
‘బిగ్‌బాస్’కు పెద్దల హెచ్చరిక!
ఒకవైపు కలర్స్‌లో ‘బిగ్‌బాస్-8’ కొనసాగుతుండగా, మరోవైపు దీని గురించి రాజ్యసభలో వేడివేడి చర్చ జరిగింది. ఈ కార్యక్రమం చాలా అసభ్యకరంగా ఉంటోందని కొంతమంది ఎంపీలు కేంద్ర ప్రసారమంత్రిత్వ శాఖ దృష్టికి తీసుకొచ్చారు. ‘కెమెరాలు పెట్టి అమ్మాయిలు స్నానం చేయడాన్ని చూపుతున్న ఇలాంటి కార్యక్రమాల ప్రసారాన్ని ఎందుకు ఆపడం లేదు?’ అని విపక్ష సభ్యులు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
అసభ్యతతో సాగే ఇలాంటి కార్యక్రమాలన్నింటినీ ఆపివేయాలని సభ్యులు ఆ శాఖమంత్రి రాజవర్ధన్‌సింగ్ రాథోడ్‌ను కోరారు. ఈ సందర్భంగా మంత్రి సమాధానం ఇస్తూ... దేశంలో భావస్వేచ్ఛ ఉందనీ, ఎవరైనా పరిధి దాటినట్టుగా అనిపిస్తే వారిని నియంత్రిస్తామనీ అన్నారు. బిగ్‌బాస్ విషయంలోనే కాకుండా టెలివిజన్ చానళ్లలో ప్రసారం అయ్యే వివిధ రియాలిటీ షోల పోకడలు సమాచార శాఖ దృష్టిలోనే ఉన్నాయని కూడా మంత్రి తెలిపారు. ఈ విధంగా ఆయన రియాలిటీషోల నిర్వాహకులకు ఒక హెచ్చరిక జారీ చేశారు.