రాథోడ్ కుమారుడికి కాంస్యం | Rajyavardhan Rathore's son bags bronze medal | Sakshi
Sakshi News home page

రాథోడ్ కుమారుడికి కాంస్యం

Oct 10 2013 12:52 AM | Updated on Sep 1 2017 11:29 PM

ఒలింపిక్ పతక విజేత, వెటరన్ షూటర్ రాజ్యవర్ధన్‌సింగ్ రాథోడ్ కుమారుడు మానవాదిత్య ఆసియా షాట్‌గన్ చాంపియన్‌షిప్‌లో మెరిశాడు.

న్యూఢిల్లీ: ఒలింపిక్ పతక విజేత, వెటరన్ షూటర్ రాజ్యవర్ధన్‌సింగ్ రాథోడ్ కుమారుడు మానవాదిత్య ఆసియా షాట్‌గన్ చాంపియన్‌షిప్‌లో మెరిశాడు. కజకిస్థాన్‌లోని అల్మతిలో జరుగుతున్న ఈ పోటీల్లో మానవాదిత్య జూనియర్ ట్రాప్ ఈవెంట్‌లో కాంస్య పతకం గెలుపొందాడు. సీనియర్ ట్రాప్ టీమ్ ఈవెంట్‌లో మానవ్‌జిత్ (124 పాయింట్లు), జోరవర్ సింగ్ సంధు (121), మన్‌షీర్ సింగ్ (120)లతో కూడిన జట్టు పసిడి పతకం సాధించింది. 375 పాయింట్లకు గాను ఈ జట్టు 365 పాయింట్లు సాధించింది. సీనియర్ ట్రాప్ వ్యక్తిగత విభాగంలోనూ మానవ్‌జిత్ సింగ్ సంధు కాంస్య పతకంతో సత్తాచాటాడు. ఈ టోర్నీలో భారత్ రెండు స్వర్ణాలు, పలు రజతాలతో పాటు మూడు కాంస్య పతకాలు గెలుపొందింది.  మహిళల సీనియర్ ట్రాప్ టీమ్ విభాగంలో సీమా తోమర్, షాగన్ చౌదరి, శ్రేయసి సింగ్ రజతం సాధించింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement