రంజీ ట్రోఫీ 2024 సీజన్ ఆరంభంలోనే సంచలనం నమోదైంది. డిఫెండింగ్ ఛాంపియన్ ముంబైకు బరోడా జట్టు షాకిచ్చింది. వడోదరా వేదికగా జరిగిన మ్యాచ్‌లో ముంబైపై బరోడా 84 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బరోడా తొలి ఇన్నింగ్స్‌లో 290 పరుగులకు ఆలౌటైంది.
మితేశ్ పటేల్ (86), అతిత్ సేథ్ (66) అర్ద సెంచరీలతో రాణించారు. ముంబై బౌలర్లలో తనుశ్ కోటియన్ నాలుగు వికెట్లు పడగొట్టగా.. షమ్స్ ములానీ మూడు, శార్దూల్ ఠాకూర్ రెండు, మోహిత్ అవస్తి ఓ వికెట్ దక్కించుకున్నారు.
అనంతరం బరిలోకి దిగిన ముంబై తొలి ఇన్నింగ్స్‌లో 214 పరుగులకు పరిమితమైంది. ముంబై ఇన్నింగ్స్‌లో ఆయుశ్ మాత్రే (52) ఒక్కడే అర్ద సెంచరీతో రాణించాడు. స్టార్ ఆటగాళ్లు పృథ్వీ షా 7, ఆజింక్య రహానే 29, శ్రేయస్ అయ్యర్ 0, శార్దూల్ ఠాకూర్ 27 పరుగులకు ఔటయ్యారు. బరోడా బౌలర్లలో భార్గవ్ భట్ నాలుగు, అభిమన్యు సింగ్ మూడు, మహేశ్ పితియా రెండు, కృనాల్ పాండ్యా ఓ వికెట్ పడగొట్టారు.
76 పరుగుల లీడ్‌తో సెకెండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన బరోడా.. తనుశ్ కోటియన్ ఐదేయడంతో (5/61) 185 పరుగులకే ఆలౌటైంది. హిమాన్షు సింగ్ 3, మోహిత్ అవస్తి, శార్దూల్ ఠాకూర్ తలో వికెట్ పడగొట్టారు. బరోడా ఇన్నింగ్స్‌లో కృనాల్ పాండ్యా (55) అర్ద సెంచరీతో రాణించాడు.
262 పరుగుల ఓ మోస్తరు లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ముంబై.. భార్గవ్ భట్ (6/55) మాయాజాలం ధాటికి 177 పరుగులకే కుప్పకూలింది. ఫలితంగా చిన్న జట్టు చేతిలో ఘోర పరాజయాన్ని చవి చూసింది. ముంబై ఇన్నింగ్స్‌లో సిద్దేశ్ లాడ్ ఒక్కడే (59) అర్ద సెంచరీతో రాణించాడు.
చదవండి: చరిత్రపుటల్లోకెక్కిన కమిందు మెండిస్
Comments
Please login to add a commentAdd a comment