్నాయ్: యూఎస్ స్టాక్ మార్కెట్ క్యాపిటలైజేషన్ 43 లక్షల కోట్ల డాలర్లలో టెక్నాలజీ లేదా న్యూఏజ్ కంపెనీల వాటా 25 శాతంగా నివేదిక పేర్కొంది. వీటిలో యాపిల్ ఇంక్, అమెజాన్ తదితర దిగ్గజాలున్నట్లు తెలియజేసింది. ఇక ఇండియాలో 3.9 లక్షల కోట్ల డాలర్ల స్టాక్ మార్కెట్ విలువలో టెక్ లేదా న్యూఏజ్ కంపెనీల వాటా 1 శాతమేనని వివరించింది. గత రెండు దశాబ్దాలలోనూ ఇదేతరహా పరిస్థితులను పరిశీలిస్తే.. వడ్డీ రేట్లు నీరసించినప్పటికీ మార్కెట్లు నిలకలకడను సాధించేందుకు కొంత సమయం పట్టినట్లు రెడ్‌సీర్ సంస్థ పార్టనర్ రోహన్ అగర్వాల్ తెలియజేశారు. మార్కెట్లు రికవరీ సాధించేందుకు మరింత సమయం పట్టవచ్చని అంచనా వేశారు. డౌన్‌టర్న్‌ల తదుపరి ఐపీవోలు జోరు చూపడం చూస్తున్నదేనని ప్రస్తావించారు. కాగా.. ఐపీవో బాటలో విజయవంతమయ్యేందుకు మార్కెట్ లీడర్షిప్, విస్తరించవలసిన మార్కెట్లు, నమ్మకమైన ఆదాయ అంచనాలు, లాభదాయకతకు స్పష్టమైన ప్రణాళికలు వంటి పలు కీలక అంశాలపై స్టార్టప్‌లు దృష్టిసారించవలసి ఉన్నట్లు వివరించారు. (టెక్ మహీంద్ర ఉద్యోగులకు బంపర్ ఆఫర్) -
జరిగేది చెబుతాను.. జరగబోయేది చెబుతాను..
చరిత్రను మలుపు తిప్పే సంఘటనలను ప్రస్తావిస్తూ.. అంతకుముందు.. ఆ తర్వాత అన్నట్లు చెబుతుంటాం.. ఇప్పుడు మనం అలాంటి పరిస్థితిలోనే ఉన్నాం.. మన జీవితాలు కూడా కరోనాకు ముందు.. కరోనాకు తర్వాత అన్నట్లు మారబోతున్నాయి. సామాజిక, ఆర్థిక రంగాల్లో పెనుమార్పులు చోటుచేసుకోబోతున్నాయి. అవెలా ఉండవచ్చన్నది ఓసారి భవిష్యత్తులోకి వెళ్లి చూసి వద్దామా.. – సాక్షి సెంట్రల్ డెస్క్ డిజిటల్ సేవలు, ఈ–కామర్స్‌కు జై ఇప్పటికే కాంటాక్ట్ లెస్ డెలివరీలు అన్నవి పెరిగాయి.. కరోనా అనంతర పరిస్థితుల్లో ఇవి మరింతగా పెరుగుతాయి. కాంటాక్ట్ లెస్ గూడ్స్ సేవలు, డిజిటల్, ఈ–కామర్స్ ప్లాట్‌ఫామ్స్, ఫుడ్ డెలివరీ తదితర కంపెనీలు వృద్ధి చెందు తాయి. అదేవిధంగా సోషల్ మీడియా ప్రభావం కూడా పెరుగుతుంది. ప్రకటనల మీద పెట్టే ఖర్చును చాలా కంపెనీలు తగ్గించుకుంటాయి. ఉద్యోగాల్లో యాంత్రీకరణ.. యాంత్రీకరణ పెరుగుతుంది. కార్మిక వర్గం ఇబ్బందులు ఎదుర్కొంటుంది. నైపుణ్యాలు లేకపోవడం వల్ల ఉద్యోగ భద్రత ఉండకపోవచ్చు. ఇంట్లో నుంచే ఉద్యోగం చేసేలా చాలా కార్యకలాపాలు ఉండొచ్చు. ఇవన్నీ ఔట్‌సోర్సింగ్‌లో తక్కువ వ్యయంతో ప్రాజెక్టులు పూర్తి చేసే దేశాల్లోని నిపుణులకు లభించే అవకాశముంది. టెలి మెడిసిన్‌కు గిరాకీ ఇంటికి వచ్చి టెస్టులు చేసే వ్యవస్థ ఇప్పటికే ఉంది.. ఇది మరింతగా పెరుగుతుంది. టెలిమెడిసిన్, పరిశోధనలు, బయోటెక్, హెల్త్‌కేర్ వ్యవస్థలకు నిధులు బాగా పెరుగుతాయి. మరో వలస సంక్షోభం.. ఆంక్షలు ఎత్తేసిన తర్వాత హెల్త్‌కేర్ వ్యవస్థ సరిగా లేని దేశాల నుంచి మెరుగైన మంచి ఆరోగ్య వ్యవస్థ ఉన్న యూరప్ వంటి దేశాలకు వలస