West Indies vs India, 4th T20I: అమెరికాలోని ఫ్లోరిడా వేదికగా నాలుగో టీ20 ఆరంభంలోనే టీమిండియా యువ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ వెస్టిండీస్‌కు షాకిచ్చాడు. టాస్ గెలిచి దూకుడుగా బ్యాటింగ్ మొదలెట్టిన కరేబియన్లకు రెండో ఓవర్‌లోనే తన పేస్ పదును రుచి చూపించాడు.7 బంతుల్లో 17 పరుగులతో జోరు మీదున్న ఓపెనర్ కైల్ మేయర్స్‌ను పెవిలియన్‌కు పంపాడు.
ఓపెనర్ల పని పట్టి
గంటకు 135 కిలోమీటర్ల వేగంతో దూసుకొచ్చిన బంతిని తప్పుగా అంచనా వేసిన మేయర్స్ వికెట్ కీపర్ క్యాచ్‌గా వెనుదిరిగాడు. ఇక ఈ మ్యాచ్‌లో రెండో వికెట్‌ను కూడా తన ఖాతాలోనే వేసుకున్నాడు అర్ష్‌దీప్. ఆరో ఓవర్ నాలుగో బంతికి మరో ఓపెనర్ బ్రాండన్ కింగ్(18)ను అవుట్ చేశాడు.
Arshdeep loves making these mini comebacks!#WIvIND #INDvWIAdFreeonFanCode pic.twitter.com/ksPeRQB4c2
— FanCode (@FanCode) August 12, 2023
ఒకే ఓవర్లో రెండు వికెట్లు
ఇదిలా ఉంటే.. టీమిండియా చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ సైతం అద్భుత బౌలింగ్‌తో అదరగొట్టాడు. ఒకే ఓవర్లో బిగ్ హిట్టర్లు నికోలస్ పూరన్(1), రోవ్‌మన్ పావెల్(1)ను పెవిలియన్‌కు పంపాడు. ఏడో ఓవర్ ఆరంభంలోనే గూగ్లీతో పూరన్‌ను బోల్తా కొట్టించగా.. సూర్యకుమార్ యాదవ్ బంతిని ఒడిసిపట్టడంలో ఎటువంటి జాప్యం చేయలేదు.
Two wickets in the 1st over of the spell!
— FanCode (@FanCode) August 12, 2023
Chahal in 1st T20I
Kuldeep today 💪#WIvIND #INDvWIAdFreeonFanCode pic.twitter.com/Vos81nSMbx
వైరల్ వీడియోలు
దీంతో వెస్టిండీస్ మూడో వికెట్ కోల్పోయింది. అయితే, మూడు బంతుల వ్యవధిలోనే కరేబియన్ జట్టు కెప్టెన్ పావెల్ ఇచ్చిన క్యాచ్‌ను శుబ్‌మన్ గిల్ అందుకోవడంతో కుల్దీప్ ఖాతాలో రెండో వికెట్ చేరింది.
ఇలా ఆదిలోనే వెస్టిండీస్‌ను దెబ్బ కొట్టిన టీమిండియా బౌలర్లు అర్ష్‌దీప్, కుల్దీప్ యాదవ్‌ల బౌలింగ్ విన్యాసాలకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఇక ఇప్పటికే ఐదు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లో వెస్టిండీస్ 2-1తో ఆధిక్యంలో ఉండగా.. ఫ్లోరిడాలో గెలిచి 2-2తో సమం చేయాలని హార్దిక్ సేన పట్టుదలగా ఉంది.
తుది జట్లు
టీమిండియా:
యశస్వి జైశ్వాల్, శుబ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా(కెప్టెన్), సంజూ శాంసన్( వికెట్ కీపర్), అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, అర్ష్దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్, ముకేష్ కుమార్.
వెస్టిండీస్
బ్రాండన్ కింగ్, కైల్ మేయర్స్, షాయ్ హోప్, నికోలస్ పూరన్(వికెట్ కీపర్), రోవ్‌మన్ పావెల్(కెప్టెన్), షిమ్రన్ హెట్మైర్, జేసన్ హోల్డర్, రొమారియో షెపర్డ్, ఒడియన్ స్మిత్, అకీల్ హోసిన్, ఒబెడ్ మెకాయ్.
Comments
Please login to add a commentAdd a comment