స్వదేశంలో టీమిండియాతో టెస్టు, వన్డే సిరీస్‌లు కోల్పోయిన వెస్టిండీస్ మరో కీలకపోరుకు సిద్దమైంది. టీమిండియాతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో విండీస్‌తో అమీతుమీ తెల్చుకోనుంది. ఈ సిరీస్‌లో భాగంగా తొలి టీ20 గురువారం ట్రినిడాడ్ వేదికగా ఇరు జట్ల మధ్య జరగనుంది. కనీసం టీ20 సిరీస్‌లోనైనా నెగ్గి పరువునిలబెట్టుకోవాలనే పట్టుదలతో విండీస్ బరిలోకి దిగుతోంది.
ఇక ఈ టీ20 సిరీస్‌కు విధ్వంసకర ఆటగాడు నికోలస్ పూరన్, స్టార్ ఆల్‌రౌండర్ తిరిగి జట్టులోకి రావడం విండీస్‌కు కాస్త ఊరటను కలిగించే ఆంశం. మెజర్ లీగ్ క్రికెట్ టోర్నీ కారణంగా భారత్‌తో వన్డే సిరీస్‌కు పూరన్ దూరమైన సంగతి తెలిసిందే. అదే విధంగా హోల్డర్‌కు సెలక్టర్లు విశ్రాంతి ఇచ్చారు. ఇప్పుడు వీరిద్దరూ తిరిగి రావడం విండీస్ కొత్త జోష్‌లో కన్పిస్తోంది. వీరిద్దరికి తొలి టీ20లో చోటుదక్కడం ఖాయమన్పిస్తోంది.
భారత బౌలర్లూ జాగ్రత్త..
ఇక పూరన్ ప్రస్తుతం భీకర ఫామ్‌లో ఉన్నాడు. ఇటీవలే జరిగిన మేజర్ లీగ్ క్రికెట్ ఫైనల్లో విధ్వంసం సృష్టించాడు. కేవలం 40 బంతుల్లోనే సెంచరీ సాధించి సత్తాచాటాడు. ఓవరాల్‌గా ఓవరాల్‌గా ఈ మ్యాచ్‌లో 55 బంతులు ఎదుర్కొన్న పూరన్ 10 ఫోర్లు, 13 సిక్స్‌లతో 137 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. అంతేకాకుండా టోర్నీ టాప్ స్కోరర్‌గా పూరన్(388) నిలిచాడు. సంచలన ఫామ్‌లో ఉన్న పూరన్ చెలరేగితే భారత బౌలర్లకు కష్టాలు తప్పవు. కాబట్టి అతడిని వీలైనంత వేగం పెవిలియన్‌కు పంపితే భారత జట్టుకు అంతమంచిది.
హెట్‌మైర్ కూడా..
అదే విధంగా ఏడాది తర్వాత షెమ్రాన్ హెట్‌మైర్ కూడా తిరిగి టీ20 జట్టులోకి వచ్చాడు. అతడు విండీస్ జట్టుకు ఫినిషర్‌గా మారే అవకాశం ఉంది. ఐపీఎల్‌లో కూడా రాజస్తాన్ రాయల్స్‌కు అతడు ఫినిషర్‌గా ఎన్నో అద్భుతమైన విజయాలు అందిచాడు. ఈ క్రమంలో హెట్‌మైర్ కూడా తన బ్యాట్‌కు పనిచెప్పితే కొండంత లక్ష్యం చిన్నబోతోంది. అయితే భారత్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో మాత్రం హెట్‌మైర్ తీవ్ర నిరాశ పరిచాడు.
టీమిండియాదే పై చేయి..
ఇక టీ20ల్లో విండీస్‌పై భారత్‌దే పైచేయి. ఇప్పటివరకు ఇరు జట్లు ముఖాముఖి 25 మ్యాచ్‌ల్లో తలపడగా.. భారత్ 17 సార్లు విజయం సాధించగా, విండీస్ కేవలం 7 సార్లు మాత్రమే గెలుపొందింది.
తొలి టీ20కు విండీస్ తుది జట్టు(అంచనా)
కైల్ మేయర్స్, జాన్సన్ చార్లెస్, నికోలస్ పూరన్ (వికెట్ కీపర్), షాయ్ హోప్, షిమ్రాన్ హెట్మెయర్, రోవ్‌మన్ పావెల్ (కెప్టెన్), జాసన్ హోల్డర్, అకేల్ హోసేన్, అల్జారీ జోసెఫ్, ఒబెడ్ మెక్‌కాయ్, ఒషానే థామస్
చదవండి: #Rinku Singh: ఇంటింటికి గ్యాస్ సిలిండర్లు వేసే పని ఇంకా మానలేదు! ఆయన అంతే..
Comments
Please login to add a commentAdd a comment