
సాక్షి, ఖమ్మం : ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్‌కు మంత్రి పదవి దక్కడంతో టీఆర్‌ఎస్ పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నగరంలోని క్యాంప్ ఆఫీసులో పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు తరలివచ్చి కేక్ కట్ చేసి, బాణాసంచా కాల్చి అజయ్‌కుమార్‌కు అభినందనలు తెలిపారు. కాగా కేబినేట్ విస్తరణలో భాగంగా పువ్వాడ అజయ్‌తో పాటు మరో ఐదుగురికి మంత్రి పదవులు దక్కనున్న విషయం తెలిసిందే. టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తోపాటు హరీశ్‌రావు (సిద్దిపేట), సబితా ఇంద్రారెడ్డి (మహేశ్వరం), గంగుల కమలాకర్ (కరీంనగర్), శాసనమండలి సభ్యురాలు సత్యవతి రాథోడ్ పేర్లు ఖరారయ్యాయి. సాయంత్రం 4.14 గంటలకు రాజ్‌భవన్‌లో కొత్త మంత్రులు ప్రమాణస్వీకారం చేయనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment