జస్ప్రీత్ బుమ్రా సారధ్యంలోని యువ భారత జట్టు ఐర్లాండ్ పర్యటనకు సిద్దమవుతోంది. ఈ టూర్‌లో భాగంగా అతిథ్య ఐర్లాండ్‌తో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో టీమిండియా తలపడనుంది. ఈ సిరీస్ కోసం భారత జట్టు రెండు బ్యాచ్‌లగా ఐర్లాండ్‌కు చేరుకోనుంది. మంగళవారం(ఆగస్టు 15)న జస్ప్రీత్ బుమ్రా, రుత్‌రాజ్ గైక్వాడ్‌తో కూడిన బృందం మొదటి బ్యాచ్‌గా ఐర్లాండ్‌కు పయనం కానుంది.
మరోవైపు విండీస్‌తో టీ20 సిరీస్‌లో భాగంగా ఉన్న తిలక్ వర్మ, జైశ్వాల్, సంజూ శాంసన్ నేరుగా యూఎస్ నుంచి ఐర్లాండ్‌కు బయలదేరునున్నారు. ఆగస్టు 18న డబ్లిన్ వేదికగా జరగనున్న తొలి టీ20తో ఈ సిరీస్ ప్రారంభం కానుంది.
హెడ్‌కోచ్ లేకుండానే..
ఇక ఐర్లాండ్ పర్యటనకు హెడ్‌కోచ్ లేకుండా భారత జట్టు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. వెస్టిండీస్ టూర్ తర్వాత రెగ్యులర్ హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్‌తో పాటు ఇతర కోచింగ్ స్టాప్‌కు బీసీసీఐ విశ్రాంతి ఇవ్వాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలో ఐర్లాండ్ టూర్‌కు టీమిండియా హెడ్‌కోచ్‌గా ఏన్సీఏ ఛీప్ వీవీయస్ లక్ష్మణ్ వ్యవహరించనున్నట్లు వార్తలు వినిపించాయి.
గతంలో చాలాసార్లు ద్రవిడ్ గైర్హజరీలో ఈ హైదరాబాదీనే భారత జట్టు కోచ్‌గా పనిచేశాడు. కానీ ఈ సారి మాత్రం ఐరీష్ టూర్‌కు లక్ష్మణ్ కూడా వెళ్లడం లేదు. క్రిక్‌బజ్ రిపోర్టు ప్రకారం.. ఇండియా-ఏ జట్టు కోచ్‌లు సితాన్షు కోటక్ , సాయిరాజ్ బహుతులే నేతృత్వంలో భారత్ ఈ సిరీస్ ఆడనుంది.
ఐర్లాండ్ సిరీస్‌కు భారత జట్టు: జస్ప్రీత్ బుమ్రా (కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్ , యశస్వి జైస్వాల్, తిలక్ వర్మ, రింకూ సింగ్, సంజు శాంసన్, జితేష్ శర్మ, శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, షాబాజ్ అహ్మద్, రవి బిష్ణోయ్, ప్రసిద్ధ్ కృష్ణ, అర్ష్దీప్ సింగ్ , ముఖేష్ కుమార్, అవేష్ ఖాన్
చదవండి: The Hundred 2023: సన్‌రైజర్స్ ఆటగాడు ఊచకోత.. కేవలం 22 బంతుల్లోనే!
Comments
Please login to add a commentAdd a comment