
సాక్షి, హైదరాబాద్: సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ టి20 క్రికెట్ టోర్నమెంట్‌లో హైదరాబాద్ జట్టు పరాజయాల పరంపర కొనసాగుతోంది. టోర్నీలో ఇప్పటివరకు మూడు మ్యాచ్‌లాడిన హైదరాబాద్ ఒక్క విజయాన్నీ అందుకోలేకపోయింది. న్యూఢిల్లీలోని పాలం ఎయిర్‌ఫోర్స్ కాంప్లెక్స్ గ్రౌండ్‌లో ఆదివారం బరోడాతో జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ 4 వికెట్ల తేడాతో ఓడిపోయింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 131 పరుగులు చేసింది. రెండో ఓవర్‌లోనే ఓపెనర్ తన్మయ్ అగర్వాల్ (4) పెవిలియన్ చేరాడు. అనంతరం అక్షత్ రెడ్డి (44 బంతుల్లో 46; 5 ఫోర్లు)కి జతకూడిన హిమాలయ్ అగర్వాల్ (8) కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయాడు. బి. సందీప్ (34 బంతుల్లో 39; 3 ఫోర్లు, 1 సిక్స్) అండతో అక్షత్ రెడ్డి స్కోరు పెంచే ప్రయత్నం చేశాడు. వీరిద్దరూ మూడో వికెట్‌కు 48 పరుగులు జోడించాక అక్షత్‌ను ఔట్ చేసి సేథ్ ఈ జంటను విడదీశాడు.
అంబటి రాయుడు (17; 2 ఫోర్లు) సహకారంతో సందీప్ స్ట్రయిక్ రొటేట్ చేశాడు. వీరిద్దరూ కుదురుకుంటోన్న సమయంలో అరోథె ఒక పరుగు తేడాలో సందీప్, సుమంత్ కొల్లా (0)లను పెవిలియన్ చేర్చాడు. మరుసటి బంతికే రాయుడు కూడా ఔటవడంతో జట్టు సాధారణ స్కోరు చేయగలిగింది. ఆకాశ్ భండారి (2) ఇన్నింగ్స్ చివరి బంతికి ఔటయ్యాడు. ప్రత్యర్థి బౌలర్లలో రిషి తుషార్ (ఆర్‌టీ) అరోథె 4 వికెట్లతో చెలరేగగా, అతీత్ సేథ్ 2 వికెట్లు దక్కించు కున్నాడు. అనంతరం బరోడా 19.4 ఓవర్లలో 6 వికెట్లకు 134 పరుగులు చేసి గెలుపొందింది. మ్యాచ్ ఆరంభంలోనే మెహదీహసన్ ఓపెనర్లు కేదార్ దేవ్‌ధర్ (9), మోహిత్ మోంగియా (7)లను ఔట్ చేసి బరోడాపై ఒత్తిడి పెంచాడు. అయితే విష్ణు సోలంకీ (38 బంతుల్లో 40; 4 ఫోర్లు), దీపక్ జగ్బీర్ హుడా (30 బంతుల్లో 35; 5 ఫోర్లు) పట్టుదలగా ఆడి మూడో వికెట్‌కు 52 పరుగుల్ని జోడించి జట్టును ఆదుకున్నారు. తర్వాత దీపక్, యూసుఫ్ పఠాన్ (0) వెంటవెంటనే ఔటైనా.... మిగతా బ్యాట్స్‌మెన్ సహకారంతో స్వప్నిల్ కె సింగ్ (36 నాటౌట్; 4 ఫోర్లు, 1 సిక్స్) మ్యాచ్‌ను ముగించాడు. హైదరాబాద్ బౌలర్లలో మెహదీ హసన్, సీవీ మిలింద్ చెరో 2 వికెట్లు దక్కించుకున్నారు. ఆకాశ్ భండారి ఒక వికెట్ పడగొట్టాడు. నేడు జరిగే మ్యాచ్‌లో మహారాష్ట్రతో హైదరాబాద్ తలపడుతుంది.
స్కోరు వివరాలు
హైదరాబాద్ ఇన్నింగ్స్: తన్మయ్ అగర్వాల్ (బి) ఆర్‌టీ అరోథె 4; అక్షత్ రెడ్డి (సి) యూసుఫ్ పఠాన్ (బి) సేథ్ 46; హిమాలయ్ అగర్వాల్ (సి) కేదార్ దేవ్‌ధర్ (బి) ఆర్‌టీ అరోథె 8; బి. సందీప్ (సి) మేరీవాలా (బి) ఆర్‌టీ అరోథె 39; రాయుడు (సి) కుమార్ (బి) సేథ్ 17; సుమంత్ (బి) ఆర్‌టీ అరోథె 0; ఆకాశ్ భండారి (సి) కుమార్ (బి) మేరీవాలా 2; సాకేత్ (నాటౌట్) 6; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 131.
వికెట్ల పతనం: 1–13, 2–32, 3–80, 4–119, 5–120, 6–120, 7–131.
బౌలింగ్: అతీత్ సేథ్ 4–0–37–2, ఆర్‌టీ అరోథె 4–0–18–4, భార్గవ్ భట్ 4–0–23–0, స్వప్నిల్ 4–0–24–0, లుక్మాన్ ఇక్బాల్ మేరీవాలా 4–0–22–1.
బరోడా ఇన్నింగ్స్: కేదార్ దేవ్‌ధర్ (సి) రోహిత్ రాయుడు (బి) మెహదీ హసన్ 9; మోహిత్ మోంగియా (బి) మెహదీ హసన్ 7; విష్ణు సోలంకీ (సి) సుమంత్ (బి) మిలింద్ 40; దీపక్ (రనౌట్) 35; యూసుఫ్ పఠాన్ (సి) అక్షత్ రెడ్డి (బి) ఆకాశ్ భండారి 0; స్వప్నిల్ సింగ్ (నాటౌట్) 36; మితేశ్ పటేల్ (సి) ఆకాశ్ (బి) మిలింద్ 2; సేథ్ (నాటౌట్) 5; ఎక్స్‌ట్రాలు 0; మొత్తం (19.4 ఓవర్లలో 6 వికెట్లకు) 134.
వికెట్ల పతనం: 1–16, 2–17, 3–69, 4–72, 5–119, 6–121.
బౌలింగ్: సిరాజ్ 2–0–34–0, మెహదీ హసన్ 4–0–28–2, సందీప్ 4–0–17–0, మిలింద్ 3.4–0–18–2, ఆకాశ్ భండారి 4–0–25–1, సాకేత్ 2–0–12–0.
Comments
Please login to add a commentAdd a comment