Sanju Samson Needs 21 Runs In 1st WI T20I To Join Virat, Rohit In Elite List - Sakshi
Sakshi News home page

IND vs WI: అరుదైన రికార్డుకు చేరువలో శాంసన్‌.. కోహ్లి, రోహిత్‌ సరసన!

Published Thu, Aug 3 2023 1:48 PM | Last Updated on Thu, Aug 3 2023 1:56 PM

Sanju Samson Needs 21 Runs In 1st WI T20I To Join Virat, Rohit In Elite List - Sakshi

ట్రినిడాడ్‌ వేదికగా వెస్టిండీస్‌తో తొలి టీ20లో తలపడేందుకు టీమిండియా సిద్దమైంది. విండీస్‌తో ఆఖరి వన్డేలో కనబరిచిన జోరును టీ20 సిరీస్‌లో కూడా కొనసాగించాలని భారత్‌ భావిస్తోంది. ఇక ఈ సిరీస్‌కు రోహిత్‌ శర్మ దూరం కావడంతో హార్దిక్‌ పాండ్యా సారధ్యం వహించనున్నాడు. అదే విధంగా విరాట్‌ కోహ్లికి కూడా ఈ సిరీస్‌కు విశ్రాంతి ఇచ్చారు. ఈ సిరీస్‌ యువ ఆటగాళ్లు తమ సత్తా నిరూపించుకోవడానికి సువర్ణావకాశం.

ఈ మ్యాచ్‌కు ముందు భారత వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ సంజూ శాంసన్‌ను ఓ అరుదైన రికార్డు ఊరిస్తోంది. ఈ మ్యాచ్‌లో శాంసన్‌ మరో 21 పరుగులు సాధిస్తే.. టీ20 క్రికెట్‌లో 6000 క్లబ్‌లో చేరనున్నాడు. తద్వారా ఈ ఘనత సాధించిన 13వ భారత బ్యాటర్‌గా శాంసన్‌ రికార్డులకెక్కనున్నాడు. ఇప్పటి వరకు 241 టీ20 మ్యాచ్‌లు ఆడిన సంజూ..5979 పరుగులు సాధించాడు. ఇక అరుదైన ఫీట్‌ సాధించిన జాబితాలో టీమిండియా స్టార్‌ క్రికెటర్‌ విరాట్‌ కోహ్లి(423 మ్యాచ్‌ల్లో 11,035 పరుగులు) అగ్రస్ధానంలో కొనసాగుతున్నాడు.

ఈ అరుదైన ఘనత సాధించిన భారత ఆటగాళ్లు వీరే..
విరాట్‌ కోహ్లి(11,965 పరుగులు)
రోహిత్‌ శర్మ(11,035 పరుగులు)
శిఖర్‌ ధావన్‌(9645 పరుగులు)
సురేష్‌ రైనా(8654 పరుగులు)
రాబిన్‌ ఉతప్ప(7272 పరుగులు)
ఎంఎస్‌ ధోని(7271 పరుగులు)
దినేష్‌ కార్తీక్‌(7081 పరుగులు)
కేఎల్‌ రాహుల్‌(7066 పరుగులు)
మనీష్‌ పాండే(6810 పరుగులు)
సూర్యకుమార్‌ యాదవ్‌(6503 పరుగులు)
గౌతం గంభీర్‌(6402 పరుగులు)
అంబటి రాయుడు(6028 పరుగులు)
చదవండి:
 Virat Kohli: కోహ్లితో పాటు ప్రపంచకప్‌ గెలిచారు! ఇన్‌కమ్‌ టాక్స్‌ ఆఫీసర్‌ నుంచి ఇప్పుడిలా! జడ్డూను చూశారా?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement