
ఢిల్లీ: భారత క్రికెటర్ సురేశ్ రైనా అరుదైన ఘనతను సాధించాడు. టీ20 ఫార్మాట్‌లో ఎనిమిది వేల పరుగుల్ని పూర్తి చేసుకున్న తొలి టీమిండియా క్రికెటర్‌గా రికార్డు నెలకొల్పాడు. సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర‍్నమెంట్‌లో భాగంగా ఉత్తర్‌ప్రదేశ్ తరఫున ఆడుతున్న రైనా.. పాండిచ్చేరితో జరిగిన మ్యాచ్‌లో ఈ ఫీట్ సాధించాడు. సోమవారం జరిగిన మ్యాచ్‌లో రైనా 12 పరుగులు సాధించాడు.
ఫలితంగా టీ20ల్లో ఎనిమిది వేల పరుగుల మైలురాయిని చేరాడు. ప్రస్తుతం రైనా 8001 పరుగులతో ఉన్నాడు. ఓవరాల్‌గా టీ20 క్రికెట్‌లో ఎనిమిది వేల పరుగుల్ని సాధించిన ఆరో క్రికెటర్‌గా రైనా నిలిచాడు. మరొకవైపు రైనాకు ఇది 300 టీ20 మ్యాచ్. దాంతో మూడొందల టీ20 మ్యాచ్‌లు ఆడిన రెండో భారత క్రికెటర్‌గా రైనా గుర్తింపు సాధించాడు. ఇప్పటికే 300 టీ20 మ్యాచ్‌లు ఆడిన ఘనతను ధోని సాధించగా, ఆ తర్వాత స్థానంలో రైనా ఉన్నాడు. ఇక టీ20 ఫార్మాట్‌లో పరుగుల విషయానికొస్తే టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి కంటే 168 పరుగులతో ముందంజలో ఉన్నాడు రైనా. ఇప్పటివరకూ 251 టీ20 మ్యాచ్‌లు ఆడిన కోహ్లి 7,833 పరుగులు నమోదు చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment