హార్దిక్ పాండ్యా విధ్వంసం.. 20 బంతుల్లో హాఫ్ సెంచ‌రీ | Syed Mushtaq Ali Trophy 2024: Hardik Pandya Smashes CSK Recruit Gurjapneet Singh For 4 Sixes In An Over, Watch Video Goes Viral | Sakshi
Sakshi News home page

SMT 2024: హార్దిక్ పాండ్యా విధ్వంసం.. 20 బంతుల్లో హాఫ్ సెంచ‌రీ

Published Wed, Nov 27 2024 9:13 PM | Last Updated on Thu, Nov 28 2024 10:29 AM

 Hardik Pandya smashes CSK recruit Gurjapneet Singh for 4 sixes in an over

సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ-2024లో బ‌రోడా త‌మ జైత్ర యాత్ర‌ను కొన‌సాగిస్తోంది. ఈ టోర్నీలో భాగంగా బుధ‌వారం ఇండోర్ వేదిక‌గా త‌మిళ‌నాడుతో జ‌రిగిన మ్యాచ్‌లో 3 వికెట్ల తేడాతో థ్రిల్లింగ్ విక్ట‌రీ న‌మోదు చేసింది. 222 ప‌రుగుల భారీ ల‌క్ష్యాన్ని ఆఖ‌రి బంతికి చేధించింది.

ఈ భారీ ల‌క్ష్య చేధ‌న‌లో ఆ జ‌ట్టు స్టార్ ఆల్‌రౌండ‌ర్ హార్దిక్ పాండ్యా విధ్వంస‌క‌ర ఫిప్టీతో చెల‌రేగాడు. ఆరో స్ధానంలో బ్యాటింగ్‌కు వ‌చ్చిన పాండ్యా ఆకాశ‌మే హ‌ద్దుగా చెల‌రేగాడు. కేవ‌లం 20 బంతుల్లోనే త‌న హాఫ్ సెంచ‌రీ మార్క్‌ను అందుకున్నాడు.

ముఖ్యంగా తమిళనాడు పేసర్‌ గుర్జప్నీత్ సింగ్‌కు హార్దిక్‌ చుక్కలు చూపించాడు. బరోడా ఇన్నింగ్స్‌ 17 ఓవర్‌ వేసిన గుర్జప్నీత్ బౌలింగ్‌లో పాండ్యా 4 సిక్స్‌లు, ఒక ఫోర్‌ బాది ఏకంగా 29 పరుగులు పిండుకున్నాడు.

ఓవ‌రాల్‌గా 30 బంతులు ఎదుర్కొన్న పాండ్యా.. 4 ఫోర్లు, 7 సిక్స్‌ల‌తో 69 ప‌రుగులు చేసి రనౌట‌య్యాడు. హార్దిక్‌తో పాటు భాను పానియా 42 ప‌రుగుల‌తో రాణించాడు. ఫ‌లితంగా బ‌రోడా 7 వికెట్లు కోల్పోయి ఛేజ్ చేసింది. త‌మిళ‌నాడు బౌల‌ర్ల‌లో స్పిన్న‌ర్లు వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి మూడు, సాయికిషోర్ రెండు వికెట్లు సాధించారు.

జగదీశన్ హాఫ్ సెంచ‌రీ..
ఇక ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన త‌మిళ‌నాడు నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 6 వికెట్ల న‌ష్టానికి 221 ప‌రుగులు చేసింది. త‌మిళ‌నాడు బ్యాట‌ర్ల‌లో ఓపెన‌ర్ జ‌గ‌దీశ‌న్‌(57) హాఫ్ సెంచ‌రీతో మెర‌వ‌గా.. విజ‌య్ శంక‌ర్‌(42), షరూఖ్ ఖాన్‌(39) ప‌రుగుల‌తో రాణించాడు. బ‌రోడా బౌల‌ర్లలో మెరివాలా మూడు వికెట్లు ప‌డ‌గొట్ట‌గా.. మ‌హేష్ ప‌తియా, నినాంద్ ర‌త్వా త‌లా వికెట్ సాధించారు.
చదవండి: ఏమి త‌ప్పుచేశానో ఆర్ధం కావడం లేదు.. చాలా బాధగా ఉంది: టీమిండియా ఓపెనర్‌


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement