వెస్టిండీస్‌తో టెస్టు, వన్డే సిరీస్ సొంతం చేసుకున్న టీమిండియా.. ఇప్పుడు టీ20 సిరీస్‌పై కన్నేసింది. ట్రినిడాడ్ వేదికగా గురువారం నుంచి భారత్-వెస్టిండీస్ మధ్య ఐదు టీ20ల సిరీస్ ప్రారంభం కానుంది. ఈ క్రమంలో తొలి వన్డేలో హార్దిక్ పాండ్యా సారధ్యంలోని భారత జట్టు విధ్వంసకర విండీస్‌తో అమీతుమీ తెల్చుకోనుంది. ఈ సిరీస్‌కు కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి సెలక్టర్లు విశ్రాంతి ఇచ్చారు. వచ్చే ఏడాది జరగనున్న టీ20 ప్రపంచకప్‌కు తమ స్ధానాలు పదిలం చేసుకోవాలంటే కుర్రాళ్లకు ఈ సిరీస్ మంచి అవకాశం.
జైశ్వాల్, తిలక్ వర్మ ఎంట్రీ..
ఇక ట్రినిడాడ్ వేదికగా విండీస్‌తో జరగనున్న తొలి మ్యాచ్‌తో విధ్వంసకర ఓపెనర్ యశస్వీ జైశ్వాల్, యువ ఆటగాడు తిలక్ వర్మ అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో అడుగుటపెట్టనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే టెస్టు జట్టులోకి ఎంట్రీ ఇచ్చిన జైశ్వాల్.. తన సత్తా ఎంటో నిరూపించుకున్నాడు. తొలి టెస్టు మ్యాచ్‌లో అద్భుతమైన సెంచరీతో చెలరేగి రికార్డు పుటలకెక్కాడు.
అయితే తన ఫేవరేట్ ఫార్మాట్ టీ20ల్లో కూడా సత్తా చాటేందుకు యశస్వీ సిద్దమయ్యాడు. ఇషాన్ కిషన్‌తో కలిసి జైశ్వాల్ భారత ఇన్నింగ్స్‌ను ప్రారంభించే అవకాశం ఉంది. జైశ్వాల్‌కు ఓపెనర్‌గా ఛాన్స్ వస్తే.. గిల్ ఫస్ట్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు రానున్నాడు. అదే విధంగా ఐపీఎల్‌లో అదరగొట్టి తొలి భారత జట్టుకు ఎంపికైన తిలక్ వర్మకు కూడా తుది జట్టులో చోటు దక్కనున్నట్లు తెలుస్తోంది.
మిడిలార్డర్‌లో నిలకడకు మారుపేరు అయిన తిలక్.. ఐదు స్ధానంలో బ్యాటింగ్ వచ్చే అవకాశం ఉంది. ఈ మ్యాచ్‌లో ముగ్గురు పేసర్లు, ఇద్దరు స్పిన్నర్లతో బరిలోకి దిగాలని భారత జట్టు మెనెజ్‌మెంట్ నిర్ణయించుకున్నట్లు సమాచారం.
భారత తుది జట్టు(అంచనా)
యశస్వి జైస్వాల్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), శుభమన్ గిల్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, సంజు శాంసన్, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), అక్షర్ పటేల్, యుజ్వేంద్ర చాహల్, అర్ష్దీప్ సింగ్, ముఖేష్ కుమార్.
చదవండి: Asia Cup 2023: కేఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్ దూరం.. రిస్క్ వద్దనే!
Comments
Please login to add a commentAdd a comment