వెస్టిండీస్‌తో మూడో టీ20లో టీమిండియా అద్భుత విజయం సాధించినప్పటికీ.. కెప్టెన్ హార్దిక్ పాండ్యా మాత్రం తీవ్ర విమర్శలు ఎదుర్కరొంటున్నాడు. యువ సంచలనం తిలక్ వర్మను హాఫ్ సెంచరీ చేయనీవ్వకుండా హార్దిక్ మ్యాచ్ ఫినిష్ చేయడమే ఇందుకు కారణం. తిలక్ వర్మ తన హాఫ్ సెంచరీకి కేవలం ఒక్క పరుగు దూరంలో ఉన్నాడని తెలిసి కూడా.. హార్దిక్ సిక్స్ కొట్టి మ్యాచ్ ముగించడం పట్ల ఫ్యాన్స్ ఆసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ఇదే విషయంపై టీమిండియా మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా స్పందించాడు. తిలక్ వర్మకు తన హాఫ్ సెంచరీని పూర్తి చేసే అవకాశం హార్దిక్ ఇచ్చి ఉంటే బాగుండేదని ఆకాష్ చోప్రా అభిప్రాయపడ్డాడు. కాగా ఈ మ్యాచ్‌లో 37 బంతుల్లో 49 పరుగులు చేసిన తిలక్ వర్మ.. తన హాఫ్ సెంచరీ మార్క్‌కు కేవలం ఒక్క రన్ దూరంలో ఉండిపోయాడు.
తిలక్ వర్మ ఒక అద్భుతం. అతడు బ్యాటింగ్ స్టైల్, దూకుడు నన్ను ఎంతో అకట్టుకుంది. తొలి మూడు ఇన్నింగ్స్‌లో 30కి పైగా పరుగులు చేసిన రెండో భారత ఆటగాడు కూడా. తన రెండో మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ సాధించాడు. అదే విధంగా మూడో మ్యాచ్‌లో కూడా దగ్గరకు వచ్చాడు. కానీ దురదృష్టవశాత్తూ తన రెండో ఫిప్టీ మార్క్‌ను అందుకోలేకపోయాడు. సూర్య ఔటైన వెంటనే హార్దిక్ బ్యాటింగ్‌కు వచ్చాడు. నాటౌట్ ఉండి మ్యాచ్‌ను ఫినిష్ చేయాలని తిలక్‌కు హార్దిక్ చెప్పాడు.
అటువంటి అప్పుడు హార్దిక్ ఎందుకు పెద్ద షాట్లకు ప్రయాత్నించాడో నాకు అర్ధం కావడం లేదు. అక్కడ నెట్‌రన్ రేట్ కూడా అవసరం లేదు. 13 బంతుల్లో 2 పరుగులు అవసరం. అటువంటి సమయంలో సిక్స్ కొట్టి మ్యాచ్‌ను ఫినిష్ చేశాడు. నావరకు అయితే సింగిల్ తీసి తిలక్‌కు హార్దిక్ ఇవ్వాల్సింది. అయితే వ్యక్తిగత మైలురాళ్ల గురించి పట్టించుకోకూడదని హార్దిక్ అలా చేశాడమో" అని తన యూట్యూబ్ ఛానల్‌లో ఆకాష్ చోప్రా పేర్కొన్నాడు.
చదవండి: IND Vs WI 3rd T20I: మరీ ఇంత స్వార్ధమా.. ధోనిని చూసి నేర్చుకో! ఏంటి హార్దిక్ ఇది? పాపం తిలక్ వర్మ
Comments
Please login to add a commentAdd a comment