Jack Movie
-
బేబీ.. ఇలా అయితే కష్టమే!
ఇండస్ట్రీలోకి తెలుగమ్మాయి రావడమే అరుదు. అలాంటిది వచ్చిన అవకాశాల్ని ఎంతో జాగ్రత్తగా సద్వినియోగం చేసుకోవాలి. కానీ 'బేబీ' వైష్ణవిని చూస్తుంటే మాత్రం తప్పటడుగులు వేస్తుందేమో అనిపిస్తుంది. ఎందుకంటే వరసపెట్టి రెండు ఫ్లాప్స్ పడ్డాయి. షార్ట్ ఫిల్మ్ నటిగా కెరీర్ మొదలుపెట్టిన వైష్ణవి చైతన్య.. సినిమాల్లోనూ బన్నీ, నాని సరసన సహాయ పాత్రలు చేసింది. ఎప్పుడైతే 'బేబి' మూవీతో హీరోయిన్ గా మారిందో ఈమె ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. ఇలాంటప్పుడే ఆచితూచి కథలు ఎంచుకుని అడుగులు వేయాల్సి ఉంటుంది.(ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీల్లోకి వచ్చేసిన 21 సినిమాలు) ఈ క్రమంలోనే దిల్ రాజు వారసుడు ఆశిష్ హీరోగా నటించిన 'లవ్ మీ' అనే హారర్ మూవీ చేసింది. ఇదొక సినిమా వచ్చి వెళ్లిన విషయం కూడా చాలామందికి గుర్తులేదు. తాజాగా టిల్లు ఫేమ్ సిద్ధు జొన్నలగడ్డతో 'జాక్' చేసింది. ఇదైనా ఈమె దశ మారుస్తుందనుకుంటే మళ్లీ నిరాశే ఎదురైంది.సినిమా ఫ్లాప్ కావడానికి వైష్ణవి చైతన్య పూర్తి కారణం కాకపోవచ్చు. కానీ ఇలా వరస సినిమాలు ఫెయిల్ అవుతున్నాయంటే అందులో వైష్ణవి స్క్రిప్ట్ సెలక్షన్ లాంటి పొరపాట్లు కూడా ఉంటాయి. ఇకముందైనా మంచి కథల్ని ఎంచుకుని మూవీస్ చేస్తే సరి. లేదంటే మాత్రం మొదటికే మోసం వచ్చే ప్రమాదముంది.(ఇదీ చదవండి: 'ప్రావింకుడు షప్పు' సినిమా రివ్యూ (ఓటీటీ)) -
తేడాకొట్టిన 'జాక్'.. తొలిరోజు కలెక్షన్ ఇంత తక్కువా?
'టిల్లు' సినిమాలతో ఆకట్టుకున్న సిద్ధు.. తాజాగా థియేటర్లలోకి 'జాక్'గా వచ్చాడు. ట్రైలర్ రిలీజైన దగ్గర నుంచి దీనిపై పెద్దగా అంచనాలేం లేవు. అయినా సరే ఏదైనా మ్యాజిక్ జరుగుతుందేమోనని అనుకున్నారు. కానీ అలాంటిదేం లేదు. తొలిరోజు మిక్స్ డ్ రివ్యూస్ రాగా.. రెండో రోజుకి నెగిటివ్ టాక్ వచ్చేసింది. (ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీల్లోకి వచ్చేసిన 21 సినిమాలు) హైప్ లేకపోవడంతో తొలిరోజే పెద్దగా ఎవరూ థియేటర్లలోకి రాలేదు. సిద్ధు, 'బేబీ' వైష్ణవి చైతన్య ఉన్న ఉపయోగం లేకుండా పోయింది. కంటెంట్ మరీ తీసికట్టుగా ఉందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే మొదటిరోజు చాలా తక్కువ కలెక్షన్స్ వచ్చినట్లు తెలుస్తోంది.సిద్ధు గత సినిమా 'టిల్లు స్క్వేర్'కి రూ.23 కోట్ల వరకు తొలిరోజు వసూళ్లు రాగా.. 'జాక్' చిత్రానికి మాత్రం రూ.కోటిన్నర నుంచి రూ.2 కోట్ల కలెక్షన్స్ మాత్రమే వచ్చాయని అంటున్నారు. టాక్ ఇలానే ఉంటే గనక వీకెండ్ తర్వాత బాక్సాఫీస్ దగ్గర మూవీ నిలబడటం కష్టమే!(ఇదీ చదవండి: ఎట్టకేలకు క్షమాపణలు చెప్పిన యాంకర్ రవి) -
Jack Movie Review: ‘జాక్’ మూవీ హిట్టా? ఫట్టా?
డీజే టిల్లు, టిల్లు స్వ్కేర్ చిత్రాలతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకొని ఫుల్ జోష్‌లో ఉన్నాడు స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ (siddhu jonnalagadda). హ్యాట్రిక్ హిట్ కోసం బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో రొమాంటిక్ కామెడీ యాక్షన్ ఎంటర్టైనర్ ‘జాక్’తో నేడు(ఏప్రిల్ 10) ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మరి సిద్ధు ఖాతాలో హ్యాట్రిక్ హిట్ పడిందా లేదా రివ్యూలో చూద్దాం.కథేంటంటే.. పాబ్లో నెరుడా అలియాస్ జాక్ (సిద్ధు జొన్నలగడ్డ) రా (రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్) ఏజెంట్ కావాలని కలలు కంటాడు. తనకున్న టాలెంట్ అంతా ఉపయోగించి ఇంటర్వ్యూ వరకు వెళ్తాడు. ఆ రిజల్ట్ రాకముందే ఖాలీగా ఉండడం ఎందుకని దేశాన్ని కాపాడేందుకు రంగంలోకి దిగుతాడు. ఉగ్రవాదులు, హైదారాబాద్‌తో పాటు భారత్‌లోని ఇతర ప్రధాన నగరాల్లో విధ్వంసం సృష్టించేందుకు ప్లాన్ చేస్తున్నారనే విషయం తెలుసుకొని వారిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తాడు. మరోవైపు జాక్ ఏం పని చేస్తున్నాడో కనుక్కోమని ప్రైవేట్ డిటెక్టివ్ అఫిషాన్ బేగం (వైష్ణవి చైతన్య)కు లక్ష రూపాయలు ఇస్తాడు అతని తండ్రి పాన్ ఇండియా ప్రసాద్(నరేశ్). అఫిషాన్ బేగం భానుమతి పేరుతో జాక్కి దగ్గరై జాక్ పనిపై నిఘా పెడుతుంది. టెర్రరిస్టులను పట్టుకునే క్రమంలో పొరపాటున ‘రా’ఏజెంట్ మనోజ్(ప్రకాశ్ రాజ్)ని కిడ్నాప్ చేస్తాడు జాక్. ఆ తర్వాత ఏం జరిగింది? టెర్రరిస్ట్ గ్యాంగ్‌ని జాక్ పట్టుకోగలిగాడా లేదా? అసలు జాక్ ‘రా’ ఏజెంట్ కావాలని ఎందుకు అనుకున్నాడు? చివరకు తను కోరుకున్న ఉద్యోగం పొందగలిగాడా లేదా? అనేదే తెలియాలంటే జాక్(Jack Movie Review) సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే..ఒక శిలై ఉన్నానని భూమి కుంగునా?నేనొక శిల్పానని దైవం తుళ్లునా?మలిచిన శిల్పం, మలచని రాయి ఈ రెంటిలోన గొప్పది ..శిల్పమా? శిలా? ఏ జవాబు అందినా పోరు ఆగేదేనా..? రెండిటి మధ్యన..!.. సినిమా ఎండింగ్లో బొమ్మరిల్లు భాస్కర్ చెప్పిన ‘రాయి – శిల్పం’ థియరీ ఇది. ఇందులో నిజంగానే ఏది గొప్పదో చెప్పలేం కానీ ఈ సినిమా విషయంలో మాత్రం శిల్పి(దర్శకుడు) లోపం చాలానే ఉంది. మంచి రాయి( హీరో) ఉన్నప్పటికీ దాన్ని అందమైన శిల్పంగా మార్చడంలో తడబడ్డాడు. బొమ్మరిల్లు భాస్కర్ తన స్టైల్ కథను పక్కకు పెట్టి తీసిన సినిమా ఇది. ఇంట్రెస్టింగ్ పాయింట్ రాసుకున్నాడు. హీరో పాత్రను కూడా ఆసక్తికరంగానే తీర్చిదిద్దాదు. కానీ కథనం విషయంలో జాగ్రత్త పడలేదు. దేశానికి ముందుడి ప్రమాదం రాకుండా ఆపేదే ‘రా’ అంటూ ‘రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్’ గురించి గొప్పగా చెప్పిన భాస్కర్.. కథలో మాత్రం ‘రా’ ఏజెంట్లను కమెడియన్ల కంటే తక్కువ చేసి చూపించారు. ‘రా’ , ఉగ్రవాదం ..ఇలాంటి కథలను సీరియస్‌గా చెప్తేనే ఆసక్తికరంగా ఉంటుంది. కానీ భాస్కర్ సీరియస్ సబ్జెక్ట్ ఎంచుకొని దానికి కామెడీ టచ్ ఇచ్చాడు. ఇది పూర్తిగా సఫలం కాలేదు. మదర్ సెంటిమెంట్ ఉన్నప్పటికీ.. దాన్ని పూర్తిగా వాడుకోలేకపోయాడు.‘వీడు కొంచెం క్రాక్’ అని సినిమాకు పెట్టిన ట్యాగ్‌లైన్‌కు తగ్గట్టుగానే హీరో క్యారెక్టర్ని మలిచాడు. ఫస్టాఫ్ అంతా ఫన్వేలో నడుస్తుంది. ఉగ్రవాదులను పట్టుకునేందుకు హీరో చేసే ప్రయత్నం క్రాక్గానే అనిపిస్తుంది. ఫస్టాఫ్‌లో బలమైన సన్నివేశాలు లేనప్పటికీ స్క్రీన్‌ప్లేతో నెట్టుకొచ్చాడు. ఇంటర్వెల్ సీన్ అయితే మరీ సిల్లీగా అనిపిస్తుంది. ఇక సెకండాఫ్‌లో కథనం కాస్త ఆసక్తికరంగా సాగుతుంది. నేపాల్ ఎపిసోడ్ కొంతమేర ఆకట్టుకున్నా.. టెర్రరిస్టులతో జరిగే యాక్షన్ డ్రామా రక్తి కట్టించదు. బలమైన కథ లేకపోవడంతో ముగింపు కూడా రొటీన్‌గానే ఉంటుంది. బొమ్మరిల్లు భాస్కర్ ఈ శిల్పాన్ని మరింత అందంగా చెక్కాల్సింది.ఎవరెలా చేశారంటే..డీజే టిల్లు, టిల్లు స్క్వేర్ చిత్రాలతో యూత్‌ని ఆకట్టుకున్న సిద్ధు..మరోసారి తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. కొంచెం క్రాక్ ఉన్న జాక్ పాత్రకు న్యాయం చేశాడు. తెరపై స్టైలీష్‌గా కనిపించాడు. క్లైమాక్స్‌లో ఫైట్ కూడా చేశాడు. అయితే జాక్ మాటలు, బిహేవియర్ చూస్తే ‘టిల్లు’ వద్దన్నా గుర్తుకు వస్తాడు. వైష్ణవి చైతన్య కు స్క్రీన్ స్పేస్ ఎక్కువే ఉన్నప్పటికీ ఆమె పాత్రకు అంతగా ప్రాధాన్యత ఉండదు. నటన పరంగాను మెప్పించడానికి అక్కడ స్కోపే లేదు. ఏదో హీరోయిన్ ఉండాలి కాబట్టి ఆ క్యారెక్టర్ని డిజైన్ చేశారు. ‘రా’ ఏజెంట్ మనోజ్‌గా ప్రకాశ్ రాజ్ తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. అయితే ఆయన పాత్రను అటు సీరియస్‌గాను..ఇటు పూర్తి కమెడియన్‌గాను మల్చలేక రెండింటికి మధ్య ఊగిసలాడేలా తీర్చిదిద్దారు. సుబ్బరాజు పాత్ర కూడా అంతే. మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. సాంకేతికంగా సినిమా పర్వాలేదు. పాటలు అంతగా గుర్తుపెట్టుకునేలా ఉండవు కానీ నేపథ్య సంగీతం ఓకే. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటర్ తన కత్తెరకు బాగా పని చెప్పాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. -
‘జాక్’ మూవీ హీరోయిన్ వైష్ణవి చైతన్య (ఫొటోలు)
-
‘జాక్’ట్విటర్ రివ్యూ: ‘టిల్లుగాడి’ సినిమాకు ఊహించని టాక్!
స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటించిన తాజా చిత్రం ‘జాక్’. ‘బొమ్మరిల్లు’ ఫేమ్ భాస్కర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ‘బేబీ’బ్యూటీ వైష్ణవి చైతన్య హీరోయిన్గా నటించింది. శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌పై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం నేడు(ఏప్రిల్ 10) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన టీజర్, పాటలకు మంచి స్పందన వచ్చింది. దానికి తోడు ప్రమోషన్స్ కూడా గట్టిగా చేయడంతో ‘జాక్’పై భారీ హైప్ క్రియేట్ అయింది. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ చిత్రానికి ఎక్స్(ట్విటర్)లో మిక్స్డ్ టాక్ వస్తోంది. సినిమా చూసిన నెటిజన్స్.. తమ అభిప్రాయాన్ని ఎక్స్‌లో తెలియజేస్తూ.. యావరేజ్ సినిమా అంటున్నారు. మరికొంతమంది అయితే సిద్ధు ఖాతాలో తొలిసారి డిజాస్టర్ పడిందని చెబుతున్నారు. ఇంకొంత మంది సినిమా బాగుంది. బ్లాక్ బస్టర్ హిట్ అని చెబుతున్నారు. నెటిజన్ల అభిప్రాయాలపై ఓ లుక్కేయండి. #Jack Only for Siddu!!Just some comedy scenes and Siddu role, Nothing worked in film. Siddu dialogues, Comedy timing, Action helped film atleast for a One time watch. Stroy, Screenplay, Music, Songs, BGM, cinematography Everything 👎Only for Siddu Character and Some One…— tolly_wood_UK_US_Europe (@tolly_UK_US_EU) April 10, 2025 ‘జాక్ సినిమా కేవలం సిద్ధుదే. కొన్ని కామెడీ సీన్లు, సిద్ధు క్యారెక్టర్ తప్ప మిగతావేవి ఆకట్టుకోలేవు. సిద్ధు డైలాగ్స్, కామెడీ టైమింగ్ సినిమాకు ప్లస్ అయ్యాయి. కథ, స్క్రీన్‌ప్లే, మ్యూజిక్, పాటలు, బీజీఎం, సినిమాటోగ్రఫీ..ఏది కూడా అంతగా ఆకట్టుకోలేకపోయాయి’ అంటూ ఓ నెటిజన్ 2 రేటింగ్ ఇచ్చాడు.#JACK - Half baked story which lacks connectivityRAW ni Royal ga chupinchali ila Rotha kadhu 🙏😭Prathi sari one liners tho cinema workout avvadhu Ani Inka yeppatiki ardam avvudho emo 🥱Intha cheppinaka kuda Theatre lo chusta ante velli ma laga Bugga avvandi #Tollywood pic.twitter.com/JX8h1lCMXD— 𝑺𝒖𝒋𝒆𝒆𝒗.𝑮 (@sujeev_Nani) April 9, 2025 జాక్ సగం వండి వదిలేసిన అన్నంలా ఉది. ఏ చోట కూడా కనెక్టివిటీ ఉండదు. ‘రా'ని రాయల్‌గా చూపించాలి కానీ ఇలా రోతలా కాదు. ప్రతిసారి వన్‌లైనర్‌తో సినిమా వర్కౌట్ అవ్వదని ఇంకా ఎప్పటికి అర్థం చేసుకుంటారో. ఇంత చెప్పినా కూడా థియేటర్లో సినిమా చూస్తా అంటే మీ ఇష్టం అని మరో నెటిజన్ రాసుకొచ్చాడు.Bhaskar’s attempt at a commercial mix fails due to weak writing and a messy screenplay. Siddhu tries hard, but dull scenes and flat dialogues drag him down. The spy plot is bland, comedy rarely clicks, music is forgettable, and poor visuals make it hard to sit through. #jack pic.twitter.com/jcIDJYqxdj— Dingu420 (@dingu420) April 10, 2025 భాస్కర్ తొలిసారి ప్రయత్నించిన కమర్షియల్ మిక్స్ వీక్ రైటింగ్, స్క్రీన్‌ప్లే కారణంగా ఫెయిల్ అయింది. సిద్దు హార్డ్ వర్క్ చేశాడు కానీ బలమైన సన్నివేశాలు లేకపోవడం కారణంగా అతని పాత్ర కూడా ఆకట్టుకోలేకపోయింది. కామెడీ కొన్ని చోట్ల పర్వాలేదు. మ్యూజిక్ గురించి మర్చిపోవాలి. విజువల్స్ కూడా పూర్‌గా ఉన్నాయని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.#Jack is a spy action comedy that disappoints big time as both the spy portions and comedy fail to deliver for the most part. Director Bhaskar tried to pack all commercial aspects in this film but none of them could make a solid impact because of the clumsy screenplay and weak…— Venky Reviews (@venkyreviews) April 9, 2025 జాక్ అనేది ఓ స్పై కామెడీ యాక్షన్ మూవీ. కానీ అందులో స్పై మూమెంట్స్ కానీ కామెడీ కానీ వర్కౌట్ కాలేదు.బొమ్మరిల్లు భాస్కర్ ఈ సినిమాలో అన్ని కమర్షియల్ అంశాల్ని పొందుపర్చాలనుకున్నాడు. కానీ అందులో ఏ ఒక్క అంశం కూడా జనాలకు కనెక్ట్ అయ్యేలా లేదు.గందరగోళంగా నడిచే స్క్రీన్ ప్లే.. వీక్ రైటింగ్‌తో బోరింగ్ అనిపిస్తుంది అని ఇంకో నెటిజన్ ట్వీట్ చూస్తూ 2 రేటింగ్ ఇచ్చాడు.#Jack: StarBoy for a Reason? Not Quite!Rating: ⭐️⭐️Jack ends up being a major disappointment in the spy genre. Director Bhaskar seems lost between what he wrote and what he tried to direct. The film feels like a comic spoof of spy thrillers but falls flat with a boring and…— Chay Reviews (@chay_reviews) April 10, 2025It's mind-boggling to see movies like #Jack and #Spy just deliberately use the patriotism angle but execute it in an extremely poor way which ultimately looks/feels like they're demeaning or humiliating our army, police, the RAW and the Indian Government 😥— LoneBatman (@SampathGNV) April 10, 2025#JackReview:Heavily banks on Siddhu’s performance and a quirky lead character. While the theme is decent, the execution falls flat. Filled with illogical scenes, weak action, poor cinematography, cheap VFX and forgettable songs, it ends up as a half baked— Adesh Neradi (@AdeshNerad31345) April 9, 2025Show completed:- #jack My rating 2.25/5Half baked Raw movie Illogical scenes in 2nd half pic.twitter.com/1Xq7al7OoY— venkatesh kilaru (@kilaru_venki) April 9, 2025 -
సినిమాకు అతను చాలా ముఖ్యం.. లేకపోతే కాళ్లు, చేతులు ఆడవు: సిద్ధు జొన్నలగడ్డ
టిల్లు స్క్వేర్ తర్వాత టాలీవుడ్ యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ నటించిన తాజా చిత్రం జాక్. ఈ మూవీకి బొమ్మిరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో బేబీ ఫేమ్ వైష్ణవి చైతన్య హీరోయిన్గా నటించింది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఏప్రిల్ 10న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్లలో భాగంగా హైదరాబాద్‌లో జాక్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా నిర్వహించారు.ఈ ఈవెంట్‌కు హాజరైన హీరో సిద్ధు జొన్నలగడ్డ ఆసక్తికర కామెంట్స్ చేశారు. మన సినీ ఇండస్ట్రీలో ఎడిటర్ గురించి ఎవరూ మాట్లాడరని అన్నారు. టిల్లు స్క్వేర్, తండేల్, మ్యాడ్ స్క్వేర్ హిట్ అయ్యాయంటే ఎడిటర్ నవీన్ నూలి మాత్రమే కారణమన్నారు. కానీ సినిమాకు ఎడిటర్ అనేవారు చాలా ముఖ్యం.. ఆయన లేకపోతే దర్శకుడికి కాళ్లు, చేతులు ఆడవని సిద్ధు అన్నారు. మనం చాలా తక్కువగా ఎడిటర్ గురించి మట్లాడతాం.. కానీ వారే సినిమాకు చాలా ప్రధానమని ఆయన తెలిపారు. మా జాక్ సినిమాకు నవీన్ నూలినే ఎడిటర్.. ఆయనతో కలిసి పనిచేయడం చాలా హ్యాపీగా ఉందన్నారు.అలాగే రానా ముఖ్య అతిథిగా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు హాజరు కాకపోవడంపై కూడా సిద్ధు స్పందించారు. రానా ప్రస్తుతం ముంబయిలో ఉన్నారని తెలిపారు. రానా నాయుడు సీజన్-2 డబ్బింగ్‌తో బిజీగా ఉన్నారని సిద్ధు వెల్లడించారు. సాయంత్రం ఐదున్నరకు రావాల్సిన విమానం మిస్ కావడంతోనే రానా రాలేకపోయారని సిద్ధు క్లారిటీ ఇచ్చారు. -
