తమ్ముడికి రాఖీ కడుతున్న అక్క
సత్తుపల్లిటౌన్ : సోదరీ, సోదరుల అనురాగబంధానికి ప్రతీక అయిన రాఖీ పర్వదినాన్ని సత్తుపల్లి నియోజకవర్గంలో ఆదివారం ఘనంగా జరుపుకున్నారు. దూర ప్రాంతాల్లో ఉన్న చెల్లెళ్లు, అక్కలు తమ సోదరుల ఇళ్లకు వచ్చి రాఖీలు కట్టారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు బ్రహ్మకుమారీలు రాఖీలు కట్టి రాష్టాన్ని సుభిక్షంగా ఉండే విధంగా చూడాలని కోరారు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన ఆడబిడ్డలతో పుట్టినిళ్లు కళకళలాడాయి. రాఖీలు కట్టిన అనంతరం సోదరులు సంప్రదాయంగా కానుకలు ఇచ్చి దీవెనలు అందించారు.
పెనుబల్లి మండలంలో..
పెనుబల్లి: రక్షాబంధన్ వేడుకలను ఆదివారం మండలంలో ఘనంగా నిర్వహించారు. అక్కాలకు తమ్ముళ్లు, అన్నాలకు చెళ్లిళ్లు రాఖీలు కట్టారు. స్వీట్లు పంపిణీ చేశారు. సోదర భావాన్ని నిరూపించుకున్నారు. లింగగూడెం ఆదివాసీ యూత్ ఆధ్వర్యంలో రాఖీ వేడుకలను నిర్వహించారు.
తల్లాడ మండలంలో..
తల్లాడ: రక్షాబంధన్ పర్వదినాన్ని ఆదివారం ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా అక్కలు, చెల్లెళ్లు, తమ సోదరులకు రాఖీలు కట్టి స్వీట్స్ తినిపించారు. చిన్నవారి నుంచి పెద్ద వారి వరకు తమ సోదరులకు రాఖీలు కట్టారు. లయన్స్‌క్లబ్ ఆధ్వర్యంలో రాఖీ వేడుకలు జరిగాయి. తల్లాడలో రాఖీ, స్వీట్స్ షాపుల వద్ద సందడి కన్పించింది.
వేంసూరు మండలంలో..
వేంసూరు : సోదరీమణులు.. సోదరులకు ఆప్యాయంగా రాఖీలు కట్టారు. అక్కా, చెల్లెళ్లు.. అన్నదమ్ముల ఇళ్లకు వచ్చి రక్షబంధన్ కట్టి అనురాగాన్ని పంచి ఇవ్వాలని కోరారు. సోదరుల నుంచి ఆశీర్వాదాలు అందుకున్నారు.
కల్లూరు మండలంలో..
కల్లూరు: రాఖీ పౌర్ణమిని పురస్కరించుకుని మండలంలో ఆదివారం ఘనంగా వేడుకలు జరుపుకున్నారు. తమ సోదరులకు రాఖీ కట్టేందుకు ఆడపడుచులు పుట్టింటికి వచ్చి రాఖీలు కట్టారు. వారి నుంచి ఆశీర్వాదాలు తీసుకున్నారు. స్వీట్లు పంపిణీ చేయడం లాంటి కార్యక్రమాలతో పండగ వాతావరణం చోటు చేసుకుంది. కల్లూరులో ఎంపీపీ వలసాల జయలక్ష్మి.. టీఆర్‌ఎస్ నాయకులకు రాఖీలు కట్టారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు పాలెపు రామారావు, లక్కినేని కృష్ణ, అత్తునూరి రంగారెడ్డి, మేకల కృష్ణ, ఎస్‌కే యూకూబ్ అలీ బొప్పన శ్రీనా«ధ్, కర్నాటి సాంబశివారెడ్డి, ఎస్‌డీ రవూఫ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment