హైదరాబాద్: ఎంసెట్ పరీక్ష హల్ టికెట్ల జారీకి ముందుగా ప్రకటించిన షెడ్యూల్‌కు బదులు ఈనెల 9వ తేదీ నుంచే తమ వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకునే వీలు కల్పిస్తున్నట్లు ఎంసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ ఎన్‌వీ రమణరావు వెల్లడించారు. రాష్ట్రంలో ఇంజనీరింగ్, అగ్రికల్చర్ అండ్ మెడికల్ కోర్సుల్లో ప్రవేశాలకు ఈనెల 15న జరిగే పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆయన వివరించారు. తల్లిదండ్రులు, విద్యార్థులు ముందుగానే పరీక్ష కేంద్రాలకు వెళ్లి చూసి వచ్చేందుకు వీలుగా ఈనెల 9వ తేదీ నుంచే హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకునేలా అవకాశం కల్పించినట్లు తెలిపారు.