
Jayadev Unadkat Shares Batting Video Ask Selectors Indirectly Consider For All Rounder.. జైదేవ్ ఉనాద్కట్.. టీమిండియాకు 2010లోనే టెస్టు క్రికెట్ ద్వారా ఎంట్రీ ఇచ్చాడు. ఒక టెస్టు, 7 వన్డేల్లో ప్రాతినిధ్యం వహించిన ఉనాద్కట్ బౌలర్‌గానే ఎంపికయ్యాడు. ఆ తర్వాత క్రమంగా టీమిండియాకు దూరమయ్యాడు. తాజాగా సయ్యద్ ముస్తాక్ అలీ టి20 ట్రోఫీలో ఉనాద్కట్ సౌరాష్ట్ర కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. ఈ సందర్భంగా ఉనాద్కట్ తన బ్యాటింగ్ వీడియోనూ షేర్ చేస్తూ.. ''జాతీయ జట్టులో ఆల్‌రౌండర్‌గా సేవలందించడానికి సిద్ధంగా ఉన్నా.. నన్ను పరిగణలోకి తీసుకోండి.'' అంటూ కామెంట్ చేశాడు.
చదవండి: Syed Musthaq Ali T20: సయ్యద్ ముస్తాక్ టి20లో దుమ్మురేపుతున్న దేశవాలీ ఆటగాళ్లు
కాగా ప్రస్తుతం టీమిండియాలో పేస్ ఆల్‌రౌండర్ అవసరం చాలా ఉంది. హార్దిక్ పాండ్యా రూపంలో ఆ భర్తీ జరిగిందని భావించినప్పటికీ.. అతను ఫామ్ కోల్పోయి జట్టులో చోటును ప్రశ్నార్థకం చేసుకున్నాడు. ఇటీవలే టి20 ప్రపంచకప్ 2021లో హార్దిక్ టీమిండియాకు ఆల్‌రౌండర్‌గా ఏ మాత్రం ఉపయోగపడలేకపోయాడు. దీంతో న్యూజిలాండ్‌తో టి20 సిరీస్‌కు సెలక్టర్లు హార్దిక్‌ను పక్కనబెట్టారు. ఇక అతని స్థానంలో వెంకటేశ్ అయ్యర్ పేస్ ఆల్‌రౌండర్‌గా చోటు కల్పించినప్పటికీ అతనికి ఇదే డెబ్యూ సిరీస్ కావడం విశేషం.
ఇక టీమిండియా తరపున 2018లో చివరి వన్డే ఆడిన ఉనాద్కట్ అప్పటినుంచి దేశవాలీ లీగ్‌లతో పాటు ఐపీఎల్‌లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటూ వస్తున్నాడు. 2018 ఐపీఎల్ సీజన్‌కు రాజస్తాన్ రాయల్స్‌కు ఉనాద్కట్ రూ. 11.5 కోట్లకు అమ్ముడుపోవడం విశేషం.
చదవండి: IND vs NZ Test Series: కరుణ్ నాయర్ అయిపోయాడు.. ఇప్పుడు విహారి వంతు
Just another pace bowler who can bat.. 😉 pic.twitter.com/FlIEns2JB6
— Jaydev Unadkat (@JUnadkat) November 12, 2021
Comments
Please login to add a commentAdd a comment