
న్యూఢిల్లీ: ఈ ఏడాది(2021) మే నెలలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు(ఎఫ్‌డీఐలు) భారీగా ఎగసినట్లు వాణిజ్యం, పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ పేర్కొన్నారు. గతేడాది(2020) ఇదే నెలతో పోలిస్తే 203 శాతం జంప్‌చేసి 12.1 బిలియన్ డాలర్లు(దాదాపు రూ. 8,980 కోట్లు) లభించినట్లు తెలియజేశారు. గత ఆర్థిక సంవత్సరం(2020–21)లో సరికొత్త రికార్డ్ నెలకొల్పుతూ ఎఫ్‌డీఐలు 10 శాతం వృద్ధితో 81.72 బిలియన్ డాలర్లను తాకినట్లు వెల్లడించారు. కాగా.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2021–22)లో 400 బిలియన్ డాలర్ల విలువైన ఎగుమతుల లక్ష్యాన్ని సాధించేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు తెలియజేశారు. ఎగుమతులకు ప్రోత్సాహంపై విభిన్న పరిశ్రమల సమాఖ్యలతో సమావేశం సందర్భంగా గోయల్ ఈ విషయాలు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment