Yashasvi Jaiswal fails on T20I debut: భారీ అంచనాల నడుమ అంతర్జాతీయ టీ20లలో అరంగేట్రం చేసిన టీమిండియా యువ సంచలనం యశస్వి జైశ్వాల్ పూర్తిగా విఫలమయ్యాడు. టెస్టుల్లో అదరగొట్టిన ఈ ముంబై బ్యాటర్.. తనకు కలిసొచ్చిన పొట్టి ఫార్మాట్‌లో అదరగొడతాడనుకున్న అభిమానులకు నిరాశే మిగిల్చాడు.
వెస్టిండీస్‌తో టీమిండియా మూడో టీ20 సందర్భంగా యశస్వి జైశ్వాల్ ఇంటర్నేషనల్ టీ20లలో అడుగుపెట్టిన విషయం తెలిసిందే. టీమిండియా ఓపెనర్‌గా శుబ్‌మన్ గిల్‌తో కలిసి బరిలోకి దిగిన ఈ లెఫ్టాండర్ రెండు బంతులు ఎదుర్కొని కేవలం ఒకే ఒక్క పరుగు చేశాడు.
టెస్టుల్లో అదరగొట్టి
విండీస్ పేసర్ ఒబెడ్ మెకాయ్ బౌలింగ్‌లో అల్జారీ జోసెఫ్‌నకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. కాగా వెస్టిండీస్‌తో టెస్టు సందర్భంగా యశస్వి అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన విషయం తెలిసిందే. అరంగేట్ర మ్యాచ్‌లోనే సెంచరీతో అదరగొట్టాడు ఈ కుర్ర బ్యాటర్.
కెప్టెన్ రోహిత్ శర్మకు ఓపెనింగ్ జోడీగా బరిలోకి దిగి తొలి టెస్టులో 171, రెండో టెస్టులో వరుసగా 57, 38 పరుగులతో రాణించాడు. అరుదైన రికార్డులెన్నింటినో తన ఖాతాలో వేసుకుని సంచలనం సృష్టించాడు.
ఐపీఎల్‌లో సెంచరీ
ఇదిలా ఉంటే.. ఐపీఎల్‌లో యశస్వి జైశ్వాల్ రాజస్తాన్ రాయల్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజా ఎడిషన్‌లో ఓ సెంచరీ(124) చేసిన యశూ.. 14 ఇన్నింగ్స్ ఆడి 625 పరుగులు సాధించాడు.
ఇలా క్యాష్ రిచ్ లీగ్‌లో అదరగొట్టడంతో పాటు.. తొలి టెస్టులోనే సెంచరీ సాధించిన యశస్వి.. టీ20 అరంగేట్రంపై సహజంగానే అభిమానులు గంపెడాశలు పెట్టుకున్నారు. కానీ అతడు విఫలం కావడం జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ క్రమంలో కొంతమంది నెటిజన్లయితే యశస్విని విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు.
ఇషాన్‌ను కాదని
‘‘ఇషాన్ కిషన్(6, 27) సరిగ్గా ఆడటం లేదని నీకు ఛాన్స్ ఇస్తే.. నువ్వు పొడిచిందేమిటి? ఐపీఎల్‌లో ఆడతావు కానీ.. దేశం కోసం ఆడవా? ఇదే రిపీట్ అయితే.. మళ్లీ వెనక్కి వెళ్లిపోవాల్సిందే!’’ అంటూ మీమ్స్ షేర్ చేస్తూ వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. అయితే, ఫ్యాన్స్ మాత్రం.. ‘‘సచిన్ టెండుల్కర్ అంతటి దిగ్గజమే తొలి మ్యాచ్‌లో విఫలమయ్యాడు.
ఆటలో ఇవన్నీ సహజం. యశస్వి తిరిగి పుంజుకుంటాడు. తానేంటో నిరూపించుకుంటాడు’’ అని అండగా నిలుస్తున్నారు. కాగా వెస్టిండీస్‌తో తొలి రెండు టీ20లలో పరాజయం పాలైన టీమిండియా.. మూడో టీ20లో గెలుపు సాధించింది. తద్వారా ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో ఆతిథ్య జట్టు ఆధిక్యాన్ని 2-1కు తగ్గించగలిగింది.
చదవండి: మా కెప్టెన్ గట్టిగానే వార్నింగ్ ఇచ్చాడు.. అదే నా మెదడును తొలిచేసింది! అందుకే..
చరిత్ర సృష్టించిన సూర్యకుమార్.. ప్రపంచంలోనే రెండో ఆటగాడిగా!
Comments
Please login to add a commentAdd a comment