కోల్‌కతా: గత కొంతకాలంగా ఫామ్ కోసం తంటాలు పడుతున్న భారత బ్యాట్స్‌మన్ సురేశ్ రైనా సరికొత్త రికార్డు సృష్టించాడు. ట్వంటీ 20 ఫార్మాట్‌లో భారత్ తరపున అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా కొత్త అధ్యాయాన్ని లిఖించాడు. ఈ క్రమంలోనే భారత కెప్టెన్ విరాట్ కోహ్లి(7,068)ని వెనక్కినెట్టి తొలి స్థానాన్ని ఆక‍్రమించాడు. సయ్యద్ ముస్తాక్ అలీ టి20 టోర్నీలో భాగంగా మంగళవారం ఈడెన్ గార్డెన్‌లో తమిళనాడుతో మ్యాచ్‌లో ఉత్తరప‍్రదేశ్‌కు సారథిగా వ్యవహరిస్తున్న రైనా ఈ ఘనతను సాధించాడు. ఈరోజు మ్యాచ్‌లో 61 పరుగులు సాధించిన రైనా 7,114 పరుగులతో అగ్రస్థానానికి ఎగబాకాడు.
నిన్న బెంగాల్‌తో జరిగిన మ్యాచ్‌లో రైనా (59 బంతుల్లో 126 నాటౌట్; 13 ఫోర్లు, 7 సిక్సర్లు) అజేయ శతకం సాధించిన సంగతి తెలిసిందే. 49 బంతుల్లో సెంచరీ చేసి సత్తాచాటుకున్నాడు. దాంతో 7,053 పరుగులతో కోహ్లి రికార్డుకు దగ్గరగా వచ్చిన రైనా.. దాన్ని రోజు వ్యవధిలోనే అధిగమించడం కొత్త చరిత్ర లిఖించాడు.
Comments
Please login to add a commentAdd a comment