సిరిసిల్లలో మున్సిపల్ కార్మికుల ర్యాలీ
సిరిసిల్లటౌన్ : ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో మంగళవారం మే డే వేడుకలు ఘనంగా నిర్వహించా రు. వివిధ కార్మిక, శ్రామిక, రాజకీయ తదితర పార్టీల ఆధ్వర్యంలో ఉత్సవాలు జరిపారు. కార్మిక క్షేత్రమైన సిరిసిల్లలో వాడవాడనా ఎర్రజెండాల రెపరెపలాడాయి. స్థానిక మున్సిపల్ కార్యాలయం ముందు టీఆర్‌ఎస్‌కేవీ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో కరీంనగర్ పార్లమెంటుసభ్యుడు బోయినపల్లి వినోద్‌కుమార్ పాల్గొని జెండా ఎగురవేశారు.
ఈకార్యక్రమంలో టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్‌రావు, జెడ్పీ చైర్‌పర్సన్ తుల ఉమ, మున్సిపల్ చైర్‌పర్సన్ సామల పావని, ఏఎంసీ చైర్మన్ జిందం చక్రపాణి, టీఆర్‌ఎస్‌కేవీ రాష్ట్ర అధ్యక్షుడు వెంగల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. కార్మిక భవన్‌లో జరిగిన వేడుకల్లో ఏఐటీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సామల మల్లేశం, సీపీఐ జిల్లా కార్యదర్శి గుంటి వేణు, కార్మిక నాయకులు ఎలిగేటి రాజశేఖర్, బూర శ్రీనివాస్, నల్ల చంద్రమౌళి పాల్గొన్నారు. గాంధీనగర్ లేబర్ అడ్డా వద్ద జరిగిన వేడులు మిన్నంటాయి. ‘సెస్’ ఆఫీస్ ముందు వేడుకలు జరిగాయి.
104 యూనియన్ నాయకులు మహేందర్, వెంకటేశ్వర్‌రావు పాల్గొన్నారు. మున్సిపల్ కార్యాలయం ముందు సీఐటీయూ జెండా ఎగురవేశారు. జిల్లా ఆస్పత్రిలో కార్మికులు ఎర్ర జెండాలను ఎగురవేశారు. చేనేత వస్త్రవ్యాపార సంఘ భవనంలో డైయింగ్ కార్మిక సంఘం వేడుకలు నిర్వహించింది. సంఘం జిల్లా అధ్యక్షుడు జెగ్గాని మల్లేశం తదితరులు పాల్గొన్నారు. సీఐటీయూ ఆధ్వర్యంలో వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా కార్మికులను సన్మానించారు. నాయకులు మూషం రమేశ్, పంతం రవి, మోర అజయ్ పాల్గొన్నారు.
ఏఐఎఫ్‌టీయూ ఆధ్వర్యంలోనూ వేడుకలు జరిగాయి. కార్యక్రమంలో నాయకులు భూతం వీరన్న, సోమిశెట్టి దశరథం పాల్గొన్నారు. ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో నాయకులు ఆవునూరి రమాకాంత్‌రావు, డిపో అధ్యక్షుడు ఎల్‌పీ రాం, ప్రధాన కార్యదర్శి సీహెచ్ బాణయ్య పాల్గొన్నారు. నవోదయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన నాయకులు శ్రీనివాస్ పాల్గొన్నారు.
సిరిసిల్లరూరల్ : తంగళ్లపల్లి, సిరిసిల్ల అర్బన్ మండలాలో మేడే వేడుకలు ఘనంగా నిర్వహించారు. సిరిసిల్ల అర్బన్ మండలం పెద్దూర్, రాజీవ్‌నగర్, చంద్రంపేటలో హమాలీ సంఘాల ఆధ్వర్యంలో మేడే వేడుకలు నిర్వహించారు. జెండావిష్కరించి స్వీట్లు పంపిణీ చేశారు. తంగళ్లపల్లి మండలం బస్వాపూర్‌లో కార్మిక సంఘాల ఆధ్వర్యంలో మేడే వేడుకలు నిర్వహించగా ముఖ్య అతిథిగా సింగిల్ విండో డైరెక్టర్ టీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు పూర్మాణి లింగారెడ్డి జెండా ఆవిష్కరించారు. టెక్స్‌టైల్‌పార్క్‌లో సీఐటీయూ, అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో మేడే వేడుకలు నిర్వహించారు. కార్మికులతో ర్యాలీ నిర్వహించారు. తంగళ్లపల్లి, మండెపల్లి, జిల్లెల్ల, బద్దెనపల్లి, చీర్లవంచ గ్రామాల్లో వేడుకలు నిర్వహించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ బండి దేవదాసు, రాములు, అంజయ్య, మధు, రాకం రమేశ్, పెద్దూర్ సింగిల్ విండో చైర్మన్ ఉలిసె తిరుపతి, రెడ్డి నా యక్, వెంకటరమణారావ్, అలీ పాల్గొన్నారు.
ఎల్లారెడ్డిపేట : కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమవుతున్నాయని ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు కానపురం లక్ష్మణ్ అన్నారు. రాచర్ల గొల్లపల్లి, ఎల్లారెడ్డిపేట, వీర్నపల్లి, రంగంపేటలో మంగళవారం మేడే వేడుకలను ఘనంగా నిర్వహిం చారు. జెండాను ఆవిష్కరించి సంబరాలు జరుపుకున్నారు. సీఐటీయూ అధ్యక్షుడు సాన ప్రతాప్, కోనేటి ఎల్లయ్య, మల్లయ్య, మేగి లచ్చయ్య, మేగి శ్రీనివాస్, నర్సయ్య, కనకరాజు, పి. శంకరయ్య, కర్తిలాల్, దేవరాజు, దేవ్‌సింగ్, మోహన్ పాల్గొన్నారు.
ముస్తాబాద్ : కార్మికుల దినోత్సం నిర్వహించారు. తాపీ మేస్త్రీలు, హమాలీలు, భవన నిర్మాణ కార్మికులు ముస్తాబాద్‌లో భారీ ర్యాలీ నిర్వహించారు. మొర్రాయిపల్లి, నామాపూర్, పోత్గల్, గూడెం గ్రామాల్లో మేడే ఉత్సవాలను నిర్వహించారు. అరుణ పతాకాన్ని ఎగురవేశారు. మొర్రాయిపల్లిలో జరిగిన వేడుకల్లో ఎస్సై రాజశేఖర్ పాల్గొని మాట్లాడారు. సర్పంచులు నల్ల నర్సయ్య, సందుపట్ల పద్మ, కొమ్ము పద్మ, టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు కొమ్ము బాల య్య, వైస్ ఎంపీపీ శ్రీనివాస్‌రావు. కార్మిక సంఘాల నాయకులు నర్సయ్య, ఎల్లం, రంగ య్య, అంజిరెడ్డి, రాజు, చంద్రం పాల్గొన్నారు.
గంభీరావుపేట : మండలంలో కార్మిక దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. భవన నిర్మాణ రంగ కార్మిక సంఘం, హమాలీ కార్మిక సంఘం, సీఐటీయూ ఆధ్వర్యంలో జెండావిష్కరణలు నిర్వహించారు. కార్మిక సంఘాల నాయకులు బాలమల్లయ్య, ముద్రకోల ఆంజనేయులు, మాజీ జెడ్పీటీసీ మల్లుగారి నర్సాగౌడ్, సర్పంచ్ పాపగారి భూలక్ష్మి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఎగదండి స్వామి, ఎంపీటీసీ హమీదోద్దీన్, అడ్వయ్య పాల్గొన్నారు.
సిరిసిల్లలో మున్సిపల్ కార్మికుల ర్యాలీ
జెండా ఎగురవేస్తున్న ఈయూ
గౌరవ అధ్యక్షుడు రమాకాంత్‌రావు
Comments
Please login to add a commentAdd a comment