Sridevi And Chiranjeevi Remuneration For Jagadeka Veerudu Athiloka Sundari Movie - Sakshi
Sakshi News home page

Chiranjeevi Sridevi Remuneration: హీరోలకు సమానంగా శ్రీదేవి పారితోషికం.. ఆ సినిమాలో ఎంతంటే ?

Published Sat, Feb 5 2022 12:12 PM | Last Updated on Sat, Feb 5 2022 12:53 PM

Chiranjeevi Sridevi Remuneration In Jagadeka Veerudu Athiloka Sundari - Sakshi

Chiranjeevi Sridevi Remuneration In Jagadeka Veerudu Athiloka Sundari: మెగాస్టార్​ చిరంజీవి నటనలో, అతిలోక సుందరి, దివంగత నటి శ్రీదేవి అందం, అభినయంలో ఎవరికీ వారే సాటి. వీరిద్దరూ కలిసి స్క్రీన్ షేర్​ చేసుకున్న అద్భుతమైన క్లాసిక్​ చిత్రం 'జగదేక వీరుడు అతిలోక సుందరి'. ఈ సినిమాతోనే శ్రీదేవికి 'అతిలోక సుందరి' అనే పేరు వచ్చిందని తెలుస్తోంది. దర్శకేంద్రుడు కే రాఘవేంద్ర డైరెక్షన్​లో వచ్చిన ఈ సోషియో ఫాంటసీ చిత్రం సినీ అభిమానులను అబ్బురపరిచింది. ఒక అందమైన లోకంలో విహరించేలా చేసింది. 1990 మే 9న విడుదలై ఈ సినిమా బాక్సాఫీస్​ వద్ద బంపర్ హిట్​ కొట్టి రూ. 15 కోట్లు వసూలు చేసింది. 

'జగదేక వీరుడు అతిలోక సుందరి' సినిమాను ఆ సమయంలో రూ. 9 కోట్ల భారీ బడ్జెట్​తో వైజయంతీ మూవీస్​ బ్యానర్​లో అశ్వనీదత్ నిర్మించారట. ఈ సినిమా గురించి నిర్మాత అశ్వనీదత్​ ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను తెలిపారు. అందులో నటీనటుల రెమ్యునరేషన్​ గురించి చెబుతూ చిరంజీవికి సుమారు రూ. 35 లక్షలు, శ్రీదేవికి రూ. 25 లక్షలు ఇచ్చినట్లు తెలిపారు. ఆ సమయంలో శ్రీదేవికి ఫుల్ క్రేజ్ ఉందని, హీరోలకు సమానంగా పారితోషికం అందుకునేదన్నారు​. ఈ సినిమాకు సీక్వెల్ తీయాలనే ఆలోచన ఉందని, కానీ ఆచరణలోకి ఇంకా రాలేదని పేర్కొన్నారు. ఈ సినిమాలో సుందరం మాస్టారు, ప్రభుదేవా కొరియోగ్రఫీతో పాటు మాస్ట్రో ఇళయరాజా సంగీతం కూడా హైలెట్​గా నిలిచాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement