టీ20 క్రికెట్‌లో టీమిండియా కెప్టెన్ హార్దిక్ పాండ్యా అరుదైన ఘనత సాధించాడు. టీ20ల్లో 4000 పరుగులతో పాటు 150 వికెట్లు సాధించిన తొలి భారత క్రికెటర్‌గా హార్దిక్ చరిత్ర సృష్టించాడు. గయానా వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన రెండో టీ20లో బ్రాండన్ కింగ్‌ను ఔట్ చేసిన హార్దిక్.. ఈ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. టీ20 క్రికెట్‌లో ఇప్పటివరకు హార్దిక్ ఇప్పటివరకు 4391 పరుగులతో పాటు 152 వికెట్లు పడగొట్టాడు.
కాగా టీ20ల్లో హార్దిక్ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. 2015 ముంబై ఇండియన్స్ తరపున ఐపీఎల్ అరంగేట్రం చేసిన హార్దిక్.. ఇప్పుడు గుజరాత్ టైటాన్స్ సారధిగా వ్యవహరిస్తున్నాడు. తన ఐపీఎల్ కెరీర్‌లో ఇప్పటివరకు 123 మ్యాచ్‌లు ఆడిన పాండ్యా, 30.38 సగటుతో 2309 పరుగులు చేశాడు. అదే విధంగా 2016లో ఎంస్ ధోని సారధ్యంలో అంతర్జాతీయ క్రికెట్‌లోకి హార్దిక్ అడుగుపెట్టాడు. అనంతరం భారత జట్టులో కీలక ఆటగాడిగా ఈ గుజరాత్ ఆటగాడిగా కొనసాగుతున్నాడు.
వరుసగా రెండో ఓటమి..
కరేబియన్ పర్యటనలో టీమిండియా మరో ఓటమి చవిచూసింది. గయానా వేదికగా విండీస్‌తో జరిగిన రెండో టీ20లో రెండు వికెట్ల తేడాతో భారత్ ఓటమి పాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 152 పరుగులు మాత్రమే చేసింది. తిలక్ వర్మ 41 బంతుల్లో 5 ఫోర్లు ఒక సిక్స్‌తో 51 పరుగులు చేశాడు. ఓపెనర్ ఇషాన్ కిషన్(27), కెప్టెన్ హార్దిక్ పాండ్యా(24) పర్వాలేదనిపించారు.
మిగతా బ్యాటర్లు శుబ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్, సంజు శాంసన్, అక్షర్ పటేల్ దారుణంగా విఫలం అయ్యారు. విండీస్ బౌలర్లలో అకిల్ హోసీన్, అల్జారి జోసెఫ్, షెఫర్డ్ తలా 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం 153 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్ 18.5 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి ఛేదించింది. విండీస్ బ్యాటర్లలో నికోలస్ పూరన్ (40 బంతుల్లో 67; 6 ఫోర్లు, 4 సిక్సర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. భారత బౌలర్లలో హార్దిక్ పాండ్యా మూడు వికెట్లు, చహల్ రెండు, అర్ష్‌దీప్, ముఖేష్ కుమార్ తలా వికెట్ సాధించారు.
చదవండి: #Sarfaraz Khan: కశ్మీర్ యువతిని పెళ్లాడిన ముంబై క్రికెటర్.. ఫోటోలు, వీడియోలు వైరల్!
Comments
Please login to add a commentAdd a comment