టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ మరోసారి తీవ్ర నిరాశపరిచాడు. వెస్టిండీస్ టూర్‌కు భారత జట్టులో చోటు దక్కించుకున్న శాంసన్.. తనకు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోలేకపోయాడు. విండీస్‌తో వన్డే సిరీస్‌లో ఒక హాఫ్ సెంచరీ సాధించిన ఈ కేరళ బ్యాటర్.. టీ20 సిరీస్‌లో మాత్రం పూర్తిగా తెలిపోయాడు.
నిర్ణయాత్మక ఐదో టీ20లో కీలక సమయంలో బ్యాటింగ్‌కు వచ్చిన సంజూ.. 9 బంతుల్లో 13 పరుగులు చేసి రొమారియో షెఫార్డ్ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు. ఓవరాల్‌గా ఈ సిరీస్‌లో మూడు మ్యాచ్‌లు ఆడిన శాంసన్.. 32 పరుగులు మాత్రమే చేశాడు. ఇక ఫైనల్ టీ20లో పక్కా ప్రాణాళికతో శాంసన్‌ను ఔట్ చేసినట్లు విండీస్ పేసర్ రొమారియో షెఫార్డ్ తెలిపాడు.
పోస్ట్ మ్యాచ్ ప్రేజేంటేషన్‌లో షెఫార్డ్ మాట్లాడుతూ.. "గత రెండు నెలలగా మేము గడ్డు పరిస్ధితులను ఎదుర్కొంటున్నాము. ఇటువంటి సమయంలో భారత్ వంటి జట్టును ఓడించి సిరీస్ సొంతం చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది.ఆఖరి టీ20లో అద్భుతంగా ఆడిన నికోలస్ పూరన్, బ్రాడన్ కింగ్‌లకు ధన్యవాదాలు.
నా బౌలింగ్ స్ట్రైల్‌ను కూడా నేను మార్చుకున్నాను. సరైన ప్రదేశాల్లో బౌలింగ్ చేసి బ్యాటర్లకు ఇబ్బంది పెట్టాను. ముఖ్యంగా సంజూ శాంసన్, సూర్యకుమార్ యాదవ్‌ను ఔట్‌చేయడానికి ముందుగానే ప్రణాళికలు సిద్దం చేశాం. సంజూకు వికెట్ల దగ్గర బౌలింగ్ చేసి పెవిలియన్‌కు పంపాలనుకున్నాను. అదేవిధంగా సూర్యకు లాంగాన్ దిశగా షాట్ ఆడించి ఔట్ చేయడమే మా టార్గెట్. అందులో మేము విజయం సాధించామని పేర్కొన్నాడు. కాగా శాసంన్ షెఫార్డ్ బౌలింగ్‌లో ఔట్ కాగా.. సూర్య హోల్డర్ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు.
చదవండి: ODI WC 2023: ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ సంచలన నిర్ణయం.. !
Comments
Please login to add a commentAdd a comment