
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మేడే వేడుకలు మంగళవా రం ఘనంగా జరిగాయి. మేడే సందర్భంగా గాంధీభవన్‌లో పీసీసీ అధ్య క్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కాంగ్రెస్ పతాకాన్ని ఆవిష్కరించారు. కార్మిక హక్కులకు కాంగ్రెస్ పార్టీ రక్షణగా నిలిచిందని ఉత్తమ్ అన్నారు.
కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడే కార్మికులు సుఖంగా జీవించారని నేటి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పాలనను చూస్తే అర్థమవుతోందన్నారు. కార్యక్రమంలో టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టివిక్రమార్క, పీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment