ఘనంగా మేడే వేడుకలు
ఖమ్మం : ఖమ్మం జిల్లా టేకులపల్లి మండలంలో శుక్రవారం ఘనంగా మేడే వేడుకలు నిర్వహించారు. సీపీఎం, సీపీఐ, సీఐటీయూ, ఏఐటీయూసీ, న్యూడెమోక్రసీ, ఇఫ్టూ యూఈఈయూ తదితర సంఘాల ఆధ్వర్యంలో ఎర్రజెండాలను ఎగురవేశారు. కోయగూడెం ఓపెన్‌కాస్టులోనూ యూనియన్ నేతలు ఎర్ర జెండాలను ఎగురవేసి కార్మికుల ఐక్యత వర్ధిల్లాలని నినదించారు.
(టేకులపల్లి)