Paderu mandal
-
ముందే కనువిందు
పాడేరు రూరల్, డుంబ్రిగుడ(అరకులోయ): ప్రతి ఏటా మే నెలలో కనిపించి కనువిందు చేసే మే ఫ్లవర్స్ ఈ ఏడాది కాస్త ముందుగా ఏప్రిల్నెలలో విరబూశాయి. పాడేరు పట్టణంలోని సుండ్రుపుట్టు వీధిలో తుడుముబాబూరావు అనే గిరిజనుడి ఇంటిపెరట్లో, డుంబ్రి గుడ మండలంలోని మారుమూల పంచాయతీ బొడ్డపుట్టు గ్రామంలో ఈ పుష్పాలు అందాలుచిందించాయి. బొడ్డపుట్టు గ్రామంలో ప్రధాన రోడ్డుకు అనుకుని ఉండడంతో ఆదారిన వెళ్లేవారు, గ్రామస్తులు మే ఫ్లవర్‌ను చూసేందుకు ఆసక్తి కనబరిచారు. -
1500 కేజీల గంజాయి స్వాధీనం
విశాఖపట్టణం : విశాఖపట్టణం జిల్లా పాడేరు మండలం పెద్దబయలు గ్రామ శివారులోని ఈదులపుట్టు వద్ద ఒరిస్సాకు అక్రమంగా తరలిస్తున్న 1500 కిలోల గంజాయిని ఎక్సైజ్ అధికారులు బుధవారం పట్టుకున్నారు. ఈ సందర్బంగా ముగ్గురిని అరెస్ట్‌చేశారు. ముందస్తు సమాచారం మేరకు ఎక్సైజ్ సీఐ శ్రీనివాసరావు సిబ్బందితో కలసి తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా గంజాయిని తరలిస్తున్న వ్యాన్‌తోపాటు.... సదరు వాహనానికి పైలట్‌గా వెళుతున్న స్కార్పియో వాహనాన్ని ఎక్సైజ్ సిబ్బంది ఆపారు. గంజాయిని స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. అందుకు సంబంధించి ముగ్గురిని ఎక్సైజ్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అలాగే రెండు వాహనాలను సీజ్ చేశారు. -
ఆర్టీసీ బస్సు బోల్తా: 14 మందికి గాయాలు
విశాఖపట్నం : విశాఖపట్నం జిల్లా పాడేరు ఘాట్‌రోడ్డులోని మినుములురు మలుపు వద్ద గురువారం ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 14 మంది గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి.... క్షతగాత్రులను పాడేరులోని ఏరియా ఆసుపత్రికి తరలించారు. బస్సు స్టీరింగ్ విరగడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుందని ప్రయాణికులు తెలిపారు.