తిలక్ వర్మ- సంజూ శాంసన్ (ఫైల్ ఫొటో)
Syed Mushtaq Ali Trophy 2023- జైపూర్: దేశవాళీ టి20 క్రికెట్ టోర్నమెంట్ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ నేడు మొదలవుతుంది. 22 రోజులపాటు జరిగే ఈ టోర్నీలో మొత్తం 38 జట్ల మధ్య 135 మ్యాచ్‌లు జరుగుతాయి. 38 జట్లను ఐదు గ్రూపులుగా విభజించారు. గ్రూప్ ‘ఎ’లో హైదరాబాద్, డిఫెండింగ్ చాంపియన్ ముంబై, బరోడా, హరియాణా, ఛత్తీస్‌గఢ్, జమ్మూ కశ్మీర్, మిజోరం, మేఘాలయ ఉన్నాయి.
ఇక గ్రూప్ ‘సి’లో ఆంధ్ర, రైల్వేస్, సౌరాష్ట్ర, అరుణాచల్‌ప్రదేశ్, గోవా, గుజరాత్, మణిపూర్, పంజాబ్ జట్లకు చోటు కల్పించారు. అక్టోబర్ 27 వరకు గ్రూప్ లీగ్ మ్యాచ్‌లు జరుగుతాయి. లీగ్ మ్యాచ్‌లు పూర్తయ్యాక ఐదు గ్రూప్‌ల్లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన 10 జట్లు నాకౌట్ దశకు అర్హత సాధిస్తాయి.
కాగా సోమవారం జరిగే తొలి లీగ్ మ్యాచ్‌లలో తిలక్ వర్మ సారథ్యంలోని హైదరాబాద్ జట్టు మేఘాలయతో... కోన శ్రీకర్ భరత్ నాయకత్వంలోని ఆంధ్ర జట్టు గోవాతో తలపడతాయి. ఈ టోర్నీ మ్యాచ్‌లను జియో సినిమా యాప్, స్పోర్ట్స్ 18 ఖేల్ చానెల్స్‌లో ప్రత్యక్ష ప్రసారం చేస్తారు.
ఇక సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ-2023లో కోన శ్రీకర్ భరత్(ఆంధ్ర), తిలక్ వర్మ(హైదరాబాద్)తో మరో టీమిండియా స్టార్ సంజూ శాంసన్(కేరళ) సైతం.. హిమాచల్ ప్రదేశ్ అక్టోబరు 16 నాటి మ్యాచ్‌తో కెప్టెన్‌గా బరిలోకి దిగనున్నాడు.
గ్రూప్ ఎ: హర్యానా, బరోడా, ఛత్తీస్ గఢ్, మేఘాలయ, హైదరాబాద్, మిజోరం, ముంబై, జమ్ముకశ్మీర్.
గ్రూప్ బి: అస్సాం, హిమాచల్ ప్రదేశ్, కేరళ, బీహార్, చండీగఢ్, ఒడిశా, సిక్కిం, సర్వీసెస్.
గ్రూప్ సి: ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, గోవా, గుజరాత్, మణిపూర్, పంజాబ్, రైల్వేస్, సౌరాష్ట్ర.
గ్రూప్ డి: బెంగాల్, జార్ఖండ్, మహారాష్ట్ర, పుదుచ్చేరి, రాజస్థాన్, ఉత్తరాఖండ్, విదర్భ.
గ్రూప్ ఇ: ఢిల్లీ, కర్ణాటక, మధ్యప్రదేశ్, నాగాలాండ్, తమిళనాడు, త్రిపుర, ఉత్తరప్రదేశ్.
Comments
Please login to add a commentAdd a comment