సెమీస్‌లో తమిళనాడు, బరోడా | Semifinals in Tamil Nadu, Baroda | Sakshi
Sakshi News home page

సెమీస్‌లో తమిళనాడు, బరోడా

Published Mon, Mar 13 2017 1:04 AM | Last Updated on Tue, Sep 5 2017 5:54 AM

Semifinals in  Tamil Nadu, Baroda

న్యూఢిల్లీ: విజయ్‌ హజారే వన్డే క్రికెట్‌ టోర్నమెంట్‌లో తమిళనాడు, బరోడా జట్లు సెమీఫైనల్లో అడుగుపెట్టాయి. ఆదివారం జరిగిన క్వార్టర్‌ ఫైనల్లో తమిళనాడు జట్టు 5 వికెట్ల తేడాతో డిఫెండింగ్‌ చాంపియన్స్‌ గుజరాత్‌ జట్టును ఓడించింది. తొలుత గుజరాత్‌ 49.4 ఓవర్లలో 211 పరుగులకు ఆలౌటైంది. రజుల్‌ భట్‌ (83 నాటౌట్‌; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) టాప్‌ స్కోరర్‌.  అనంతరం తమిళనాడు 42.2 ఓవర్లలో ఐదు వికెట్లకు 217 పరుగులు చేసి గెలిచింది.

శ్రీధర్‌ రాజు (85; 12 ఫోర్లు) రాణించాడు. మరో మ్యాచ్‌లో కర్ణాటక జట్టుపై బరోడా ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. మొదట కర్ణాటక 233 పరుగులకు ఆలౌటవ్వగా... బరోడా 45.5 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 234 పరుగులు చేసి నెగ్గింది. క్రునాల్‌ పాండ్యా (70; 5 ఫోర్లు, 1 సిక్సర్‌), కేదార్‌ (78; 6 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధసెంచరీలు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement