టీ20 క్రికెట్‌లో నెం1గా ఉన్న టీమిండియాకు వెస్టిండీస్ భారీ షాకిచ్చింది. స్వదేశంలో భారత్‌తో జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 3-2తో విండీస్ సొంతం చేసుకుంది. ఫ్లోరిడా వేదికగా ఆఖరి టీ20లో 8 వికెట్ల తేడాతో భారత్‌ను ఓడించిన వెస్టిండీస్.. ఆరేళ్ల తర్వాత టీ20 సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఇక సిరీస్ ఓటమిపై మ్యాచ్ అనంతరం టీమిండియా హెడ్‌కోచ్ రాహుల్ ద్రవిడ్ విలేకరుల సమావేశంలో మాట్లాడాడు. బ్యాటింగ్ వైఫల్యం కారణంగానే సిరీస్‌ను కోల్పోయామని ద్రవిడ్ తెలిపాడు.
"తొలుత టెస్టు, వన్డే సిరీస్‌లో మా జట్టు అత్యుత్తమ ప్రదర్శన కనబరిచింది. అదే విధంగా టీ20 సిరీస్‌లో కూడా మేము తొలి రెండు మ్యాచ్‌లు ఓడిపోయాం. అయినప్పటికీ మేము అద్భుతమైన కమ్‌బ్యాక్ ఇచ్చి సిరీస్‌ను సమం చేశాం. కానీ ఆఖరి మ్యాచ్‌లో ఓడి సిరీస్‌ను కోల్పోయాం. ఈ సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌లు, ఐదో టీ20లో మేము కొన్ని తప్పులు చేశాం. ఈ మూడు మ్యాచ్‌ల్లో కూడా బ్యాటింగ్ బాగా చేయలేదు. అయితే జట్టు మొత్తం యువ ఆటగాళ్లతో కూడి ఉన్నది. కాబట్టి కొన్నిసార్లు మనం ఆశించిన ఫలితాలు రాకపోవచ్చు. ఈ సిరీస్‌లో యువ ఆటగాళ్లకు ఛాన్స్‌లు ఇవ్వాలని నిర్ణయించకున్నాం.
అదేవిధంగా సరికొత్త కాంబనేషన్స్‌ను కూడా ప్రయత్నించాం. ఈ విషయంలో అయితే కొంతమెరకు మేము విజయం సాధించాం. జైశ్వాల్, తిలక్ వంటి యువ ఆటగాళ్లు తమ సత్తాచాటారు. నాలుగో టీ20లో జైశ్వాల్ తన టాలెంట్ చూపించాడు. తిలక్ కూడా బ్యాటింగ్, ఫీల్డింగ్‌తో అదరగొట్టాడు. అయితే విండీస్ పర్యటనలో మాకు కొన్ని పాజిటివ్ అంశాలతో పాటు ప్రతికూల విషయాలు ఉన్నాయి.
భవిష్యత్తులో మేము ఈ విషయాల్లో మెరుగవ్వాలన్నది ఈ కరేబియన్ టూర్‌లో తెలుసుకున్నాం. ముఖ్యంగా మా బ్యాటింగ్ డెప్త్‌ను ఇంకా పెంచుకోవాలి. బౌలింగ్ అయితే మరి అంత బలహీనంగా లేదు. మాకు ముందు ఇంకా చాలా సవాళ్లు ఎదురుకానున్నాయి. అందుకు తగట్టు సిద్దం కావడమే మా పని అని" పోస్ట్‌మ్యాచ్ ప్రేజేంటేషన్‌లో ద్రవిడ్ పేర్కొన్నాడు.
చదవండి: Ind vs WI: కొరకరాని కొయ్య.. తిలక్ వర్మ నుంచి ఇది ఊహించలేదు! వీడియో వైరల్
Comments
Please login to add a commentAdd a comment