వెస్టిండీస్‌తో నాలుగో టీ20.. తొమ్మిది వికెట్ల తేడాతో టీమిండియా గెలుపు | Ind Vs WI 4th T20: Arshdeep Kuldeep Shines West Indies Score 178 | Sakshi
Sakshi News home page

Ind Vs WI: వెస్టిండీస్‌తో నాలుగో టీ20.. తొమ్మిది వికెట్ల తేడాతో టీమిండియా గెలుపు

Published Sat, Aug 12 2023 9:54 PM | Last Updated on Sun, Aug 13 2023 12:03 AM

Ind Vs WI 4th T20: Arshdeep Kuldeep Shines West Indies Score 178 - Sakshi

West Indies vs India, 4th T20: వెస్టిండీస్‌తో నాలుగో టీ20లో టీమిండియా ఘన విజయం సాధించింది . శుభమాన్ గిల్ , యశస్వీ జైస్వాల్‌ల అద్భుత బ్యాటింగ్ ప్రదర్శనతో టీమిండియా వెస్టిండీస్ పై  సునాయాసంగా  విజయం సాధించింది.

టీమిండియాతో నాలుగో టీ20లో వెస్టిండీస్‌ మంచి స్కోరు నమోదు చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. షిమ్రన్‌ హెట్‌మెయిర్‌ 61 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. కాగా అమెరికాలోని ఫ్లోరిడాలో హార్దిక్‌ సేన.. రోవ్‌మన్‌ పావెల్‌ బృందం నాలుగో టీ20 మ్యాచ్‌లో తలపడుతున్నాయి.

టాస్‌ గెలిచిన కరేబియన్‌ జట్టు తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది. అర్ష్‌దీప్‌ సింగ్‌ ఆరంభంలోనే ఓపెనర్లు కైల్‌ మేయర్స్‌(17), బ్రాండన్‌ కింగ్‌(18)లను పెవిలియన్‌కు పంపాడు. వన్‌డౌన్‌ బ్యాటర్‌ షాయీ హోప్‌(45) జట్టును ఆదుకునే ప్రయత్నం చేయగా.. నికోలస్‌ పూరన్‌(1), రోవ్‌మన్‌ పావెల్‌(1)లను ఒకే ఓవర్లో కుల్దీప్‌ యాదవ్‌ అవుట్‌ చేశాడు.

హోప్‌నకు తోడైన షిమ్రన్‌ హెట్‌మెయిర్‌(61) అర్ధ శతకంతో అండగా నిలిచాడు. వీరిద్దరి అద్భుత బ్యాటింగ్‌తో 8 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది వెస్టిండీస్‌. భారత బౌలర్లలో అర్ష్‌దీప్‌ సింగ్‌కు మూడు, కుల్దీప్‌నకు రెండు, చహల్‌, ముకేశ్‌ కుమార్‌, అక్షర్‌ పటేల్‌ ఒక్కో వికెట్‌ తమ ఖాతాలో వేసుకున్నారు.

ఇదిలా ఉంటే.. ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో కరేబియన్‌ జట్టు ఇప్పటికే 2-1తో ఆధిక్యంలో ఉంది. ఒకవేళ ఈ మ్యాచ్‌లో గనుక తేడా జరిగితే టీమిండియాకు ఘోర పరాభవం తప్పదు.  అయితే, బ్యాటింగ్‌ పిచ్‌పై 179 పరుగుల టార్గెట్‌ టీమిండియాకు పెద్ద సవాలు కాబోదని అభిమానులు ధీమాగా ఉన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement