May 2 2017 1:45 AM | Updated on Oct 16 2018 2:49 PM
మేడే వేడుకలు
కార్మికులారా ఏకంకండి.. కార్మికుల ఐక్యతతోనే హక్కుల సాధనంటూ...
కార్మికులారా ఏకంకండి.. కార్మికుల ఐక్యతతోనే హక్కుల సాధనంటూ.. నినాదాలు జిల్లాలో మార్మోగాయి. కార్మిక దినోత్సవం సందర్భంగా
జిల్లావ్యాప్తంగా కార్మికులు కదంతొక్కారు. ర్యాలీలు, ప్రదర్శనలు నిర్వహించారు. కార్మిక ఐక్యత వర్థిల్లాలంటూ నినదించారు. ఏలూరులో వివిధ అంశాలపై కార్మికులు నిర్వహించిన ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.