వెస్టిండీస్‌తో మూడో టీ20లో అద్భుత విజయం సాధించిన టీమిండియా.. ఇప్పుడు మరో కీలక పోరుకు సిద్దమైంది. ఫ్లోరిడా వేదికగా శనివారం విండీస్‌తో జరగనున్న నాలుగో టీ20లో భారత్ తాడోపేడో తెల్చుకోనుంది.
ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను సమం చేయాలని హార్దిక్ సేన భావిస్తోంది. నాలుగో టీ20లో టీమిండియా పలు మార్పులతో బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. వరుసగా మూడు మ్యాచ్‌ల్లో విఫలమైన శుబ్‌మన్ గిల్‌పై వేటు వేయాలని జట్టు మెనెజ్‌మెంట్ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
అతడి స్ధానంలో ఇషాన్ కిషన్‌ను తిరిగి మళ్లీ జట్టులోకి తీసుకురావాలని కెప్టెన్ హార్ధిక్ పాండ్యా, కోచ్ రాహుల్ ద్రవిడ్ యోచిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సిరీస్‌లో మూడు మ్యాచ్‌లు ఆడిన గిల్ కేవలం 19 పరుగులు మాత్రమే చేశాడు. ఇక నాలుగో టీ20 జరిగే ఫ్లోరిడా మైదానం ఫాస్ట్‌బౌలర్లకు కాస్త అనుకూలంగా ఉంటుంది.
ఈ క్రమంలో అదనపు పేసర్‌తో టీమిండియా ఆడనున్నట్లు తెలుస్తోంది. స్పిన్నర్ యజువేంద్ర చాహల్ స్ధానంలో పేసర్ అవేష్ ఖాన్‌కు తుది జట్టులొ ఛాన్స్ ఇవ్వనున్నట్లు పలు రిపోర్టులు పేర్కొంటున్నాయి. అదేవిధంగా అరంగేట్ర మ్యాచ్‌లో విఫలమైన యువ ఓపెనర్ యశస్వీ జైశ్వాల్‌ను కొనసాగించే ఛాన్స్ ఉంది.
పిచ్ రిపోర్డు
ఫ్లోరిడాలోని సెంట్రల్ బ్రోవార్డ్ రీజినల్ పార్క్ మైదానం బ్యాటర్లకు స్వర్గదామం. స్పిన్నర్లకు కాకుండా పేసర్లకు ఈ వికెట్ కాస్త అనుకూలంగా ఉంటుంది. ఈ ఏడాది ఇదే వేదికలో మేజర్ లీగ్ క్రికెట్ టోర్నీలో భాగంగా జరిగిన మ్యాచ్‌ల్లో భారీ స్కోర్లు నమోదయ్యాయి. ఇప్పటివరకు ఈ వేదికపై 14 మ్యాచ్‌లు జరగ్గా.. తొలుత బ్యాటింగ్ చేసిన జట్లు 11 సందర్భాల్లో విజయం సాధించాయి. ఈ నేపధ్యంలో టాస్ గెలిచిన జట్టు తొలుత బ్యాటింగ్ ఎంచుకునే ఛాన్స్ ఉంది.
భారత తుది జట్టు(అంచనా)
ఇషాన్ కిషన్ ,యశస్వి జైస్వాల్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), సంజు శాంసన్ (వికెట్ కీపర్), అక్సర్ పటేల్, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్, ముఖేష్ కుమార్
చదవండి: Rohit- Virat: నేను, కోహ్లి అందుకే ఆడటం లేదు.. అయినా జడ్డూ గురించి ఎందుకు అడగరు: రోహిత్
Comments
Please login to add a commentAdd a comment