పాడేరు, డుంబ్రిగుడ మండలాల్లో విరబూసిన మే ఫ్లవర్స్
పాడేరు రూరల్, డుంబ్రిగుడ(అరకులోయ): ప్రతి ఏటా మే నెలలో కనిపించి కనువిందు చేసే మే ఫ్లవర్స్ ఈ ఏడాది కాస్త ముందుగా ఏప్రిల్‌నెలలో విరబూశాయి. పాడేరు పట్టణంలోని సుండ్రుపుట్టు వీధిలో తుడుముబాబూరావు అనే గిరిజనుడి ఇంటిపెరట్లో, డుంబ్రి గుడ మండలంలోని మారుమూల పంచాయతీ బొడ్డపుట్టు గ్రామంలో ఈ పుష్పాలు అందాలుచిందించాయి. బొడ్డపుట్టు గ్రామంలో ప్రధాన రోడ్డుకు అనుకుని ఉండడంతో ఆదారిన వెళ్లేవారు, గ్రామస్తులు మే ఫ్లవర్‌ను చూసేందుకు ఆసక్తి కనబరిచారు.
Comments
Please login to add a commentAdd a comment