Ind Vs WI: Nicholas Pooran Fined 15 Percent Of His Match Fee For Criticising The Umpires During Match - Sakshi
Sakshi News home page

IND Vs WI 2nd T20I: నికోలస్‌ పూరన్‌కు బిగ్‌షాకిచ్చిన ఐసీసీ.. భారీ జరిమానా! ఎందుకంటే?

Published Tue, Aug 8 2023 7:38 AM | Last Updated on Tue, Aug 8 2023 9:26 AM

Nicholas Pooran has been fined 15 percent of his match fees - Sakshi

గయానా వేదికగా టీమిండియాతో జరిగిన రెండో టీ20లో 2 వికెట్ల తేడాతో వెస్టిండీస్‌ విజయం సాధించిన సంగతి తెలిసిందే. విండీస్‌ విజయంలో కీలక పాత్ర పోషించిన వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ నికోలస్‌ పూరన్‌కు ఐసీసీ బిగ్‌షాకిచ్చింది. అంపైరింగ్ నిర్ణయాలను వ్యతిరేకించినందుకు పూరన్‌కు మ్యాచ్ ఫీజులో 15 శాతం ఐసీసీ కోత విధించింది. లెవెల్-1 ఐసీసీ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు పూరన్‌కు ఫైన్‌ విధించారు

ఏం జరిగిందంటే?
విండీస్‌ ఇన్నింగ్స్‌ 4 ఓవర్‌ వేసిన అర్ష్‌దీప్‌ సింగ్‌ బౌలింగ్‌లో నాలుగో బంతిని కైల్‌మైర్స్‌ లెగ్‌సైడ్‌ ఆడేందుకు ప్రయత్నించాడు. అయితే బంతి బ్యాట్‌కు మిస్స్‌ అయ్యి అతడి ప్యాడ్‌కు తాకింది. వెంటనే ఎల్బీకి అప్పీల్‌ చేయగా ఫీల్డ్‌ అంపైర్‌ ఔటని వేలు పైకెత్తాడు. వెంటనే మైర్స్‌ నాన్‌స్ట్రైక్‌లో ఉన్న పూరన్‌తో చర్చించి రివ్యూకు వెళ్లాడు. రివ్యూలో ఫలితం​ అంపైర్‌కాల్‌ తేలింది.

దీంతో మైర్స్‌ పెవిలియన్‌కు వెళ్లక తప్పలేదు. ఈ క్రమంలో పూరన్‌ ఫీల్డ్‌ అంపైర్‌ నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేశాడు. "మీరు ఔట్‌ ఇవ్వకపోయి ఉంటే అది కచ్చితంగా నాటౌట్‌" అంటూ బహిరంగంగా విమర్శించాడు. ఈనేపథ్యంలోనే ఫీల్డ్‌ అంపైర్‌లు ఫిర్యాదుతో మ్యాచ్‌ రిఫరీ పూరన్‌పై చర్యలు తీసుకున్నాడు. కాగా పూరన్‌ కూడా తన తప్పును అంగీకరించాడు. ఇక ఇరు జట్ల మధ్య మూడో టీ20 గయనా వేదికగా ఆగస్టు 8న జరగనుంది.
చదవండి:ODI WC 2023: 12 ఏళ్ల తర్వాత మళ్లీ.. ప్రపంచకప్‌లో విజయం మాదే: రోహిత్‌ శర్మ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement