
ఒకే రోజు 23 వికెట్లు పడ్డాయి..
లాహ్లీ (హరియాణా): రంజీ ట్రోఫీలో భాగంగా బెంగాల్, బరోడా జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో బౌలర్లు వికెట్ల పండగ చేసుకున్నారు. సోమవారం ఆరంభమైన ఈ మ్యాచ్‌లో తొలిరోజే మొత్తం 23 వికెట్లు పడ్డాయి.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బరోడా తొలి ఇన్నింగ్స్‌లో 97 పరుగులకు కుప్పకూలింది. బెంగాల్ బౌలర్ అశోక్ దిండా (6/45) అద్భుతంగా బౌలింగ్ చేసి బరోడాను చావు దెబ్బతీశాడు. కాగా అనంతరం బ్యాటింగ్ చేసిన బెంగాల్ పరిస్థితి మరింత దారుణంగా మారింది. అతిత్ సేథ్ (7/36) ధాటికి బెంగాల్ తొలి ఇన్నింగ్స్‌లో 76 పరుగులకే చాపచుట్టేసింది. ఇదేరోజు రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన బరోడా ఆట ముగిసేసరికి మూడు వికెట్ల నష్టానికి 63 పరుగులు చేసింది. బరోడా ఓవరాల్‌గా 84 పరుగులు ఆధిక్యంలో ఉంది. మంగళవారం కూడా వికెట్లపతనం ఇలాగే కొనసాగితే మ్యాచ్ రెండు రోజుల్లోనే ముగియడం ఖాయం.