రాథోడ్ కుమారుడికి కాంస్యం
న్యూఢిల్లీ: ఒలింపిక్ పతక విజేత, వెటరన్ షూటర్ రాజ్యవర్ధన్‌సింగ్ రాథోడ్ కుమారుడు మానవాదిత్య ఆసియా షాట్‌గన్ చాంపియన్‌షిప్‌లో మెరిశాడు. కజకిస్థాన్‌లోని అల్మతిలో జరుగుతున్న ఈ పోటీల్లో మానవాదిత్య జూనియర్ ట్రాప్ ఈవెంట్లో కాంస్య పతకం గెలుపొందాడు. సీనియర్ ట్రాప్ టీమ్ ఈవెంట్లో మానవ్‌జిత్ (124 పాయింట్లు), జోరవర్ సింగ్ సంధు (121), మన్షీర్ సింగ్ (120)లతో కూడిన జట్టు పసిడి పతకం సాధించింది. 375 పాయింట్లకు గాను ఈ జట్టు 365 పాయింట్లు సాధించింది. సీనియర్ ట్రాప్ వ్యక్తిగత విభాగంలోనూ మానవ్‌జిత్ సింగ్ సంధు కాంస్య పతకంతో సత్తాచాటాడు. ఈ టోర్నీలో భారత్ రెండు స్వర్ణాలు, పలు రజతాలతో పాటు మూడు కాంస్య పతకాలు గెలుపొందింది. మహిళల సీనియర్ ట్రాప్ టీమ్ విభాగంలో సీమా తోమర్, షాగన్ చౌదరి, శ్రేయసి సింగ్ రజతం సాధించింది.