వెళ్లే అవకాశం ఉంది. ధనిక దేశాలు నైపుణ్యం ఉన్న వారిని అనుమతించే అవకాశం ఉంది. నిఘా, ఆంక్షలు పెరగొచ్చు.. ప్రస్తుతం కరోనాను తరిమికొట్టేందుకు ప్రభుత్వాలు, పోలీసులు అత్యవసర అధికారాలు ప్రదర్శిస్తున్నారు. కరోనా తర్వాత మరింత నిఘా పెరగొచ్చు. దేశ, రాష్ట్ర సరిహద్దుల వెంబడి బయోమెట్రిక్ స్క్రీనింగ్ జరపొచ్చు. కొన్ని దేశాల నుంచి వచ్చినవారు తప్పనిసరిగా క్వారంటైన్‌కు వెళ్లే పరిస్థితి రావొచ్చు. ప్రాధాన్యాలు మారుతాయి కరోనా ఎంతటి మహమ్మారో ప్రపంచానికి తెలిసొచ్చింది. భవిష్యత్తులో ఇలాంటి వైరస్ల నుంచి మానవాళిని కాపాడటానికి ప్రపంచ దేశాల నేతలు దీర్ఘకాలిక ప్రణాళికలు రచిస్తారు. పర్యావరణ పరిరక్షణ అన్నది ప్రాధాన్యంగా మారే అవకాశముంది. -
రాబోయే ఏళ్లలో దేశంలోకి 900 విమానాలు
సాక్షి, న్యూఢిల్లీ: ప్రపంచంలోని వేగంగా అభివృద్ధి చెందుతున్న ఏవియేషన్ మార్కెట్లలో ఒకటైన భారతదేశంలో విమాన యాన సంస్థలు చాలా దూకుడును ప్రదర్శిస్తున్నాయి. ముఖ్యంగా ప్రాంతీయ మార్గాల్లో భారీ ప్రతిష్టాత్మక విస్తరణ ప్రణాళికలతో ముందుకు వస్తున్నాయి. ఇందులో భాగంగానే 900 విమానాలను అదనంగా ప్రారంభించనున్నాయి. ఇతర రవాణా సంస్థలతో పాటు, దేశీయ ఎయిర్లైన్స మొత్తం 900 కన్నా ఎక్కువ విమానాలను ప్రారంభించనున్నాయని అధికారిక సమాచారం తెలిపింది. అధికారుల డేటా ప్రకారం.. బడ్జెట్ విమానయాన సంస్థలు ఇండిగో, స్పైస్‌జెట్, గోఎయిర్, ఎయిర్ఏషియా తమ విమానాల సంఖ్యను పెంచుకునేందుకు సిద్ధమయ్యాయి. ఇటీవల లోక్‌సభలో లిఖితపూర్వక సమాధానంలో భాగంగా పార్లమెంటుకు సమర్పించిన సమాచారం ప్రకారం, రానున్న సంవత్సరాల్లో దేశీయ విమాన సంస్థలు మరో 900 విమానాలను ప్రారంభించనున్నాయి. ఇందులో ఒక్క ఇండిగోనే ఏకంగా 448 కొత్త విమానాలను తీసుకురానుంది. ఇండిగో వద్ద 150 విమానాలున్నాయి. వచ్చే ఏడు నుంచి ఎనిమిది సంవత్సరాల్లో మరో 448 విమానాలను కొనుగోలు చేయనుంది. వీటిలో 399 ఏ320 విమానాలు కాగా.. 49 ఏటీఆర్‌లు. మరో ప్రధాన పోటీదారు ఎయిర్‌లైన్ స్పైస్‌జెట్ కూడా ఇదే ప్రణాళికలతో ఉంది. 2018-23 మధ్య 157 కొత్త విమానాలను తీసుకురానుంది. ప్రస్తుతం ఈ సంస్థ వద్ద 57 విమానాలున్నాయి. మరో బడ్జెట్ క్యారియర్ గోఎయిర్ మరో నాలుగేళ్లలో 119 ఏ320 విమానాలను కొనుగోలు చేసి అంతర్జాతీయ సేవలను మొదలుపెట్టనుంది. గో ఎయిర్ వద్ద ప్రస్తుతం 34 విమానాలున్నాయి. ఎయిర్ఏషియా కూడా మరో ఐదేళ్లలో 60 విమానాలను తీసుకురానుంది. జెట్ ఎయిర్వేస్ ప్రస్తుతం ఉన్న 107 విమానాలకు మరో 86 విమానాలను చేర్చనుంది. ఇక ప్రభుత్వ రంగ ఎయిరిండియా 2019 మార్చి కల్లా మూడు బోయింగ్ విమానాలు, 16 ఏ320 విమానాలను తీసుకురానుంది. ప్రస్తుతం ఈ సంస్థ వద్ద 155 విమానాలున్నాయి. పౌరవిమానయాన మంత్రిత్వశాఖ సమాచారంప్రకారం విస్తారా, ట్రూజెట్, జూమ్ ఎయిర్ లాంటి సంస్థలు కూడా మరో ఐదేళ్లలో కొత్త విమానాలను కొనుగోలు చేయనున్నాయి. ఎయిర్ ఫ్రాన్స్ ఐదేళ్ల కాలంలో 60 విమానాలను ప్రవేశపెట్టనుంది. ప్రస్తుతం ఈ బడ్జెట్ క్యారియర్ 14 విమానాలను కలిగి ఉంది. -
కూల్ ప్యాడ్ మాక్స్ లాంచింగ్ మే 20న
న్యూఢిల్లీ: ఇప్పటి వరకు మనం డ్యూయల్ సిమ్ స్మార్ట్ ఫోన్లు, డ్యూయల్ కెమెరా ఫోన్లుచూశాం. అయితే ఇపుడు ఒకే ఫోన్లో రెండు సోషల్ మీడియా అకౌంట్లను క్రియేట్ చేసుకోనే స్మార్ట్ ఫోన్లు త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి. యూత్ ను ఆకట్టుకునేలా ఈ సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను కూల్‌ప్యాడ్ సంస్థ ఇండియన్ మార్కెట్లోకి తీసుకురాబోతోంది. గతవారం ప్రపంచ మార్కెట్లో రిలీజైన ఈ కూల్ ప్యాడ్ మాక్స్ ను మే 20న భారత మార్కెట్లో విడుదల చేసేందుకు సన్నద్ధమవుతోంది. దీంతోపాటుగా పర్సనల్, ప్రయివేటు వ్యవహారాలకోసం వేర్వేరు ఫోన్ల అవసరం లేకుండా, ఈ రెండు సౌకర్యాలను తమ లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ లో పొందొచ్చని కూల్ ప్యాడ్ ఇండియా కంపెనీ చెబుతోంది. దీనికి సంబంధించి ఢిల్లలో నిర్వహించే కార్యక్రమానికి మీడియా సంస్థలకు ఆహ్వానం పలుకుతోంది. డ్యూయల్ ఇన్ పేరుతో ఈ ఆహ్వానాన్ని పంపంచింది. సంస్థ సీఈవో సయ్యద్ తాజుద్దీన్ ఈ ఈవెంట్ హాజరు కానున్నట్టు తెలిపింది. అయితే కచ్చితమైన ధరను ఇంకా ప్రకటించనప్పటికీ ఈ పోన్ ధర రూ.10,000 నుంచి రూ.15,000 వరుకు ఉండొచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. కస్టమర్ల వ్యక్తిగత, వృత్తి సంబంధమైన సమాచారం భద్రతకోసం స్పెషల్ ఎన్ క్రిప్షన్ టెక్నాలజీని ఇన్ స్టాల్ చేసినట్టు కంపెనీ ప్రతినిధి ఒకరు తెలిపారు. తద్వారా డేటా లీకేజ్ గురించి చింతించాల్సిన అవసరం లేదంటోంది. రెండు వాట్సాప్ అకౌంట్ల నిర్వహించుకునే సౌలభ్యమున్న ప్రపంచపు మొట్టమొదటి డ్యుయల్ స్పేస్ ఫీచర్‌తో రాబోతున్న స్మార్ట్ ఫోన్ మాదే నంటోంది. యూజర్లకు వాట్సాప్, ఫేస్ బుక్, లైన్, బీబీఎం, లాంటి సోషల్ మీడియాల రెండు అకౌంట్ల నిర్వహణను ఈ ఫోన్ సపోర్టు చేస్తుంది. అలాగే గతంలో మిగతా మార్కెట్లలో రిలీజ్ చేసిన మాక్స్ లైట్ ను ఇంకా భారత్ మార్కెట్లకు విడుదల చేయడంలేదని స్పష్టం చేసింది. కూల్ ప్యాడ్ మాక్స్ స్పెసిఫికేషన్స్ ఇలా ఉన్నాయి.. ఆపరేటింగ్ సిస్టం ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ 3జీబి ర్యామ్, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 615 ప్రాసెసర్, 32జీబి ఇంటర్నల్ మెమరీ 4జీబి ర్యామ్, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 617 ప్రాసెసర్, 13 మెగా పిక్సల్ రియర్ కెమెరా 5 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా 2,800 ఎమ్ఏహెచ్ బ్యాటరీ డ్యుయల్ సిమ్, 4జీ ఎల్టీఈ, బ్లుటూత్, వై-ఫై