‘జాక్’ మూవీ ప్రీరిజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
మా సినిమాలో వైష్ణవిని చాలా బ్యాడ్‌గా చూపిస్తాం: నిర్మాత నాగవంశీ కామెంట్స్
సిద్ధు జొన్నలగడ్డ, వైష్ణవి చైతన్య జంటగా నటించిన తాజా చిత్రం జాక్. ఈ సినిమాను బొమ్మరిల్లు భాస్కర్(Bommarillu Bhaskar) దర్శకత్వంలో తెరకెక్కించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం థియేటర్లలో సందడి చేసేందుకు వస్తోంది. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై బీవీఎస్ఎన్ ప్రసాద్, బాపినీడు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 10న విడుదల కానుంది. ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ కాగా ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో గ్రాండ్‌గా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.ఈ ఈవెంట్‌కు హాజరైన టాలీవుడ్ నిర్మాత సూర్యదేవర నాగవంశీ ఆసక్తికర కామెంట్స్ చేశారు. జాక్ మూవీలో నటిస్తోన్న హీరోయిన్ను ఉద్దేశించి మాట్లాడారు. ఈ సినిమాలో చాలా పద్ధతిగా వైష్ణవిని చూస్తారని ఆయన అన్నారు. ఆ తర్వాత మా ప్రాజెక్ట్‌లో తాను నటించబోతోందని వెల్లడించారు. అయితే మా సినిమాలో మాత్రం చాలా మాస్‌గా చూపిస్తామని తెలిపారు. చివరిసారిగా వైష్ణవిని ఈ సినిమాలో పద్ధతిగా చూడమని సలహా ఇచ్చారు. మా సినిమాలో అన్ని మోడరన్ బూతులే ఉంటాయని నాగవంశీ వ్యాఖ్యలు చేశారు. -
భీమవరం విష్ణు కాలేజీలో ‘జాక్’ మూవీ టీమ్ సందడి (ఫొటోలు)
-
జాక్ ట్రైలర్లో బూతులు.. సెన్సార్ ఏ సర్టిఫికేట్ ఇచ్చిందంటే?
టాలీవుడ్ హీరో సిద్ధూ జొన్నలగడ్డ (Siddhu Jonnalagadda), బేబీ ఫేమ్ వైష్ణవి చైతన్య జంటగా నటించిన తాజా చిత్రం జాక్. ఈ సినిమాను బొమ్మరిల్లు భాస్కర్(Bommarillu Bhaskar) దర్శకత్వంలో తెరకెక్కించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం థియేటర్లలో సందడి చేసేందుకు వస్తోంది. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై బీవీఎస్ఎన్ ప్రసాద్, బాపినీడు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 10న విడుదల కానుంది. ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ కాగా ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.తాజాగా జాక్ మూవీ సెన్సార్ కూడా పూర్తి చేసుకుంది. ఈ సినిమాకు యూ/ఏ సర్టిఫికేట్ వచ్చినట్లు చిత్ర నిర్మాణ సంస్థ వెల్లడించింది. అయితే ట్రైలర్లో ఎక్కువగా బూతులు వినియోగించడంతో సెన్సార్ విషయంలో ఇబ్బందులు రావొచ్చని ఊహించారు. కానీ ఎలాంటి కట్స్ లేకుండానే సెన్సార్ పూర్తియినట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో వైష్ణవి చైతన్య తొలిసారి ద్విపాత్రాభినయం చేస్తుండటం విశేషం. The equation is set 😎The chaos is calculated 🤟🏻#JACK certified 𝐔/𝐀 Rounding off the entertainment in the most explosive way ❤️🔥Bookings are now open 🎟️ https://t.co/6uRbOx5ekl#JackOnApril10th#SidduJonnalagadda @iamvaishnavi04 @baskifilmz @Prakashraaj #AchuRajamani… pic.twitter.com/9DbOmDuqb3— SVCC (@SVCCofficial) April 7, 2025 -
విజయవాడ : ‘జాక్’ మూవీ ప్రమోషన్ లో సిద్ధూ, వైష్ణవి చైతన్య (ఫొటోలు)