బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌లోనూ టీమిండియా శుభారంభం చేసింది. గ్వాలియర్ వేదికగా ఆదివారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో ప్రత్యర్థిని ఏడు వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించింది. కొత్త మైదానంలో తొలుత బంగ్లాను 127 పరుగులకే పరిమితం చేసిన భారత్.. మరో 49 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించింది.
ఇక యువ ఆటగాళ్లతో నిండిపోయిన జట్టు ముందు కూడా చతికిల పడిన బంగ్లాదేశ్ మరోసారి చేతులెత్తేసింది. ఈ గెలుపు ద్వారా భారత టీ20 జట్టు పూర్తిస్థాయి కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్ ఖాతాలో నాలుగో విజయం నమోదైంది. ఈ సందర్భంగా మ్యాచ్ అనంతరం అతడు మాట్లాడుతూ.. జట్టు ప్రదర్శన పట్ల సంతృప్తి వ్యక్తం చేశాడు.
మా బ్యాటింగ్ గొప్పగా ఉంది.. ఆ తలనొప్పి మంచిదే
‘‘జట్టు సమావేశమైన సమయంలో మా నైపుణ్యాలకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందించుకున్నాం. వాటిని పక్కాగా అమలు చేయడంలో సఫలమయ్యాము. మా వాళ్లు పట్టుదలగా ఆడారు. కొత్త గ్రౌండ్‌లో మేము బ్యాటింగ్ చేసిన విధానం గొప్పగా అనిపించింది.
ఇక ఎవరితో బౌలింగ్ చేయించాలో తెలియనన్ని మంచి ఆప్షన్లు ఉండటం మాకు ఒక రకంగా తలనొప్పి కలిగించేదే. అయితే, అంతకంటే మంచి విషయం మరొకటి ఉండదు. ప్రతి మ్యాచ్‌లోనూ మేము కొత్త విషయాలు నేర్చుకుంటున్నాం.
అయితే, ఎప్పటికప్పుడు లోపాలు సరిచేసుకుంటూ ముందుకు సాగితేనే అనుకున్న లక్ష్యాలను సాధించగలుగుతాం. తదుపరి మ్యాచ్ కోసం జట్టు సభ్యులతో కూర్చుని చర్చించి వ్యూహాలు సిద్ధం చేసుకుంటాం’’ అని సూర్యకుమార్ యాదవ్ పేర్కొన్నాడు.
నజ్ముల్ షాంటో బృందం విలవిల
కాగా గ్వాలియర్‌లో కొత్తగా ప్రారంభించిన ‘శ్రీమంత్ మాధవ్‌రావ్ సింధియా క్రికెట్ స్టేడియం’లో టాస్ గెలిచిన టీమిండియా.. బంగ్లాను తొలుత బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. భారత బౌలర్ల దెబ్బకు నజ్ముల్ షాంటో బృందం పరుగులు రాబట్టడానికి ఆపసోపాలు పడింది. 19.5 ఓవర్లలో 127 పరుగులకు ఆలౌట్ అయింది.
భారత పేసర్ అర్ష్‌దీప్ సింగ్ ఓపెనర్లు పర్వేజ్ హొసేన్ ఎమాన్(8), లిటన్ దాస్(4) రూపంలో కీలక వికెట్లతో పాటు.. టెయిలెండర్ ముస్తాఫిజుర్(1) వికెట్‌ను కూడా తన ఖాతాలో వేసుకున్నాడు.
ఇతర పేసర్లలో అరంగేట్ర బౌలర్ మయాంక్ యాదవ్, హార్దిక్ పాండ్యా ఒక్కో వికెట్ పడగొట్టాడరు. ఇక స్పిన్నర్లలో వరుణ్ చకవర్రి(3/31), వాషింగ్టన్ సుందర్(1/12) కూడా మెరవగా.. అరంగేట్ర ఆటగాడు నితీశ్ కుమార్ రెడ్డి సైతం రెండు ఓవర్లు బౌలింగ్ చేశాడు.
మెరుపు ఇన్నింగ్స్
లక్ష్య ఛేదనలో టీమిండియాకు బంగ్లా బౌలర్ల నుంచి పెద్దగా ప్రతిఘటన ఎదురుకాలేదు. కొత్త ఓపెనింగ్ జోడీ సంజూ శాంసన్(19 బంతుల్లో 29), అభిషేక్ శర్మ(7 బంతుల్లో 16) సహా వన్‌డౌన్‌లో వచ్చిన సూర్య(14 బంతుల్లో 29) మెరుపు ఇన్నింగ్స్ ఆడారు. నితీశ్ రెడ్డి 15 బంతుల్లో 16 పరుగులు చేసి నాటౌట్‌గా నిలవగా.. హార్దిక్ పాండ్యా ధనాధన్ ఇన్నింగ్స్‌తో చెలరేగాడు.
ఈ పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ 16 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 39 పరుగులతో అజేయంగా నిలిచాడు. సిక్సర్‌తో టీమిండియా విజయాన్ని ఖరారు చేశాడు. ఇక బంగ్లాను తక్కువ స్కోరుకే పరిమితం చేయడంలో కీలక పాత్ర పోషించిన అర్ష్‌దీప్ సింగ్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.
కాగా ఇటీవల టీమిండియాతో టెస్టు సిరీస్‌లో బంగ్లాదేశ్ 2-0తో క్లీన్‌స్వీప్ అయిన విషయం తెలిసిందే. టీ20 సిరీస్‌లోనూ 1-0తో వెనుకబడింది. ఇరుజట్ల మధ్య బుధవారం రెండో మ్యాచ్ జరుగనుంది.
చదవండి: IND Vs BAN 1st T20I: పాపం బిష్ణోయ్..కావాలనే పక్కన పెట్టారా? కారణం గౌతీనా?
𝙎𝙈𝘼𝘾𝙆𝙀𝘿 with power and timing!@hardikpandya7 dispatches one over deep extra cover 🔥
Live - https://t.co/Q8cyP5jXLe#TeamIndia | #INDvBAN | @IDFCFIRSTBank pic.twitter.com/kNaZjSl1Tq— BCCI (@BCCI) October 6, 2024
Comments
Please login to add a commentAdd a comment