సినీ పరిశ్రమలో ఆ నగదు లేనేలేదు! | There's no blackmoney in film industry, claims Rajyavardhan Singh Rathore | Sakshi
Sakshi News home page

సినీ పరిశ్రమలో ఆ నగదు లేనేలేదు!

Published Mon, Nov 28 2016 6:02 PM | Last Updated on Wed, Apr 3 2019 5:14 PM

సినీ పరిశ్రమలో ఆ నగదు లేనేలేదు! - Sakshi

సినీ పరిశ్రమలో ఆ నగదు లేనేలేదు!

పెద్ద నోట్ల రద్దుతో సినీ పరిశ్రమలోకి బ్లాక్మనీని చొప్పించారంటూ వస్తున్న నెగిటివ్ ప్రచారానికి తెరవేయాలని కేంద్ర సమాచార ప్రసారాల శాఖ సహాయ మంత్రి రాజ్యవర్థన్ సింగ్ రాథోర్ కోరారు.

పనాజి : సినీ పరిశ్రమ, రియల్ ఎస్టేట్ రంగంలో బ్లాక్మనీ లేదంటే ఒకింత ఆశ్చర్యమే. ఈ పరిశ్రమలో బ్లాక్మనీ విచ్చలవిడిగా తిరుగుతూ ఉంటుంది. అలాంటిది సినీ పరిశ్రమలో అసలు బ్లాక్మనీనే లేదంట. ఈ మాట ఎవరు చెప్పారో తెలుసా? కేంద్ర సమాచార ప్రసారాల శాఖ సహాయ మంత్రి రాజ్యవర్థన్ సింగ్ రాథోర్ తెలిపారు. పెద్ద నోట్ల రద్దుతో సినీ పరిశ్రమలోకి బ్లాక్మనీని చొప్పించారంటూ వస్తున్న నెగిటివ్ ప్రచారానికి తెరవేయాలని ఆయన కోరారు. పెద్ద నోట్ల రద్దుతో సినీ పరిశ్రమ లాభపడే అవకాశముందని ఆయన పేర్కొన్నారు. బ్లాక్మనీని సినీ పరిశ్రమలోకి చొప్పిస్తారని మనం వింటూ వస్తున్నాం..కానీ ఈ స్టేజ్లో బ్లాక్మనీ ఫిల్మ్ ఇంటస్ట్రీలో వస్తుందని తాను భావించడం లేదని రాథోర్ తెలిపారు.
 
ఫిల్మ్ ఫండింగ్ పారదర్శకత ఉండటం వల్ల మంచి సినిమాలకు మద్దతు లభిస్తుందని ఆశిస్తున్నట్టు పేర్కొన్నారు. ఇంటర్నేషనల్ ఫ్మిల్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ''సినిమాను రూపొందించడం ఓ టీమ్ వర్క్. బాయ్ నుంచి మొదలుకుంటే ఫిల్మ్ స్టార్ వరకు అందరు పనిచేస్తేనే సినిమా తెరకెక్కుతుంది. ఒకవేళ వారికి చెల్లించే జీతాన్ని డైరెక్ట్గా వారి అకౌంట్లలోకి వేస్తే, వారు సరియైన జీతాలు పొందుతారు. పాత నోట్లను రద్దుచేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల ఇండస్ట్రికి మద్దతు లభిస్తుంది'' అని చెప్పారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement